రాములు ఆటోగ్రాఫ్ – Part 7 56

అలా బాధపడుతూనే రాము పియానో ప్లే చేస్తూ అలాగే ముందుకు వాలిపోయి పియానో మీద పడిపోయాడు.
పియానో మీద పడిపోయిన రాము అలా నిద్ర పోయి….కిటికీ లోనుండి తన మీద ఎండ పడటంతో చిన్నగా పియానో మీద నుండి తల పైకి ఎత్తి చూసాడు. అలా కళ్ళు తెరిచిన రాము తన కళ్ళ ముందు కనిపించిన దృశ్యం చూసి తాను చూస్తున్నది కలా నిజమా అని అర్ధంకాక బిత్తరపోయి చూస్తున్నాడు.
ఎదురుగా పియానో మీద క్యాండిల్ స్టాండ్ లో క్యాండిల్స్ పెట్టి ఎవరో వెలిగించినట్టు వెలుగుతున్నాయి.
ఆ గదిలో నుండి బయటకు చూసిన రాముకి తాను వచ్చినప్పడు ఉన్న విల్లాకు ఇప్పుడు తాను చూస్తున్న విల్లాకు చాలా తేడా కనిపించింది.
రాము చిన్నగా కుర్చీలో నుండి లేచి చుట్టూ చూసాడు.
ఆ గదిలో ఇంకో రెండు క్యాండిల్ స్టాండ్స్ లో క్యాండిల్స్ వెలగడం చూసాడు.
అలా అయోమయంగా చూస్తున్న రాముకి బయట హాల్లో ఎవరో మాట్లాడుతూ ఎవరినో పిలుస్తున్నట్టు వినిపించడంతో బెడ్ రూమ్ లోనుండి బయటకు వచ్చి కారిడార్ లోకి వచ్చిన రాముకి హాల్లో ఒకామె, “కిషన్…..తొందరగా రా….టైం అవుతున్నది,” అంటూ ఒకతన్ని పిలవడం చూసి వెంటనే రాము అక్కడ ఉన్న తలుపు వెనకాల నిల్చుని వాళ్ళు ఎవరా అని చూస్తున్నాడు.
ఆమె పిలుస్తున్న కిషన్ అనే అతను చేతిలో సూట్ కేస్ పట్టుకుని మెట్ల మీద నుండి కిందకు దిగుతూ, “వస్తున్నాను మేడమ్. అంత తొందర పెడుతున్నారెందుకు,” అంటూ బయటకు వెళ్ళి కారులో తన చేతిలో ఉన్న సూట్ కేస్ పెడుతున్నాడు.
అక్కడ తలుపు వెనకాల అద్దంలో నుండి చూస్తున్న రాముకి తన కళ్ళెదురుగా కనిపిస్తున్న వాళ్లు ఎవరా అని అయోమయంగా చూస్తున్నాడు.
తాను వచ్చినప్పుడు లేని వాళ్ళు తెల్లారేసరికి ఎలా వచ్చారా అని ఆలోచిస్తున్నాడు….ఎదురుగా కనిపిస్తున్న సన్నివేశాన్ని చూస్తుంటే రాముకి అంతా తెలిసినట్టు అనిపిస్తున్నది.
విల్లా బయట ఉన్న కారులో ఇద్దరు దంపతులు ఊరికి వెళ్లడానికి బయలుదేరిన వాళ్లను డ్రైవర్ కారులో రైల్వే స్టేషన్ లో దింపడానికి వెళ్తున్నాడు.
వాళ్లు వెళ్తుంటే ఒక అమ్మాయి, ఇందాక కిషన్ అంటూ పిలిచిన ఆమె వాళ్ళకు చేతులు ఊపుతూ బై చెబుతున్నారు.
అదంతా చూసిన రాము ఏదో అర్ధమయిన వాడిలా వెనక్కు పరిగెత్తుకుంటూ వచ్చి ఇంతకు ముందు తాను పడుకునే బెడ్ రూమ్ లోకి వచ్చాడు.
బెడ్ రూమ్ లోకి వచ్చిన రాము చుట్టూ చూసి అక్కడ టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకుని దాని మీద ఉన్న 12-3-1960 అని డేట్ చూసాడు.
న్యూస్ పేపర్ మీద ఉన్న డేట్ చూసినా రాముకి తల గిర్రున తిరిగినట్టు అయింది.
తన చేతిలో ఉన్న న్యూస్ పేపర్ ఆ రోజుది…దాని మీద డేట్ మాత్రం యాభై ఏళ్ళ కిందటి సంవత్సరం వేసి ఉన్నది.
ఆ డేట్ చూసిన రాముకి తన కళ్ల ముందు జరుగుతున్నది, తాను చూస్తున్నది కలా నిజమా అర్ధం కావడం లేదు.
ఇప్పుడు విల్లాలో తానున్న పరిస్థితి చూస్తే తాను కాలంలో యాభై ఏళ్ళు వెనక్కు వచ్చినట్టు క్లియర్ గా చాలా బాగా అర్ధమవుతున్నది.
ఇందాక తాను చూసిన మనుషులు రేణుక రాసిన లెటర్ లోని వ్యక్తులు సునీత, కిషన్, తన అమ్మా, నాన్నకు చేయి ఊపి బై చెబుతున్న అమ్మాయి రేణుక అని అర్ధమయింది.
అంటే తాను తనున్న కాలంలో నుండి రేణుక ఉన్న కాలంలోకి వచ్చానని అనుకుంటూ గబగబ అక్కడనుండి పరిగెత్తి విల్లాలో వెనకనుండి తలుపు తీసి బయటకు వచ్చి చూసాడు.
బయట అంతా తాను 2010 వ సంవత్సరం వాడిని అయితే అక్కడ తన ఎదురుగా కనిపిస్తున్నదంతా మాయమై దాని స్థానంలో యాభై ఏళ్ళు అంటే 1960 వ సంవత్సరంలో ఉన్నట్టు ఉన్నది. అది చూసి రాము మనసు గాభరాతో నిండిపోయింది….అతని మనసులో సందేహాలు ఈగల్లా ముసురుకుంటున్నాయి.
“అసలు అ బాబా ఎవరు….నన్ను మొదటి సారి చూడగానే నీ కోసమే ఎదురుచూస్తున్నానని ఎందుకన్నాడు….అంటే నేను ఇక్కడకు వస్తానన్న సంగతి ఆయనకు తెలుసా…నేను మళ్ళీ నేనుండే కాలానికి ఎలా వెళ్తాను….ఇక్కడ నేను ఏం చేయాలి. రేణుకను ఎలా రక్షించాలి,” అని ఆలోచిస్తూ ఉన్నాడు రాము.
అలా కూర్చుండిపోయిన రాము కొద్దిసేపటికి, “కాలంలో వెనక్కి రావడం అనేది జరగని పని….కాని నేను వచ్చాను….ఎలా వచ్చానో నాకు కూడా తెలియదు….కాబట్టి నేను ఇలా కాలంలో వెనక్కి వచ్చానంటే ఖచ్చితంగా నేను రేణుకని రక్షించగలను….లేకపోతే ఇలా కాలంలో ప్రయాణించడం జరిగే పని కాదు….ముందు రేణుకతో పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గరగా ఉంటే….తరువాత ఏం చేద్దాం అని ఆలోచిద్దాం,” అని అనుకుంటూ విల్లా వైపు బయలుదేరాడు, “కాని తాను లెటర్ లో చదివిన దాని ప్రకారం అయితే ఇప్పుడు రేణుక ప్రొఫెసర్ సుందర్ ఇంట్లో పియానో నేర్చుకోవడానికి వెళ్ళి ఉంటుంది….ఇప్పుడు నాకు జరగబోయేది తెలుసు కాబట్టి రేణుకను నేను చేతనైనంత వరకు కాపాడగలను,” అని అనుకుంటూ విల్లా వైపు వెళ్తున్నవాడల్లా వెనక్కు తిరిగి ప్రొఫెసర్ సుందర్ వాళ్ళింటి వైపు నడవడం మొదలుపెట్టాడు.
అలా సుందర్ ఇంటి వైపు నడుస్తున్న రాముకి ఆ ఇంటి దగ్గరకు వెళ్ళేకొద్దీ ఫియానో ప్లే చేస్తున్నప్పుడు వచ్చే మ్యూజిక్ క్లియర్ గా వినిపించడం మొదలుపెట్టింది.
రాము చిన్నగా సుందర్ ఇంటి దగ్గరకు వెళ్ళి పియానో క్లాసు జరుగుతున్న గది దగ్గరకు వెళ్ళి అక్కడ ఉన్న కిటికీ లోనుండి లోపలికి తొంగి చూసాడు.
లోపల సుందర్ ఒక సోఫాలో కూర్చుని ఒక్కొక్కళ్లకు ఎలా పియానో ప్లే చేయాలో చెబుతున్నాడు.
స్టూడెంట్లు మొత్తం రేణుక తో కలిపి నలుగురు ఉన్నారు.
సుందర్ రేణుక వైపు చూసి….
సుందర్ : రేణుక….ఇప్పుడు నువ్వు ప్లే చెయ్యి….
రేణుక అలాగే అన్నట్టు తలఊపి పియానో దగ్గరకు వచ్చి అతని వైపు చూసి…..
రేణుక : ప్రొఫెసర్ సుందర్….నేను మీతో ఒక విషయం చెప్పాలి….
సుందర్ : చెప్పు రేణుక….ఏంటి సంగతి…..
రేణుక : విషయం ఏంటంటే….ఈ రోజు మా అమ్మా, నాన్న కొద్దిరోజులు ఉండటానికి డిల్లో వెళ్ళారు….అందుకని నేను రేపటి నుండి పియానో క్లాసుకు రాలేను….
అది విని సుందర్ రేణుక వైపు చూస్తూ….
సుందర్ : అవునా…రేణుక….ప్రాక్టీస్ చేస్తుంటే పియానో బాగా వస్తుంది….అదిగాక నువ్వు చాలా బాగా ప్రాక్టీస్ చేస్తున్నావు….సరె నువ్వేం బాధ పడకు….నువ్వు ఇక్కడకు రాకపోతే ఏం….నేను మీ ఇంటికి వచ్చి పియానో నేర్పుతాను…..
రేణుక : తప్పకుండా సార్….మీరు చాలా మంచి ఐడియా చెప్పారు….
సుందర్ : సరె….రేణుక….రేపటి నుండి నేను మీ ఇంటికి వచ్చి పియానో నేర్పిస్తాను.
రేణుక కూడా తన పియానో ప్రాక్టీస్ ఆగకుండా సాగిపోతుందన్న ఆనందంలో కొద్దిసేపు అక్కడే పియానో ప్రాక్టీస్ చేసి సుందర్ ఇంటి నుండి తన ఇంటికి బయలుదేరింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *