రాములు ఆటోగ్రాఫ్ – Part 4 51

దాంతో రాము ఇక ఏమీ చేయలేక సుమిత్ర వెళ్ళిన వైపు ఒక్క క్షణం చూసి మళ్ళీ లోపలికి వచ్చాడు.
లోపలికి వచ్చిన రాముకి ఏం చేయాలో అర్ధం కాలేదు…ఇకా రాము తన మనసులో ఏదైతే అది అయిందని తెగించి ఎలాగైనా తనకు చేతనైనంత వరకు రేణుకకి హెల్ప్ చేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు.
సుమిత్ర కూడా అలా భయపడిపోయి వెళ్ళిందంటే సుందర్ ప్రేతాత్మ చాలా రఘువంతమైనది అని రాముకి అర్ధమైనది.
లోపలికి వచ్చిన రాము ఇందాక సుందర్ ప్రేతాత్మ నిల్చుందని సుమిత్ర చూపించిన మెట్ల వైపు చూస్తూ, “నువ్వు నన్ను భయపెట్టడానికి ఎంత ట్రై చేసినా అది నీవల్ల కాదు….నీ పేరు పిలిస్తే నీకు శక్తి పెరుగుతందంట కదా….” అంటూ ఆ హాల్లో చుట్టూ చూస్తూ, “ఇప్పుడు నేను నీ పేరు పిలుస్తాను….సుందర్….సుందర్….సుందర్….” అంటూ చుట్టూ చూస్తున్నాడు.
అలా నిల్చున్న రాము పక్కనే ఉన్న టీపాయ్ మీద టేబుల్ లైట్ వెలుగుతూ ఆరిపోతూ రెండు సార్లు అలా కొట్టుకుని ఆరిపోయింది.
రాము ఆ టేబుల్ లైట్ వైపు చూస్తూ దాని దగ్గరకు వచ్చి నిల్చున్నాడు.
అంతలో పైన ఉన్న ట్యూబ్ లైట్ కూడా అలాగే కొట్టుకుంటూ ఆరిపోయింది….తరువాత ఆ హాల్లో ఉన్న లైట్లన్నీ ఒకదాని తరువాత ఒకటి అలా కొట్టుకుని పూర్తిగా ఆరిపోయాయి.
దాంతో సుందర్ ఆత్మ అక్కడే ఉన్నదని రాముకి అర్ధమయింది….మనసులో భయంగా ఉన్నా అంతలోనే రేణుక ఆత్మ పడుతున్న బాధ గుర్తుకొచ్చిన వెంటనే భయం ప్లేసులో తెగింపుతో అతని మనసు నిండిపోయింది.
అలా నిల్చున్న రాముకి ఇందాక సుమిత్ర తనతో, “ప్లీజ్ రాము….నువ్వంటే నాకు చాలా ఇష్టం…..నేను ఇంత వరకు ఇంత చెడ్డ ప్రేతాత్మని చూడలేదు…ప్లీజ్…నువ్వు కూడా వీలైనంత తొందరగా ఇక్కడనుండి వెళ్లిపో…మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను…నువ్వు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఇక్కడనుండి వెళ్ళిపో,” అన్న మాటలు మళ్ళీ వినిపిస్తుండటంతో చిన్నగా వెనక్కి తిరిగి చూసాడు.
ఆ మాటలు తను పడుకునే బెడ్ రూమ్ లోనుండి వస్తున్నాయని అర్ధమయ్యి చిన్నగా రాము తన బెడ్ రూమ్ లోకి వెళ్ళాడు.
అక్కడ తన లాప్ టాప్ లో ఇందాక సుమిత్ర కారు దగ్గరకు వెళ్ళి తనతో అన్న మాటలు వీడియోలో రిపీట్ అవుతున్నాయి.
లాప్ టాప్ లో సుమిత్ర తనతో చెబుతున్న మాటలు పదే పదే రిపీట్ అవుతూ ఉంటే చూసి రాము చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ చుట్టూ చూస్తూ తన లాప్ టాప్ దగ్గరకు వస్తున్నాడు.
అలా తన లాప్ టాప్ వైపు చూస్తున్న రాముకి అకస్మాత్తుగా రేణుక గట్టిగా అరిచినట్టు వినిపించి వెనక్కు తిరిగి చూసాడు.
వెనకాల సుందర్ ప్రేతాత్మ నిల్చుని ఉన్నది….మొదటి సారి సుందర్ ని చూసిన రాము ఒక్కసారిగా కొయ్యలా నిల్చుండి పోయాడు.
సుందర్ ప్రేతాత్మ తన చేతిలో ఉన్న గొడ్డలితో రాము మీదకు దాడి చేసింది.
రాము వెంటనే తేరుకుని కిందకు ఒంగి గొడ్డలి పోటుని తప్పించుకుని గోడ వైపుకు వెళ్ళి మళ్ళీ వెనక్కు తిరిగి చూసాడు.
కాని అక్కడ మళ్ళీ ఎవరూ కనిపించలేదు….దాంతో రాము చుట్టూ చూస్తూ బెడ్ రూమ్ మధ్యలోకి వచ్చి నిల్చున్నాడు.
అదృశ్యంగా ఉన్న సుందర్ రాము వెనక్కు వచ్చి అతని కాళ్ళ కింద ఉన్న కార్పెట్ ని పట్టుకుని లాక్కుని వెళ్తున్నాడు.
రాము బేలన్స్ తప్పి కార్పెట్ మీద పడిపోయాడు…..సుందర్ ప్రేతాత్మ కార్పెట్ ని బెడ్ రూమ్ లోనుండి బయటకు లాక్కుని వెళ్తున్నాడు.

ఆ కార్పెట్ మీద ఉన్న రాము తనని ఎక్కడికి లాక్కుని వెళ్తున్నాడో అర్ధం కాక వెంటనే కార్పెట్ మీద నుండి కిందకు దూకాడు.

1 Comment

Add a Comment
  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *