రాములు ఆటోగ్రాఫ్ – Part 4 51

అంటూ ఇంకా చెప్పబోతుండగా సుమిత్ర మధ్యలో ఆపి…..
సుమిత్ర : ఒక్క నిముషం రాము….రక్తపు చుక్కలా….ఏదీ….చూపించు….
అంటూ రాము దగ్గరకు వచ్చింది….రాము తన చేతిని ముందుకు చాచి సుమిత్రకు తన చేతి మీద పడిన రక్తపు చుక్కలు చూపించాదు.
సుమిత్ర ఆ చుక్కల్ని జాగ్రత్తగా చూసి….ఒక నిర్ణయానికి వచ్చినట్టు రాము వైపు చూసి…
సుమిత్ర : నీ చేతి మీద పడిన ఈ చుక్కలు రక్తం కావు…..ఈ చుక్కల ద్వారా అత్మ మనతో ఏదో చెప్పాలనుకుంటున్నది.
సుమిత్ర అలా అనగానే రాము, మహేష్ ఇద్దరూ ఆమె వైపు అలాగే చూస్తుండిపోయారు.
వాళ్ళు అలా ఆ చుక్కల వైపు చూస్తుండగానే అవి అన్నీ వాటంతట అవే కలిసిపోయి ఒక ఆకారం ఏర్పడింది.
అలా ఆ చుక్కలు కదలడం చూసి రాము, మహేష్ ఇంకా బిత్తరపోయి వాటి వైపే చూస్తున్నారు.
దాన్ని సుమిత్ర కొద్దిసేపు బాగా పరిశీలించిన తరువాత ఏదో గుర్తుకు వచ్చిన దానిలా తన రాక్ లో ఉన్న పుస్తకాల్లో నుండి ఒక బుక్ తీసుకుని వచ్చి అందులో కొన్ని పేజీలు తిప్పిన తరువాత ఇందాక రాము చేతిమీద పడిన చుక్కల ప్రకారం కలిపిన సింబల్ ఆ బుక్ లో కనిపించింది.
అది చూడగానే సుమిత్ర కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి….మొహంలో సంతోషం కనపడుతున్నది.
సుమిత్ర మొహంలో సంతోషం చూసి ఆమె బుక్ లో ఏం చూస్తుంది అని అనుకుంటూ ఇద్దరూ ఆమె దగ్గరకు వచ్చారు.
సుమిత్ర తన చేతిలో ఉన్న బుక్ ని వాళ్ల వైపు తిప్పి అందులో ఉన్న బొమ్మని చూపిస్తూ….
సుమిత్ర : రాము……నీ చేతి మీద ఆత్మ పడేసిన చుక్కలు కలవగా వచ్చిన బొమ్మ ఇదే….దీన్ని బాహ్లికం అంటారు….
మహేష్ : బాహ్లికం…..అంటే ఇదేమన్నా పేరా…

1 Comment

Add a Comment
  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *