రాములు ఆటోగ్రాఫ్ – Part 4 51

రాము అలా కార్పెట్ మీద నుండి కిందకు దూకగానే కార్పెట్ కూడా కదలడం ఆగిపోయింది.
సుందర్ ప్రేతాత్మ కార్పెట్ దగ్గర లేదని రాముకి అర్ధమయింది.
కాని వెంటనే తన బెడ్ రూమ్ లో నుండి రేణుక ఏడుస్తూ కేకలు పెడుతున్న శబ్దం విని వెంటనే తేరుకుని బెడ్ రూమ్ వైపు వెళ్ళాడు.
రాము బెడ్ రూమ్ దగ్గరకు వచ్చేసరికి ఆ గది తలుపులు వెంటనే మూసుకుపోయి లాక్ అయిపోయింది.
రాము తలుపు మీద గట్టిగా కొడుతూ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్నాడు.
కాని ఆ తలుపులు ఏమాత్రం ఓపెన్ కావడం లేదు….లోపల నుండి రేణుక ఆత్మ అరుపులు, సుందర్ ప్రేత్రాత్మ నవ్వులు రాముకి స్పష్టంగా వినిపిస్తున్నాయి.
ఇక రాము వెనక్కు నాలుగడుగులు వేసి తలుపులు బద్దలు కొడదామని పరిగెత్తుకుంటూ తలుపుల దగ్గరకు వచ్చేసరికి రాము ఊహించని విధంగా ఒక్కసారిగా తలుపులు తెరుచుకుని సుందర్ ప్రేతాత్మ రాముని కోపంగా చూస్తూ, “get out,” అంటూ అరిచింది.
ఆ అరుపుకి రాము ముందుకు వస్తున్న వాడల్లా గాల్లోకి ఎగిరి అక్కడ ఉన్న అద్దాలను పగలకొట్టుకుని బయట లాన్ లోకి వెళ్ళి పడ్డాడు.
అలా ఎగిరి లాన్ లో పడగానే రాము నొప్పితో గిలగిలలాడిపోయాడు….ఒళ్లంతా బాగా నొప్పులుగా అనిపించాయి.
వెంటనే ఆ గదిలో నుండి రేణుక ఆత్మ బాధతో అరుస్తున్న అరుపులు….సుందర్ ప్రేతాత్మ రేణుక ఆత్మని అనుభవిస్తున్నట్టు శబ్దాలు రాముకి వినిపించాయి.
దాంతో రాము తన ఒంట్లోని రఘుని అంతా కూడదీసుకుని లేచి మెయిన్ డోర్ వైపు పరిగెత్తి విల్లా లోపలికి రాబోయాడు.
కాని మెయిన్ డోర్ వెంటనే రాము లోపలికి రాకుండా మూసుకుపోయింది.
రాము కంగారుగా తలుపుని తీయడానికి ట్రై చేస్తున్నాడు…..కాని ఆ డోర్ మాత్రం ఓపెన్ కావడం లేదు.
ఆ ఇంట్లో మెయిన్ డోర్ తో సహా, అన్ని తలుపులకు అద్దాలు బిగించడంతో లోపల అంతా క్లియర్ గా కనిపిస్తున్నాయి.
అలా డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తున్న రాముకి లోపల మెట్ల మీద ఒక వెలుగు కనిపించింది.
దాంతో రాము డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేయడం మానేసి వెలుగు కనిపించిన వైపు చూస్తున్నాడు.
ఆ వెలుగులో తాను బెడ్ రూమ్ లో ఫోటోలో, పైన స్టోర్ రూమ్ వీడియోలో చూసిన ఆమె ఆత్మ లాగా ప్రత్యక్షమయింది.
ఆ ఆత్మను చూసిన రాముకి ఆమే రేణుక అని అర్ధమయ్యి అలాగే చూస్తున్నాడు.
రేణుక ఆత్మ చిన్నగా మెట్లు దిగుతూ రాము వైపు చూస్తూ, “నువ్వు నన్ను ఈ బాధ నుండి తప్పించాలని ఎంతగా ట్రై చేస్తున్నావో… అంతకన్నా ఎక్కువ రెట్లు బాధ నాకు ఇస్తున్నాడు. వాడి ప్రేతాత్మ నన్ను నలభై ఏళ్ళ నుండి నన్ను ఈ విల్లాలో బంధించి ఉంచింది. సుందర్ ప్రేతాత్మ నిన్ను ఎప్పటికీ గెలవనివ్వదు…ఇక్కడ సుందర్ ప్రేతాత్మతో పాటు ఇంకో దుష్ట ఆత్మ కూడా సుందర్ ప్రేతాత్మకి హెల్ప్ చేస్తున్నది….దాంతో నేను ఇద్దరినీ ఎదిరించలేకపోతున్నాను…..నువ్వు ఏదైనా నన్ను రక్షించాలంటే నేరుగా సుందర్ ప్రేతాత్మను ఎదుర్కోలేవు….అందుకని….నువ్వు ముందుగా…..,” అంటూ ఏదో చెప్పే లోపు మాయమైపోయింది.
రేణుక ఆత్మ అలా మాయమైపోగానే ఆ విల్లాలో లైట్లు అన్నీ ఒక్కసారిగా వెలుగుతూ ఆరిపోవడం మొదలుపెట్టాయి.
ఆ వెంటనే రేణుక ఆత్మ బాధతో పెట్టె కేకలు, సుందర్ ప్రేతాత్మ నవ్వులు రాముకి స్పష్టంగా వినిపిస్తున్నాయి.
సుందర్ ప్రేతాత్మ రేణుక ఆత్మను బాధ పెడుతుందని అర్ధమయినా రాముకి ఏం చేయాలో అర్ధం కాక అలాగే వెనక్కి అడుగులు వేసుకుంటూ లాన్ లోకి వచ్చి అక్కడ ఉన్న ఫౌంటెన్ ముందు కూలబడి పోయి అలాగే విల్లా వైపు చూస్తున్నాడు.
విల్లా లోపల లైట్లు వెలుగుతూ, ఆరిపోతూ ఉంటే….రేణుక ఆత్మ అరుపులు….ఆమె ఏడుస్తూ, “నన్ను వదిలెయ్…ప్లీజ్….వదిలెయ్,” బాధతో పెడుతున్న కేకలు…..వాటితో పాటే సుందర్ ప్రేతాత్మ గట్టిగా నవ్వుతూ రేణుక ఆత్మను అనుభవించడం….బయట ఉన్న రాముకి తెలుస్తున్నాయి.
అలా ఫౌంటెన్ దగ్గర కూర్చుని చూస్తున్న రాముకి రేణుక ఆత్మ పడే బాధకు అతని కళ్ళల్లోనుండి కన్నీళ్లు వస్తున్నాయి.
రేణుకకు తాను ఎలా హెల్ప్ చేయాలో తెలియక పదే పదే ఫౌంటెన్ గోడను కొడుతూ విల్లా వైపు చూస్తున్నాడు…..రేణుక కేకలు వింటుంటే రాముకి తన మనసుని ఎవరో గట్టిగా మెలిపెట్టినట్టు బాధతో గిలగిలలాడిపోతు…ఆ అరుపులు వినిపంచకుండా గట్టిగా చెవులు మూసుకున్నాడు.
ఎంతసేపు ఉన్నాడో తెలియని రాము అలాగే ఆ ఫౌంటెన్ గోడను ఆనుకుని నిద్ర పోయాడు.
అలా గాఢంగా నిద్ర పోయిన రాముకి హుక్కా పీల్చి వదిలిన వాసన తన ముక్కుకి తగలడంతో చిన్నగా దగ్గుతూ కళ్ళు తెరిచి పక్కకు తిరిగి చూసాడు.
ఫౌంటెన్ గోడ మీద బాబా కూర్చుని హుక్కా తాగుతుండటం చూసి రాము చిన్నగా పైకి లేచి అతని దగ్గరకు వచ్చాడు.
తన దగ్గరకు వచ్చిన రాము వైపు చూసిన బాబా, “నువ్వు అనుకున్నది మంచి పనే….కాని ఎంచుకున్న మార్గమే తప్పు,” అంటూ హుక్కా గట్టిగా పీల్చి వదిలాడు.
రాము అక్కడే గోడ మీద కూర్చుని, “మరి ఏం చేయాలి….ఆ అరుపులను ఎలా ఆపాలి….రేణుక ఆత్మని సుందర్ ప్రేతాత్మ, దుష్ట ఆత్మ నుండి ఎలా విడిపించాలి….” తల వంచుకుని బాధగా అన్నాడు.
దానికి బాబా, “అది అంత సులభం కాదు….దాన్ని ఎదిరించడానికి నీ శక్తి సరిపోదు,” అన్నాడు.
“నేను ఇక్కడికి వచ్చింది మా కంపెనీ ఒక డీల్ నష్టపోకుందా చూడాలని….కాని ఇప్పుడు రేణుక ఆత్మని ఆ బందిఖానా నుండి తప్పించాలి…అందుకు నేను ఏం చెయ్యడానికైనా సిద్ధంగా ఉన్నాను…రేణుక ఆత్మను విడుదల చేయడానికి అవసరమైతే నా ప్రాణాలు ఇవ్వడానికైనా సిధ్ధంగా ఉన్నాను,” అన్నాడు రాము.
రాము మాటలు విన్న బాబా అతని వైపు చూసి చిన్నగా నవ్వుతున్నాడు.
బాబా ఎందుకు నవ్వుతున్నాడో అర్ధం కాకా రాము తల ఎత్తి అతని వైపు చూసాడు.
రాము చూపు లోని అర్ధం తెలిసిన వాడిలా బాబా అతని వైపు చూసి నవ్వుతూ, “నీకు రేణుక ఆత్మ చెప్పినట్టు ముందుగా ఆ దుష్ట ఆత్మని నిరోధించాలి….ఆ దుష్ట ఆత్మని ముందుగా అంతం చేయగలిగితే అప్పుడు నీకు సుందర్ ప్రేతాత్మని ఎలా ఎదుర్కోవాలో చెబుతాను….అందుకు నువ్వు సుమిత్ర దగ్గరకు వెళ్ళు….మీ ఇద్దరు మాత్రమే సుందర్ ప్రేతాత్మకు సహాయం చేస్తున్న దుష్ట ఆత్మను ఎదుర్కోగలరు…నువ్వు వెంటనే సుమిత్ర దగ్గరకు వెళ్ళు….” అంటూ బాబా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
రేణుక భాధతో అరుస్తున్న అరుపులు విన్న తరువాత రాముకి ఇక ఆ విల్లాలోకి వెళ్ళబుధ్ధి కాలేదు.
దాంతో వెంటనే తన పాకెట్ లో ఉన్న తన కార్ కీస్ తీసుకుని కారులో కూర్చుని ఎక్కడా ఆగకుండా నేరుగా సుమిత్ర వాళ్ళ బంగ్లాకి పోనిచ్చాడు.
అప్పటికే సుమిత్ర కంగారుగా తన బెడ్ రూమ్ లో ఏంచేయాలో తోచక….రాము ఎలా ఉన్నాడో అని ఆలోచిస్తూ….అతనికి ఏం హెల్ప్ చేయలేకపోయానే అన్న బాధతో అటూ ఇటూ తిరుగుతున్నది.
రాము కారు సుమిత్ర బంగ్లా ముందు ఆపి ఎక్కడా ఆగకుండా పరిగెత్తుకుంటూ ఆమె బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

1 Comment

Add a Comment
  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *