రాములు ఆటోగ్రాఫ్ – Part 4 51

ఆ బాల్ వెనకాలే రాము, సుమిత్ర ఇద్దరూ ఒకరి చేతిని ఒకరు పట్టుకుని లోపలికి వెళ్లారు….షాపింగ్ కాంప్లెక్స్ లోపల గోడలు అంతా బూజు పట్టి మసితో నల్లగా భయంకరంగా ఉన్నది.
ఎన్నో ఏళ్ల నుండి మూసువేసి ఉండటంతో చాలా నిశబ్దంగా…అదో రకమైన వాసన వస్తూ భయం కలిగించేలా కనిపిస్తున్నది.
రాము, సుమిత్ర మెట్లు ఎక్కుకుంటూ రెండవ ఫ్లోర్ లో లోపలికి వచ్చారు….అక్కడ షాపులు, వాటిలో ఉన్న ఫర్నీచర్ మొత్తం కాలిపోయి…మొత్తం విరిగి పడిపోయి ఉన్నాయి.
అలా చిన్నగా అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వచ్చిన ఇద్దరూ బాల్ ఎక్కడ పడిందా అని షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం చుట్టూ చూసారు.
షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి విసిరేసిన బాల్ దొర్లుకుంటూ వెళ్ళి మూలగా ఉన్న ఒక షాపు లోకి వెళ్ళింది.
దాని వెనకాలే ముగ్గురూ చిన్నగా ఒక వైపు భయపడుతూనే…ఇంకో వైపు ఒకరి చేతులను ఒకరు పట్టుకుని చిన్నగా లోపలికి వెళ్ళారు.
అలా వెళ్తున్న వాళ్లకు లోపల నుండి గబ్బిలం ఒకటి దాని రెక్కలను టపటపలాడించుకుంటూ వాళ్ళ ముగ్గురి తలల మిద నుండి ఎగురుకుంటూ వెళ్ళింది.
దాంతో ముగ్గురు ఒక్కసారిగా భయపడుతూ కింద కూర్చున్నారు….సుమిత్ర మాత్రం రాముని గట్టిగా పట్టుకున్నది.
అలా కూర్చున్న ముగ్గురికి వాళ్ళకు పదడుగుల దూరంలో వాళ్ళు విసిరేసిన బంతి కనిపించింది.
సుమిత్ర చిన్నగా పైకి లేచి నడుచుకుంటూ బంతి దగ్గరకు వెళ్ళి కిందకు ఒంగి చేతిలోకి తీసుకుని ఏదో గాలి వీస్తున్న సౌండ్ వినిపించే సరికి తల ఎత్తి చుట్టూ చూస్తున్నది.
రాము కూడా అలాగే చుట్టూ చూస్తూ ఏం జరగబోతుందా అని టెన్షన్ తో చూస్తున్నాడు….అలా చూస్తున్న రాముకి తన చేతి మీద ఏదో పడటం చూసి చేతిని పైకి ఎత్తి చూసుకుంటుండగా….కొన్ని రక్తపు చుక్కలు ఆగకుండా పైనుండి పడుతుండటం చూసి తల పైకి ఎత్తి చూసేసరికి పైన రూఫ్ లో నుండి ఒక తలుపు లాంటిది తెరుచుకుని ఒక శవం రాము మిద పడింది.
ఊహించని పరిణామానికి రాము గట్టిగా అరుస్తూ కింద పడిపోయాడు….కింద పడిన వెంటనే తన మీద పడిన శవాన్ని పక్కకు తోసేసి పైకి లేచాడు.
రాము మిద నుండి పక్కకు పడిన మరుక్షణం విచిత్రంగా ఆ శవం కాలి బూడిద అయిపోయింది.
సుమిత్ర కూడా పరిగెత్తుకుంటూ వచ్చి రాముని భయంతో వాటేసుకున్నది.
మహేష్ కూడా అలాగే భయంతో కొయ్యబారిపోయాడు.
రాము సుమిత్ర చేయి పట్టుకుని పరిగెత్తుతూ మహేష్ దగ్గరకు వచ్చి వాడి చెయ్యి కూడా పట్టుకుని బయటకు పరిగెత్తుకుంటూ వచ్చి కారులో కూర్చున్నారు.
అలా కారులొ కూర్చున్న ముగ్గురికీ దాదాపు పావుగంట దాకా వాళ్లకు షాపింగ్ కాంప్లెక్స్ లొపల జరిగినదానికి టెన్షన్ తగ్గలేదు.
కొద్దిసేపటి తరువాత డ్రైవింగ్ సీట్లో కూర్చున్న రాము కారు స్టార్ట్ చేసి ఇంటికి పోనిచ్చాడు.
ఇంట్లోకి వెళ్ళిన తరువాత ముగ్గురూ నేరుగా ఆఫీస్ రూమ్ లోకి వెళ్ళి కూర్చుని ఐదు నిముషాలు అక్కడ ఏం జరిగింది మొత్తం కళ్ళు మూసుకుని గుర్తు చేసుకున్నారు.
అలా పది నిముషాల తరువాత సుమిత్ర రాము వైపు చూస్తూ….
సుమిత్ర : రాము….చాలా జాగ్రత్తగా గుర్తు తెచ్చుకో….నువ్వు గుర్తు తెచ్చుకునే ఒక్కో విషయం మనం ముందుకు అడుగు వేయడానికి పనికొస్తుంది….ఆ ఆత్మ తప్పకుండా నీతో ఏదో చెప్పటానికి ట్రై చేసుంటుంది…
రాము ఒక్కసారి కళ్ళు మూసుకుని జరిగింది తల్చుకుంటున్నాడు….మహేష్, సుమిత్ర ఇద్దరూ రాము ఏం చెప్తాడా అన్నట్టు చాలా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.
రాము : నాకు ఏం గుర్తు రావడం లేదు సుమిత్ర….ఆ శవం ఒక్కసారి మీద పడగానే నాకు ఒక్క క్షణం ఏం చేయాలో అర్ధం కాలేదు…దాన్ని నా మీద నుండి తోసేయగానే దానంతట అదే కాలిపోవడంతో నాకు ఏం చేయాలో తోచక మీ ఇద్దరిని తీసుకుని బయటకు వచ్చేసాను…
సుమిత్ర : అది క్లియర్ గా చెప్పక్కర్లేదు….ఒక్కో సారి గుసగుసలాడినట్టు కూడా అనిపిస్తుంది…అది నువ్వు గమనించి ఉండవు… లేకపోతే నీకు అర్ధం అయి ఉండదు….కొన్ని అత్మల భాష మనకు అర్ధం కాదు…కాని దాన్ని ఫీల్ అవగలవు….గుర్తు తెచ్చుకో…
రాము : నేను లోపలికి వెళ్ళిన తరువాత నువ్వు బాల్ తీసుకోవడానికి ముందుకు వెళ్ళిన తరువాత నేను అక్కడే నిల్చున్నాను. అనుకోకుండా నా చేతి మీద కొన్ని రక్తపు చుక్కలు పడ్డాయి…నా చేతి మీద రక్తపు చుక్కలు పడటం చూసి నేను తల పైకెత్తి చూస్తుండగా…..

1 Comment

Add a Comment
  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *