రాములు ఆటోగ్రాఫ్ – Part 8 81

రేణుక రాము వైపు ఆశ్చర్యంగా చూస్తూ….
రేణుక : నువ్వు మాట్లాడుతున్న లాంగ్వేజ్ మా కాలం మాటలకన్నా చాలా బాగున్నాయి….
ఆ మాట వినగానే రాము ఒక్కసారిగా నవ్వి….ఆమె వైపు చూస్తూ….
రాము : మ్యాజిక్ చేస్తాను….చూస్తావా…..
రేణుక : ఆ….ఆ….చూస్తాను….నాకు మ్యాజిక్ అంటే చాలా ఇష్టం….(ఆనందంగా అన్నది)
రాము : మరి నాకేమి ఇస్తావు….
రేణుక : ఏం కావాలో అడుగు….నీకు ఇష్టమైనది ఇస్తాను….(అంటూ చిలిపిగా చూసింది)
రాము : అయితే….అయితే నీ అందమైన ఎర్రటి పెదవులతో నాకు ఒక ముద్దు ఇవ్వాలి….
రేణుక : అది కూడా అడగాలా….నీకు ఎప్పుడు ముద్దు పెట్టుకోవాలని అనిపిస్తే అప్పుడు పెట్టుకోవచ్చు….
రాము : అయితే ఒక్క నిముషం ఆగు….(అంటూ తన సెల్ ఫోన్ లో వెనక వైపు ఉన్న కెమేరాని రేణుకకు చూపిస్తూ) దీని వైపు అందంగా నవ్వుతూ చూడు…(అంటూ సెల్ లో కెమేరా ఆన్ చేసి రేణుక వైపు తిప్పాడు.)
రేణుక నవ్వుతూ రాము చెప్పిన వైపు చూసింది…..రాము సెల్ తో రేణుకని ఫోటో తీసి….సెల్ ని తన చేతుల్లో పెట్టుకుని అటూ ఇటూ తిప్పుతూ మెజీషియన్ లాగా నటిస్తూ ఏదో మంత్రాలు చదువుతున్నట్టు గొనుగుతూ సెల్ లో గ్యాలరీ ఓపెన్ చేసి రేణుకకి తను తీసిన ఆమె ఫోటో చూపించాడు.
తన ఫోటో చూసుకున్న ఆనందంలో రేణుక రాము చేతిలోనుండి ఫోన్ లాక్కోడానికి ట్రై చేస్తూ, “ఎలా….ఎలా….ఎలా వచ్చింది,” అనడుతున్నది.
రాము : ఈ ఫోన్ లో కెమేరా ఉన్నది….(ఆనందంగా తొణికసలాడుతున్న రేణుక మొహం లోకి చూస్తూ అన్నాడు)
రేణుక : నిజంగానా….ఇంకా ఏమేమి ఉన్నాయి దీనిలో…..
రాము : మ్యూజిక్ కూడా వస్తుంది….వింటావా….
రేణుక : వింటాను…..పెట్టు….(అంటూ చిన్నపిల్లలా ఆనందంగా తల ఊపింది.)
రాము ఫోన్ లో మ్యూజిక్ ఫోల్డర్ ఓపెన్ చేసి ఒక పైల్ ఓపెన్ చేసి ప్లే చేసాడు.
దాంతో ఫోన్ లో మ్యూజిక్ వినిపిస్తున్నది….ఆ మ్యూజిక్ వింటూ రాము హమ్మింగ్ చేస్తూ తల ఊపుతున్నాడు.
రాము : ఎలా ఉన్నది…..
రేణుక : బాగున్నది….మ్యూజిక్ ఎప్పుడు మొదలవుతుంది….
రేణుక అలా అడిగే సరికి రాము ఆమె వైపు వింతగా చూస్తూ…

రాము : ఇదే మ్యూజిక్ అంటే….
రేణుక : ఇది పాట ముందు వచ్చే తాళం కదా….పాట ఏది….
రాము : మా కాలంలో దీన్నే మ్యూజిక్ అంటాము….దీని పేరు హిప్ అప్ అంటారు…
రేణుక అలాగా అన్నట్టు తల ఊపింది….
రాము : ఇలా మ్యూజిక్ వస్తుంటే అందరూ డాన్స్ కూడా చేస్తారు….నేను డాన్స్ చేస్తాను చూస్తావా….
రేణుక : చెయ్యి….చెయ్యి….ఎలా చేస్తావో చూస్తాను….
రాము లేచి నిల్చుని తన చేతిలో ఉన్న ఫోన్ లో ఒక మ్యూజిక్ పైల్ ప్లేచేసి రేణుకకు ఇచ్చి ఆమె ఎదురుగా నిల్చుని వార్మప్ అన్నట్టు కాళ్ళు చేతులు విదిలిస్తూ మ్యూజిక్ రావడం మొదలవగానే బ్రేక్ డాన్స్ లాంటిది చేస్తున్నాడు.
రాము వాళ్ల కాలంలో అది బాగా పాపులర్ అయినా రేణుక ఇప్పటి వరకు అలాంటిది చూసి ఉండకపోవడంతో రాము అలా బ్రేక్ డాన్స్ చేస్తుంటే ఆమెకు ఏదో రోబోట్ అటూ ఇటూ నడుస్తున్నట్టు అనిపించడంతో రేణుకకు రాము డాన్స్ చూసి నవ్వు ఆగడం లేదు.
రాము డాన్స్ చూసి రేణుక పడీపడీ నవ్వుతున్నది.
ఐదు నిముషాల తరువాత మ్యూజిక్ ఆగిపోవడంతో రాము డాన్స్ ఆపేసాడు.
కాని రేణుక మాత్రం నవ్వడం ఆపలేదు….ఆమెకి ఏదో సర్కస్ లో జోకర్ గంతులు వేస్తే చూసినప్పుడు నవ్వినట్టు నవ్వుతున్నది.
రాము డాన్స్ ఆపేసి రేణుక వైపు చూసి….
రాము : ఎలా ఉంది నా డాన్స్….బాగుందా….
రేణుక తన చేతిని నోటి మీద ఉంచుకుని వస్తున్న నవ్వుని అతికష్టం మీద ఆపుకుంటూ….
రేణుక : ఇంత విచిత్రమైన డాన్స్ ని నా జీవితంలో ఇంత వరకు చూడలేదు….
రాము : విచిత్రంగా ఉన్నదా….నేను నా ఫ్రండ్స్ తో పబ్ కి వెళ్ళినప్పుడు ఈ డాన్స్ చేస్తే ఎలా చప్పట్లు కొడతారో తెలుసా…. అమ్మాయిలు అయితే నా డాన్స్ చూడాలని చచ్చిపోతుంటారు తెలుసా….
రేణుక : ఇలాంటి డాన్స్ చూస్తే నిజంగానే చచ్చిపోతాం తెలుసా….(అంటూ ఇంకా గట్టిగా నవ్వుతున్నది)
ఆ మాటకు రాము ఉడుక్కుంటూ….
రాము : హలో….రేణుక….డాన్స్ చేయడం అంత తేలిక కాదు…..
రేణుక : డాన్స్ చేయడం అంత కష్టం కూడా కాదు….
రాము : అలాగా…సరె….చేసి చూపించు….
రేణుక : అలాగే చేస్తాను….చూడు….
అంటూ రాము దగ్గరకు వచ్చి అతని ఎదురుగా దాదాపు ఆనుకున్నట్టు నిల్చుని అతని కళ్ళల్లోకి చూస్తూ తన కుడి చేతిని రాము చేతిలో పెట్టి, ఎడం చేత్తో రాము కుడి చేతిని పట్టుకుని తన నడుం మీద వేసుకుని….చేతిని మళ్ళి రాము భుజం మీద వేసి అతని కళ్ళల్లోకి ప్రేమగా చూసి నవ్వుతూ కాళ్ళు ముందుకి వెనక్కి ఆడిస్తూ డాన్స్ చేస్తూ రాము చేత కూడా చేయిస్తున్నది.

రేణుక కళ్ళల్లోకి చూస్తుంటే రాము చుట్టుపక్కల పరిసరాలను మర్చిపోయి ఆమెనే చూస్తూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు.
అలా రేణుక కళ్లల్లోకి చూస్తుంటే రాముకి లోకం తెలియడం లేదు….ఆమె కళ్ళల్లో తన మీద ప్రేమ స్పష్టంగా కనిపిస్తున్నది.

3 Comments

Add a Comment
  1. Challa bagundhi bayya

  2. Bayya story lo inka kastha kadha add chye

  3. Sir story super.upload next episode

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *