రాములు ఆటోగ్రాఫ్ – Part 4 51

రాము : లేదు సుమిత్ర….నేను ఎలాగైనా రేణుకని రక్షించాలి…ఇందులొ ఎటువంటి మార్పూలేదు….
సుమిత్ర : సరె…..ఇప్పుడు మనం ఆ ధియేటర్ కి వెళ్ళి…..
మహేష్ : ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ….అంటే ఆ థియేటర్ లో చనిపోయిన వాళ్ళు ఇంకా ఆత్మల రూపంలో ఇంకా అక్కడే ఉన్నారా….
సుమిత్ర : అవును….అందుకనే అక్కడకు వెళ్దామని అంటున్నాను….అక్కడ ఉన్న వేల ఆత్మలలో ఏదో ఒక్క ఆత్మ అయినా మంచిది ఉంటుందని నా నమ్మకం….ఆ మంచి ఆత్మ మనకు హెల్ప్ చేస్తుందని అనుకుంటున్నాను…..
అంటూ టేబుల్ మీద ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ తీసుకుని వాళ్ళ వైపు చూసి….
సుమిత్ర : ఇక వెళ్దామా…..
దాంతో ఇద్దరూ లేచి అలాగే అన్నట్టు తల ఊపారు.
ముగ్గురూ ఇంటి నుండి బయటకు వచ్చి కారులో అరగంట ట్రావెల్ చేసిన తరువాత వాళ్ళు అగ్ని ప్రమాదం జరిగిన షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు వచ్చారు.
ఆ రాత్రి చీకటిలో ఆ థియేటర్ ఇంకా భయంకరంగా కనిపిస్తున్నది.
ముగ్గురూ ఆ షాపింగ్ కాంప్లెక్స్ వైపు చూస్తూ కారులో నుండి దిగి దాని దగ్గరకు నడుచుకుంటూ వెళ్లారు.
షాపింగ్ కాంప్లెక్స్ దగ్గరకు రాగానే అక్కడ ఐరన్ ఫెన్సింగ్ ఉండటంతో అక్కడ నుండి ఎలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ….దగ్గరలో దారి ఏమైనా ఉన్నదేమో అని చుట్టూ చూస్తున్నారు.
అంతలో సుమిత్ర తను తెచ్చిన హ్యాండ్ బ్యాగ్ లోనుండి ఐరన్ కట్టర్ తీసి రాముకి ఇస్తూ….
సుమిత్ర : దీంతో ఈ ఫెన్సింగ్ కట్ చెయ్…..అప్పుడు లోపలికి వెళ్దాం….
రాము ఆమె చేతిలో ఉన్న కట్టర్ తీసుకుంటూ సుమిత్ర మొహంలోకి ఆశ్చర్యంగా చూసాడు….
సుమిత్ర : మరి ఇలాంటి చోటకు వచ్చేటప్పుడు అన్నీ ప్లాన్ చేసుకోవాలి….మనం తిరణాలకు రాలేదు కదా….అన్నీ దొరకడానికి…
రాము : నువ్వు మామూలు దానివి కాదు…..అందుకే బాబా ఈ పని నీవల్ల అవుతుందని చెప్పాడు…
సుమిత్ర : ఈ చిన్న దానికే ఇలా ఆశ్చర్యపోతే ఎలా రామూ….ముందు ముందు చాలా చూడాలి….ముందు పని కానివ్వు….
అలా అనడంతో రాము కట్టర్ తో ఫెన్సింగ్ కట్ చేసేసరికి ముగ్గురూ లోపలికి వెళ్లారు.
ముగ్గురు తల ఎత్తి షాపింగ్ కాంప్లెక్స్ వైపు చూస్తూ అడుగులో అడుగు వేసుకుంటూ దాని దగ్గరకు వెళ్లారు.
సుమిత్ర తన హ్యాండ్ బ్యాగ్ లోనుండి ఒక టెన్నిస్ బాల్ లాంటిది బయటకు తీసింది….దాని మీద ఏదో అక్షరాలు రాసి ఉన్నాయి.
రాము ఆమె చేతిలో ఉన్న బాల్ వైపు చూస్తూ దాంతో ఏం చేస్తావు అన్నట్టు సుమిత్ర వైపు చూసాడు.
సుమిత్ర : ఇది ఒక రకమైన భాష….దీనితో ఆత్మలను కమ్యూనికేట్ చెయ్యొచ్చు….నేను ఈ బాల్ మీద హెల్ప్ చేయమని రాసాను. నేను దీన్ని షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి విసిరేస్తాను….ఈ బాల్ ఎక్కడ అయితే ఆగుతుందో మనకు కావాల్సిన మంచి ఆత్మ అక్కడే దొరుకుతుంది…..
మహేష్ : ఇది అనుకున్నంత తేలికగా కనిపించడం లేదు….కొంచెం భయంగానే ఉన్నది….
సుమిత్ర : అవును మహేష్….నువ్వు చెప్పింది కరెక్టే…..ఇక్కడ మంచి ఆత్మలతో పాటు, చెడ్డ ఆత్మలు కూడా ఉంటాయి…(అంటూ రాము దగ్గరకు వచ్చి ) రామూ….ఈ ప్రాబ్లం సాల్వ్ చేయాలని నువ్వు గట్టిగా అనుకుంటున్నావు కాబట్టి సమాధానం కూడా నీకే వస్తుంది….అందుకని ఈ బాల్ నువ్వే లోపలికి విసిరెయ్….ఈ బాల్ తో పాటే నువ్వు కూడా లోపలికి వెళ్ళాలి….
ఆమాట వినగానే రాము కొంచెం భయంగా సుమిత్ర వైపు చూసాడు.
దాంతో సుమిత్ర తన చేత్తో రాము చేతిని పట్టుకుని అతని కళ్లల్లోకి చుస్తూ….
సుమిత్ర : భయపడకు రామూ….నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు….నీతో పాటే నేను కూడా లొపలికి వస్తాను….
మహేష్ : అవునురా…నేను కూడా మీ ఇద్దరితో పాటు లోపలికి వస్తాను….ముగ్గురం కలిసే ఆ బాల్ ఎక్కడకు వెళ్తుందో అక్కడకు వెళ్దాం…..
మహేష్ అలా అనగానే సుమిత్ర, రాము ఇద్దరూ మహేష్ వైపు చూసారు….
మహేష్ : అంటే….నాకు భయం వేసి కాదు….లోపల నా హెల్ప్ ఏమైనా అవసరం అవుతుందేమో అని వస్తానన్నాను…..(అలా అంటున్న తన వైపు వాళ్ళిద్దరూ ఇంకా అలాగే చూస్తుండే సరికి….ఇక తప్పదన్నట్టు) సరెరా….మీరు అనుకుంటున్నది నిజమే… నాకు ఒక్కడినీ ఇక్కడ ఉండాలంటె భయంగానే ఉన్నది….అందుకనే నేను మీతొ వస్తానంటున్నాను….సరెనా….
మహేష్ అలా అనగానే రాము, సుమిత్ర ఇద్దరూ ఒక్కసారిగా నవ్వారు.
సుమిత్ర తన చేతిలో బాల్ ని తన నుదురు మీద పెట్టుకుని ఏదో మంత్రాలు చదువుతున్నట్టు చదువుతూ రాము చేతికి ఇచ్చింది
రాము సుమిత్ర చేతిలొని బాల్ తీసుకుని షాపింగ్ కాంప్లెక్స్ లోపలికి విసిరేసాడు.

1 Comment

Add a Comment
  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *