రాములు ఆటోగ్రాఫ్ – Part 7 57

ఆ ప్రయత్నంలొ భాగంగా స్థంభాన్ని పట్టుకున్న సుమిత్ర మోహిని శక్తికి ఆమె శరీరం గాల్లోకి తేలుతున్నది.
కాని సుమిత్ర మాత్రం తనను తాను కంట్రోల్ చేసుకుంటూ స్థంభాన్ని గట్టిగా పట్టుకున్నది.
అది చూసి రాము, మహేష్ ఇద్దరూ అక్కడనుండి పరిగెత్తుతుంటే…..సుమిత్ర మాత్రం గాల్లో తేలుతూ స్థంభాలు ఒకదాని తరువాత ఒకటి పట్టుకుని వాళ్ల వెనకాలే వస్తున్నది.
అలా గాల్లో తేలుతూ సుమిత్ర వాళ్ళిద్దరి ముందుకు వచ్చి నిల్చుని వెకిలిగా నవ్వుతు వాళ్ల వైపు వస్తున్నది.
దాంతో రాము, మహేష్ ఇద్దరూ వెనక్కు తిరిగి పరిగెత్తుతుండటంతో…..సుమిత్ర ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి మహేష్ కాలు పట్టుకుని గట్టిగా లాగింది.
దాంతో మహేష్ వెంటనే తన చేతిలో ఉన్న కుండని రాము వైపుకి విసిరేసి కింద పడిపోయాడు.
రాము వెంటనే ఆ కుండని పట్టుకుని వెనక్కు తిరిగాడు….కాని సుమిత్ర వెంటనే రాముని పట్టుకుని కింద పడేసి కుండను గట్టిగా పట్టుకుని….రాముని పైకి లేపి గాల్లోకి విసిరేసింది.
దాంతో రాము తన చేతిలో ఉన్న కుండని వదిలేసి కింద పడ్డాడు….అలా కింద పడటంతో ఒక్కసారిగా నొప్పితో గిలగిల కొట్టుకున్నాడు.
సుమిత్ర తన చేతిలొకి అస్థికల కుండ వచ్చేసరికి దాన్ని సుమిత్రలో ఆవహించి ఉన్న మోహిని కుండని చూస్తూ ఆనందంతో పిచ్చిపట్టినట్టు నవ్వుతున్నది.
అంతలోనే సుమిత్ర వెంటనే మళ్ళీ తన బలాన్ని కూడదీసుకుని ఆ కుండని రాము వైపు విసిరేయడానికి ట్రై చేస్తున్నది.
సుమిత్రలో ఉన్న మోహిని మాత్రం ఆమె ప్రయత్నాన్ని కొనసాగనివ్వడం లేదు….
కింద పడిన రాము చిన్నగా పైకి లేచిన అతనికి….సుమిత్ర పరిస్థితి పూర్తిగా అర్ధమయింది.
సుమిత్ర తనను ఆవహించి ఉన్న మోహినితో పోరాడుస్తున్నదని మహేష్ కి కూడా అర్ధమయింది.
సుమిత్ర రాము వైపు చూసి, “రామూ….ఎట్టి పరిస్థితుల్లొనైనా రేణుకను కాపాడాలి….ఈ కుండని పట్టుకో….వెళ్ళు,” అంటూ తన చేతిలో ఉన్న కుండని రాము వైపు విసిరేసి అక్కడ ఉన్న కిటికీ లోనుండి నదిలొకి దూకేసింది.
అలా దూకిన వెంటనే మోహిని సుమిత్ర శరీరాన్ని వదిలి బయటకు వచ్చి ప్రేతాత్మగా మారి సుమిత్ర దూకిన అదే కిటికీ లోనుండి మళ్ళీ మహల్ లోకి వచ్చింది.

రాము వెంటనే కుండని పట్టుకుని తన ఎదురుగా కనిపిస్తున్న మోహిని ప్రేతాత్మ ను చూసాడు.
రాము ఇంతకు ముందు సుందర్ ప్రేతాత్మను చూసి ఉండటంతో కొంచెం ధైర్యంగా ఉన్నాడు….కాని మహేష్ మాత్రం అదే మొదటిసారి అవడంతొ అలాగే భయంతో కొయ్యబారిపోయాడు.
అలా వాళ్ళిద్దరూ చూస్తుండగానే మోహిని తన శక్తితో వాళ్ళు బయటకు వెళ్ళకుండా వాళ్ల వెనకాల ఉన్న డోర్ ని మూసేస్తుంది.
ఆ డోర్ మూసుకుపోతుండటం చూసి రాము వెంటనే మహేష్ భుజం మిద కొట్టి అతన్ని అలెర్ట్ చేస్తూ డోర్ వైపు పరిగెత్తి ఆ గది లోనుండి బయటకు వచ్చేసాడు.
కాని మహేష్ డోర్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఆ తలుపు పూర్తిగా మూసుకుపోయింది.
దాంతో రాము వెనక్కు తిరిగి తలుపు దగ్గరకు వచ్చి గట్టిగా కొడుతూ, “మహేష్….మహేష్,” అని అరుస్తున్నాడు.

లొపల మహేష్ కూడా తలుపు తీయడానికి ట్రై చేస్తూ, “రాము….తలుపు తెరుచుకోవడం లేదు….” అంటున్నాడు.
“అరేయ్….తెరవడానికి ట్రై చెయ్యారా….” అంటున్నాడు రాము తలుపుకు అవతల వైపు నుండి.
దాంతో మహేష్, “రామూ….ముందు నువ్వు వెళ్ళి అస్థికలను నీళ్లల్లో కలిపెయ్,” అన్నాడు. రాము తలుపు తెరవడానికి ట్రై చేస్తూ, “మహేష్….నిన్ను వదిలిపెట్టి ఎలా వెళ్ళను,” అంటున్నాడు.
“రామూ….రా….మూ….ముందు చెప్పింది చెయ్యి….నా గురించి ఆలోచించకు….ముందు నువ్వెళ్ళి వాటిని నీళ్ళల్లో కలుపు…” అన్నాడు మహేష్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *