రాములు ఆటోగ్రాఫ్ – Part 5 48

అంటూ తన జేబులో నుండి ఒక పేపర్ తీసి దాని మీద గెస్ట్ హౌస్ అడ్రస్ రాసి ఇచ్చాడు.
రాము ఆయనకు థాంక్స్ చెప్పి ఆ పేపర్ తీసుకుని కారులొ కూర్చుని స్టార్ట్ చేసి గెస్ట్ హౌస్ వైపు పోనిచ్చాడు.
గెస్ట్ హౌస్ పక్కనే చెరువు లాంటిది ఉన్నది….దాని పక్కగా కారుని పోనిచ్చి గెస్ట్ హౌస్ కి చేరుకున్నారు.
గెస్ట్ హౌస్ గేట్ ముందు ఆగి ముగ్గురూ దాని వైపు చూసారు.
మహేష్ : దీనెమ్మ….మన టైం ఏమొ తెలియదు కాని….నిన్నటి నుండి మనం ఎక్కడకు వెళ్ళినా అక్కడ బిల్డింగ్ లు భయంకరంగానే కనిపిస్తున్నాయి…..
ఆ మాట వినగానే సుమిత్ర, రాము ఇద్దరూ మహేష్ వైపు చూసి ఒక్కసారిగా నవ్వారు.
మహేష్ : నా మాటలు మీ ఇద్దరికీ నవ్వుగానే ఉంటుంది….ఇది అసలు గెస్ట్ హౌసేనా అని నాకు డౌట్ గా ఉన్నది….(అంటూ రాము వైపు అనుమానంగా చూస్తూ)….అరేయ్ రామూ….నువ్వు ఆ స్టేషన్ మాస్టర్ కాళ్ళు చూసావా….కరెక్ట్ గా ఉన్నాయా…లేక వెనక్కు తిరిగి ఉన్నాయా…..గమనించావా….
రాము : ఒరేయ్….మరీ ఎక్కువగా ఆలోచించకు….ఇంత రాత్రి వేళ మనకు వేరే ఆప్షన్ లేదు….పద లోపలికి వెళ్దాం
అంటూ నవ్వుతూ గెస్ట్ హౌస్ వైపు నడిచాడు….అతని వెనకాలే మహేష్, సుమిత్ర నడుస్తు లోపలికి వెళ్ళారు.
గెస్ట్ హౌస్ లోకి వెళ్ళిన తరువాత అక్కడ వాచ్ మెన్ వాళ్ళకు రెండు రూమ్ లు ఇచ్చాడు.
ఒక రూమ్ లో రాము, మహేష్ ఉంటే…..ఇంకో రూమ్ లో సుమిత్ర ఉన్నది.
ముగ్గురూ స్నానం చేసి వచ్చేసరికి వాచ్ మెన్ వంట రెడీ చేసి పెట్టాడు.
ముగ్గురికి భోజనం వడ్డిస్తూ….
వాచ్ మెన్ : ఇవ్వాళ మీ టైం బాగున్నదండి….
మహేష్ : ఎందుకు బాబు….ఎవరూ లేని ఈ గెస్ట్ హౌస్ కి నీకు తోడుగా వచ్చామనా….
ఆ మాటకు రాము, సుమిత్ర చిన్నగా నవ్వుతూ ఏం మాట్లాడకుండా భోజనం చేస్తున్నారు.
వాచ్ మెన్ : అది కాదు బాబు….ఇక్కడ వాటర్ పైప్ లీక్ అవడం….దాన్ని బాగు చేయించడం కోసం నేను ఇక్కడే ఆగిపోవాల్సి వచ్చింది….లేకపోతే నేను ఇక్కడ నుండి చీకటి పడక ముందే వెళ్ళిపోయే వాడిని….
అంటూ రాము పక్కకు వచ్చి కూర వడ్డిస్తున్నాడు.
రాము అతని వంక చూసి నవ్వుతూ….
రాము : ఎందుకు….రాత్రిళ్ళు ఇక్కడ ఎవరూ ఉండరా….(అంటూ అతని మెళ్ళో ఊగుతున్న తాయెత్తు మీదకు రాము చూపు తెలియకుండానే వెళ్ళింది.)
వాచ్ మెన్ : విషయం ఏంటంటే సార్….చుట్టూ అడవి కదా….చీకటి పడిన తరువాత ఇక్కడ పిల్లి వెళ్ళినా కూడా పులి వెళ్ళినట్టు అనిపించి….భయంగా ఉంటుంది….దానికి తోడు ఇంత పెద్ద బంగళాలో ఒక్కడినే ఉండాలంటే….ఇంత నిశబ్దంలో మన గుండె శబ్దం మనకే భయంకరంగా వినిపిస్తుంటుంది.
వాచ్ మెన్ చెప్పేది వింటున్న సుమిత్రకు వెనకాల ఏదో అలికిడి అయినట్టు అనిపించడంతో వెనక్కు తిరిగి చూసి…..అక్కడ ఏమి కనిపించక పోవడంతో మళ్ళి అన్నం తినడంలొ మునిగిపోయింది.
కాని అప్పుడే గాల్లోంచి ఏదో కాగితం ఎగురుకుంటూ వచ్చి వాళ్ళు భోజనం చేసే చోట పడేసరికి సుమిత్ర తన చైర్ లోనుండి లేచి డైనింగ్ హాల్లోంచి బయటకు వచ్చి బయటకు చూస్తుంటే…..మహేష్ ఆమె వైపు చూసి….
మహేష్ : ఏమయింది సుమిత్ర గారూ….
సుమిత్ర : ఎవరో పిలిచినట్టు అనిపిస్తున్నది….
అంటూ అక్కడ మెట్లు కనిపించేసరికి అవి ఎక్కి పైకి వచ్చేసరికి కొద్దిదూరంలో ఒక కోట కనిపించేసరికి దాన్నే చూస్తూ ఉండిపోయింది.
ఆమె వెనకాలే రాము, మహేష్….వాళ్ళిద్దరితో పాటు వాచ్ మెన్ కూడా లాంతరు పట్టుకుని పైకి వచ్చారు.
వాళ్ళు రావడం చూసి సుమిత్ర వెనక్కు తిరిగి వాచ్ మెన్ వైపు చూసి….
సుమిత్ర : ఈ కోట పేరేంటి….
వాచ్ మెన్ : ఇది పురాతమైన కోట సార్….పాతకాలం నాటి మఘా అనే పేరు మిద మిగిలి ఉన్న ఒకే ఒక్క గుర్తు….ఈ కోట సార్…. మూడు వందల ఏళ్ల క్రితం ఈ కోటను జైలు కింద వాడేవారు…
ఆ మాట వినగానే సుమిత్ర చిన్నగా గొణుగుతున్నట్టు….
సుమిత్ర : మఘా జైల్….(అంటూ వాచ్ మెన్ వైపు చూసి) నాకు తెలిసి మనిషి చనిపోవడానికి లోకంలో అత్యంత చెడ్డ ప్రదేశం జైలు మాత్రమే….మనిషి చనిపోయిన తరువాత ఆత్మ పుట్టేదీ ఇక్కడ నుండే…..(అంటూ రాము వైపు చూసి) మనం దేని గురించి వెదుకుతూ ఇంత దూరం వచ్చామో…..ఆ వివరాలన్నీ ఈ జైలు గోడల్లో దాగున్నాయని అనిపిస్తున్నది….నాకు తెలిసి మనం ఈ ఆత్మ గురించిన వివరాలు తెలుసుకోవడానికి ఈ రాత్రి గడిస్తే చాలు అనిపిస్తున్నది…..
దాంతో నలుగురూ కూర్చుని కొద్దిసేపు మాట్లాడుకున్నారు….వాచ్ మెన్ ఆ కోట గురించి తనకు తెలిసింది అంతా చెప్పుకొచ్చాడు.

1 Comment

Add a Comment
  1. Katha adiripoyindi Basu….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *