రాములు ఆటోగ్రాఫ్ – Part 8 81

దాంతో రేణుక కూడా రాము వైపు తిరిగి నమ్ముతున్నట్టు తల ఊపింది.

వెంటనే రాము తన జేబులో ఉన్న ఇంకో లెటర్ తీసుకుని చదవమని రేణుకకు ఇచ్చి….ఆమె చేతిలో ఉన్న పాత లెటర్ తీసుకుని లోపల పెట్టుకున్నాడు.
రేణుక ఆ లెటర్ తీసుకుని చదవుతుంటే….సునీత కూడా రేణుక దగ్గరకు వచ్చి లెటర్ చదువుతున్నది.
లెటర్ 2 : మీరు ఇద్దరూ నా మాట నమ్ముతున్నట్టైతే….అప్పుడు మీరిద్దరూ ఆ సుందర్ ప్రేతాత్మని ఎదుర్కోవాలని నమ్మాలి. ఒకవేళ దెయ్యం అనేది ఉంటే దేవుడు కూడా తప్పకుండా ఉంటాడు. మనం దేవుడి హెల్ప్ లేకుండా ఆ సుందర్ ప్రేతాత్మను ఎదిరించలేము….దానికి మీ ఇద్దరి సహకారం కావాలి….
ఆ లెటర్ మొత్తం చదివిన తరువాత రేణుక, సునీత అలాగే అన్నట్టు తల ఊపారు.
దాంతో రాము కూడా రేణుక వాళ్లతో పాటు కారు ఎక్కి డ్రైవర్ తో అక్కడ దగ్గరలో ఉన్న చర్చి దగ్గరకు పోనివ్వమని చెప్పాడు.
కొద్దిసేపటికి రాము, రేణుక, సునీత ముగ్గుతూ చర్చి లోకి వెళ్ళారు…..డ్రైవర్ మాత్రం కారులోనే కూర్చున్నాడు.
చర్చి లో ఫాదర్ కి రాము జరిగింది అంతా వివరంగా చెప్పాడు.
అంతా విన్న ఫాధర్ ఐదు నిముషాలు కళ్ళు మూసుకుని ప్రార్ధన చేసిన తరువాత కళ్ళు తెరిచి ఎదురుగా కూర్చున్న వాళ్ళ ముగ్గురి వైపు చూస్తూ, “మీరు చెప్పేది నేను పూర్తిగా నమ్ముతున్నాను….ఆ ప్రొఫెసర్ ఆత్మ రేణుకతో కలిపోయింది…అది ఎలాగంటే వీళ్ళిద్దరూ ఒకరకమైన బంధనంలో చిక్కుకున్నారు….ఎప్పటి వరకైతే ఈ బంధనం తొలగిపోదో అప్పటి దాకా సుందర్ రేణుకని వదిలిపెట్టడు….” అన్నాడు.
“కాని ఫాదర్…ఆ బంధనాన్ని విడగొట్టడానికి మార్గం ఏంటీ….” అనడిగింది సునీత.
దాంతో ఫాదర్ ఒక నిట్టూర్పు విడుస్తూ తన చైర్ లోనుండి లేచి, “ఈ బంధనాన్ని విడగొట్టడం ప్రతి ఒక్కళ్ళకు సాధ్యం కాదు…. ఇక్కడ నుండి దాదాపు 120 k.m దూరంలో షాపూర్ దగ్గర ఉన్న అడవుల్లో ఒక దర్గా ఉన్నది….అందులో ఒక సూఫీ బాబా ఉన్నాడు….ఆయన ఇలాంటి ప్రేతాత్మలను చాలా తేలిగ్గా బంధిస్తాడు…అతను మాత్రమే మీకు ఏదైనా సహాయం చేయగలడు,” అన్నాడు.
ఆ మాటలు విన్న రాము ఫాదర్ తో, “ఫాదర్…నాదో చిన్న డౌట్….సుందర్ ప్రేతాత్మ రేణుకతో కలిసిపోయిందంటున్నారు కదా… మరలాంటప్పుడు ఆ ప్రేతాత్మ మమ్మల్ని ఫాలో చేస్తుంది కదా….ఫాలో చేయడమే కాకుండా….మమ్మల్ని ఆ దర్గా వరకు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది కదా,” అనడిగాడు.
రాము అలా అడగడంతో ఫాదర్ వెనక్కి తిరిగి అతని వైపు చూస్తూ, “నువ్వు చెప్పింది కరెక్టే….ఇక్కడ మనం గుర్తుంచుకోవలసినవి రెండు విశయాలు ఉన్నాయి….అందులో మెదటికి….ఏ ఆత్మ అయినా ప్రేతాత్మ అయినా రోజులో బాగా శక్తివంతంగా ఉండేది తెల్లవారుజామున మూడు గంటలకు…..మళ్ళి సాయంత్రం మూడు గంటలకు చాలా బలహీనంగా ఉంటుంది…అది బలహీనంగా ఉన్న టైం అంటే మధ్యాహ్నం మూడు గంటలకు మీరు దర్గాకు బయలుదేరాల్సిన టైం…” అన్నాడు.
“మరి రెండో విషయం ఏంటి ఫాదర్,” అనడిగింది రేణుక.

రెండోది ఏంటంటే….నేను ఇక్కడ చర్చిలో మీ కోసం నేను ప్రార్ధనలు చేస్తాను….నేను ప్రార్ధన చేస్తున్నంత సేపు ఆ ప్రేతాత్మ మిమ్మల్ని ఎవరికీ హాని తలపెట్టలేదు….అలా అని మీరు అజాగ్రత్తగా ఉండకూడదు….అది మిమ్మల్ని చంపడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది….అది గుర్తు పెట్టుకుని జాగ్రత్తగా ఉండండి….అది ఏ విధంగానైనా మీ మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తుంది. కాని మీరు మాత్రం……” అంటూ ఫాదర్ చెప్పబోతుండగా….
“మేము మాత్రం ఆ ప్రేతాత్మ పేరు మా నోటి నుండి పలకకూడదు….అంతేకదా ఫాదర్,” అన్నాడు రాము.
ఫాదర్ రాము వైపు మెచ్చుకుంటున్నట్టు చూసూ, “చాలా కరెక్ట్ గా చెప్పావు….ఈ విషయం చాలా బాగా గుర్తు పెట్టుకోండి….మీ నోటి నుండి ఎట్టి పరిస్థితుల్లోను ఆ ప్రేతాత్మ పేరు బయటకు రాకూడదు….ఒక వేళ పొరపాటున అయినా పలికారంటే ఆ పలికిన వాళ్లను ఆ ప్రేతాత్మ ఆవహింస్తుంది…ఈ విషయం మీరు గుర్తుంచుకుని చాలా జాగ్రత్తగా ఉండాలి,” అన్నాడు.
దాంతో వాళ్ళు ముగ్గురూ ఫాదర్ చెప్పిన జాగ్రత్తలు విని చర్చి నుండి బయటకు వచ్చారు.
వాళ్ళు బయటకు రావడం చూసిన డ్రైవర్ కారు స్టార్ట్ చేసి…..వాళ్ళు ఎక్కగానే విల్లా వైపు పోనిచ్చాడు.
విల్లా లోకి వెళ్లగానే రేణుక, సునీత తమకు కావలసిన వస్తువులు, బట్టలు సర్దిపెట్టి టైం కరెక్ట్ గా మధ్యాహ్నం మూడు కాగానే విల్లా నుండి బయటకు వచ్చి తమ చేతిల్లో ఉన్న రెండు సూట్ కేస్ లు కారులో పెట్టారు.
అప్పటికే రాము డ్రైవర్ దగ్గర కారు తాళాలు తీసుకుని కారు స్టార్ట్ చేసి వాళ్ల కోసం రెడీగా ఉన్నాడు.
వాళ్ళిద్దరూ కారు ఎక్కగానే అక్కడ నుండి బయలుదేరారు.
********

3 Comments

Add a Comment
  1. Challa bagundhi bayya

  2. Bayya story lo inka kastha kadha add chye

  3. Sir story super.upload next episode

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *