రాములు ఆటోగ్రాఫ్ – Part 8 81

అప్పటిదాకా వాళ్ళిద్దరి మాటలు విన్న రేణుక ఇక ఆగలేక రాము మాట్లాడబోతుంటే ఆపుతూ….
రేణుక : ఇక చాలు రాము….ఇప్పటికే చాలా మాట్లాడావు….ఇంకా ఏదైనా ఉంటే ఈ ప్రేతాత్మ ప్రాబ్లమ్ నుండి బయట పడిన తరువాత వివరంగా మాట్లాడుకుందాము….సరేనా….
దాంతో రాము ఇక రేణుక మాట వినక తప్పలేదు.
రాము : అలాగే రేణుక గారు….మీరు ఎలా చెబితే అలా….వింటాను….సరేనా….

రాము అలా అనగానే సునీత నవ్వుతూ…..
సునీత : అబ్బో….రేణుక….అప్పుడే నీ కాబోయే భర్తని నీ కంట్రోల్ లో పెట్టుకున్నావే…..
రేణుక : సునీత…..మీరు కూడా మొదలుపెట్టారా….
అంటూ రేణుక కోపాన్ని నటిస్తూ రాముని తన మొగుడు అన్నందుకు సిగ్గు పడుతూ తల వంచుకున్నది.
సునీత : సరె….సరె….మీ ఇద్దరి మధ్య నేనెందుకు….నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను….రేణుక…నువ్వు తొందరగా వచ్చి పడుకో…
రేణుక : అలాగే సునీత….
సునీత అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రేణుక : అలా లాన్ లో కూర్చుని మాట్లాడుకుందాం పద….
దాంతో ఇద్దరూ డైనింగ్ హాల్లో నుండి లాన్ లోకి వచ్చి కూర్చున్నారు.
రాము ఏమీ మాట్లాడకుండా మెదలకుండా ఉండటం చూసి రేణుక విసుగ్గా….
రేణుక : అబ్బా….రాము…ఇక మామూలు మూడ్ లోకి రావయ్యా బాబు….ఇంత అందమైన ఆడపిల్లను పక్కన పెట్టుకుని దిగాలుగా కూర్చున్న వాడిని నిన్నే చూస్తున్నాను….
రాము రేణుక మొహం లోకి చూసాడు….రేణుక మొహంలో సంతోషం కనిపిస్తున్నది….ఆమె పెదవుల మీద చిరునవ్వు అందంగా కనిపిస్తున్నది.
రాము ఆమెను అలాగే చూస్తూ తన చేతిని రేణుక వీపు మీదగా ఆమె భుజం మీద వేసి తన వైపుకు ఇంకా దగ్గరకు లాక్కున్నాడు.
ఇప్పుడు రేణుక రాముకి గట్టిగా ఆనుకుని కూర్చున్నది.
రాము : నువ్వు ఎంత పెద్ద ప్రాబ్లమ్ లో ఉన్నావో నీకు తెలుసా…..అయినా నువ్వు టెన్షన్ లేకుండా ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నావు….
రేణుక : నువ్వు పక్కన ఉండగా నాకు టెన్షన్ ఎందుకు రాము….ఇందాక నువ్వే అన్నావు కదా….నాకు ఏ కష్టం రాకుండా చూసుకుంటానని….మరి నాకు ఇంక టెన్షన్ ఎందుకు….
ఆ మాట వినగానే రాము చిన్నగా నవ్వాడు….
అది చూసి రేణుక కూడా ఆనందంగా పెద్దగా నవ్వుతూ….
రేణుక : అబ్బా….అయ్యగారు ఇప్పటికి నవ్వారు….నీకో సంగతి చెప్పనా రాము….
రాము : చెప్పు….నాకు ఏదైనా విషయం చెప్పడానికి నీకు పర్మిషన్ అవసరం లేదు….
రేణుక : నువ్వు ఇలా నవ్వుతు నా పక్కనే ఉంటే నాకు ఎంత పెద్ద ప్రాబ్లమ్ వచ్చినా సరె చాలా తేలిగ్గా దాన్ని సాల్వ్ చేసుకుంటాను.
రాము : నా మీద అంత నమ్మకం….ప్రేమ ఎందుకు రేణుక….నేను పరిచయం అయ్యి గట్టిగా నెల కూడా కాలేదు…

రేణుక : అదంతా నాకు తెలియదు రాము….ప్రేమ అనేది ఎప్పుడు పుడుతుందో తెలియదు….కాని నువ్వు పరిచయం అయిన మొదటి రోజు నిన్ను వదిలి ఇంటికి వెళ్ళిన తరువాత ఏదో చాలా వెలితిగా అనిపించింది…రాత్రి కూడా పడుకుంటే నిద్ర రాలేదు. నువ్వు మళ్ళీ కనిపిస్తే బాగుండు అని ఎన్నిసార్లు అనుకున్నానో తెలుసా….తరువాత చిన్నగా నీతో ఉన్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించేది….
రాము : నా గురించి నీకు ఏమీ తెలియదు కదా…..
రేణుక : మీ అబ్బాయిలు అమ్మాయి అందంగా ఉంటే చాలు ప్రేమలో పడిపోతారు…కాని అమ్మాయిలు మాత్రం అబ్బాయి అందంగా లేకపోయినా మంచి మనసు, నడవడిక ఉంటే చాలు….
రాము : మరి నాలో అవన్నీ కనిపించాయా….
రేణుక : అవును….ఆడది మగాడు తనను చూసే చూపుల విధానాన్ని బట్టే వాడు ఎలాంటి వాడు అన్న అంచనా వేస్తుంది. మొదటి రోజు నువ్వు నాపక్కన నడిచేప్పుడు కనీసం నావంక కూడా చూడలేదు…చాలా మర్యాదగా మాట్లాడావు…తరువాత నీ బిహేవియర్ చూసి నిన్ను ఇష్టపడ్డాను…
రాము : అబ్బో నా గురించి చాలా తెలుసుకున్నావే….చాలా తెలివైన దానివి….
రేణుక : అవును కదా….
రాము : అంటె ఇప్పుడు చెప్పిన అనాలసిస్ ప్రకారం నేను అందంగా లేనా….
రేణుక తన ఎత్తి రాము వైపు చిలిపిగా చూస్తూ….
రేణుక : నా అంత అందంగా లేకపోయినా….ఫరవాలేదు….నా పక్కన బాగానే ఉంటావు….
అంటూ తన నాలుకని బయట పెట్టి వెక్కిరిస్తున్నట్టు నవ్వుతూ అన్నది.
రాము : నిన్నూ…..
అంటూ రాము రేణుకను ఇంకా దగ్గరకు లాక్కుని ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు.
అలా వాళ్ళిద్దరు నవ్వుతూ, తుళ్ళుతూ మాట్లాడుకుంటుండగా రాము జేబులో నుండి అతని సెల్ ఫోన్ కింద పడింది.
రాము దాన్ని చేతిలోకి తీసుకుని దాని మీద ఉన్న మట్టిని దులుపుతున్నాడు.
రాము చేతిలో ఉన్న సెల్ చూసి రేణుక, “ఇలాంటిది మా నాన్నగారి దగ్గర కూడా ఉన్నది…కాకపోతే చాలా పెద్దది…ఇంత చిన్న టైప్ రైటర్ ఇప్పటి వరకు నేను చూడలేదు,” అన్నది.
రేణుక సెల్ ఫోన్ గురించి అలా అనగానే రాముకి నవ్వాగలేదు….ఒక్క నిముషం ఆగకుండా నవ్వున తరువాత రేణుక వైపు చూసి…
రాము : ఇది టైప్ రైటర్ కాదు….ఇది టెలిఫోన్….
రాము అలా చెప్పగానే రేణుక అతని మాట నమ్మనట్టు చూస్తూ….
రేణుక : అవునా….నేను నీ కన్నా యాభై ఏళ్ళు వెనక వాళ్ళం అయుండొచ్చు….కాని నాకు తెలివి లేదనుకోకు…
రాము : లేదు రేణుక….నేను నిజమే చెబుతున్నాను….దీన్ని మా కాలంలో సెల్ ఫోన్ అంటారు….2010 లో అందరి దగ్గర ఇలాంటివే ఉంటాయి….జస్ట్ అవతలి వాళ్ల నెంబర్ ప్రెస్ చేసి….మాట్లాడటమే….అంతే సింపుల్…

రేణుక : నువ్వు చెప్పింది నిజమైతే….మా నాన్న గారి నెంబర్ కి ఫోన్ చెయ్యి….మా అమ్మతో మాట్లాడు చూద్దాం….
రాము : ఇప్పటి కాలంలో అంటే 1960 లో ఈ ఫోన్ పనిచేయదు….
రేణుక : ఎందుకు పనిచేయదు….
రాము : ఎందుకంటే….మీరు ఏ నెంబర్ కి అయితే మీరు మాట్లాడాలనుకుంటున్నారో వారు ఇప్పుడు అందుబాటులో లేరు…అని వస్తుంది….

3 Comments

Add a Comment
  1. Challa bagundhi bayya

  2. Bayya story lo inka kastha kadha add chye

  3. Sir story super.upload next episode

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *