రాములు ఆటోగ్రాఫ్ – Part 4 51

మహేష్ : నిజమేరా…నువ్వు చెబుతుంటె ఏదో అనుకున్నాను….నిజంగానే ఆ విల్లాలో దెయ్యాలున్నాయన్నమాట….
రాము : అదే కదరా నేను కూడా చెప్పేది….అందుకనే నిన్ను విల్లాలోకి వెళ్ళకుండా ఆపాను….
మహేష్ : రాము…..ఇది నువ్వనుకున్నంత తేలిక మాత్రం కాదు….చాలా జాగ్రత్తగా ముందడుగు వేయాలి…..
రాము : సుమిత్ర….ఆత్మల గురించి….వాటి నడవడిక గురించి బాగా తెలిసిన నువ్వే ఏదో ఒకటి చేయాలి…
సుమిత్ర : నువ్వు చెప్పింది కరెక్టే రామూ….నేను విల్లాకు వచ్చినప్పుడు సుందర్ ప్రేతాత్మ గురించి తెలిసింది…అది చాలా క్రూరంగా ఉన్నది….ఇప్పుడు ఈ ఫోటోలో చూపిస్తున్న ఆత్మ కూడా చాలా శక్తివంతమైనదిగా ఉన్నది….నేను చెప్పింది విని….ఈ డీల్ కేన్సిల్ చేసుకుని వెనక్కు వెళ్ళు….దీని వలన పోతే డబ్బులే పోతాయి….ప్రాణాలు ఉంటే డబ్బులు మళ్ళీ సంపాదించుకోవచ్చు….కాని ప్రాణాలు మళ్ళి తిరిగి రావు….నా మాట విను….కాని ఇలా ప్రత్యక్షంగా దెయ్యాన్ని ఫోటోలో డైరెక్ట్ గా ఇప్పుడె చూస్తున్నాను….దీన్ని నా ఫోన్ కి పంపించు…..
రాము : నీ ఆత్రం తగలెయ్య…..ముందు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పమంటుంటె…నీ ఫోటో కలెక్షన్ గురించి చెబుతావేంటి….
మహేష్ : రామూ…నువ్వు కొద్దిసేపు ఆగు….(అంటూ రాముని ఆపి….సుమిత్ర వైపు చూస్తూ) మేడమ్….ఇంతకు ఈమె ఎవరై ఉంటారు…..
సుమిత్ర : అది ఖచ్చితంగా దెయ్యమే మహేష్….ఇది కూడా సుందర్ లాగే చాలా చెడ్డ ఆత్మ….మనుషుల్లో చెడ్డవాళ్లందరూ ఒకరికి ఒకరు హెల్ప్ ఎలా చేసుకుంటుంటారో….అలాగే దెయ్యాల్లో కూడా ఇలా ప్రత్యేకించి ప్రేతాత్మలు….వాటి స్వభావాలు ఒకటే అయినప్పుడు దాదాపుగా ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటుంటాయి….నాకు తెలిసినంత వరకు ఇది కూడా తప్పు చేస్తూ ఉంటే చంపేసి ఉంటారు….దాంతో ఇది సుందర్ తో పాటు ఉంటున్నది…
రాము : మరి ఇలాంటి వాటిని మట్టుపెట్టేది ఎలా…..
మహేష్ : అసలు…ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది…దాని ఉద్దేశ్యం ఏమిటి…దాన్ని ఎలా నివారంచాలి…ఇదంతా ఎలా కనిపెట్టాలి.
సుమిత్ర : చాలా కష్టం రామూ….కాని అసాధ్యం మాత్రం కాదు….
మహేష్ : మీరు చెప్పేది కరెక్టే….ప్రతి దానికి ఏదో ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది కదా…..
సుమిత్ర : సొల్యూషన్ అనేది మనుషులకు ఉంటుంది….ఆత్మలకు కాదు…..కాని ఇలాంటి ప్రేతాత్మలకు మాత్రం సొల్యూషన్ అనేది చాలా….చాలా కష్టం….(అంటూ రాము వైపు చూసి) అందుకని నేను చెప్పేది ఏంటంటే….నువ్వు ఇక ఆ విల్లా గురించి, రేణుక గురించి మర్చిపో….వెళ్ళి చక్కగా నీ బిజినెస్ చూసుకో…..అర్ధమయిందా….
రాము : నేను ఇంత కష్టపడుతున్నది….మధ్యలో ఆపేసి వెళ్లడానికి కాదు….నాక్కూడా దెయ్యాలంటే చాలా భయం….నేను విల్లాలో ఉన్నంత సేపూ….ప్రతి క్షణం ఏం జరుగుతుందా అని భయపడుతూనే ఉన్నాను….కాని రేణుక రాసిన లెటర్ చదివిన తరువాత ఆమె పడిన బాధ నన్ను ఒక్క క్షణం కూడా ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు….నేను ఆ ఆత్మతో పోరాడాలని అనుకుంటున్నాను….
ఆ మాట వినగానే సుమిత్ర నవ్వుతూ….
సుమిత్ర : నువ్వు మరీ మూర్ఖంగా మాట్లాడుతున్నావు రామూ…..యుధ్ధం అనేది ఎప్పుడైనా ఇద్దరు వ్యక్తుల మధ్య….అదీ ఇద్దరూ సమాన బలవంతులు అయితే జరుగుతుంది….కాని ఇక్కడ నీకు నీ శత్రువు కంటికి కనిపించడం లేదు….ఇక్కడ ఈ ప్రేతాత్మ నీ మిద దాడి చేయగలుగుతుంది….కాని నువ్వు దాని మీద దాడి చేయలేవు…ఈ ఆత్మలతో పైటింగ్ అనేది నీకు సూటవదు….దీని గురించి మర్చిపో….
రాము : సుమిత్రా….నేను ఇక్కడకు వచ్చింది….నీ సలహాలు వింటానికి కాదు…..నువ్వు నాకు సహాయం చెయ్యగలవేమో అని వచ్చాను…
సుమిత్ర : రాత్రి పన్నెండు గంటలకు స్మశానానికి వెళ్లమంటే…వెళ్ళగలవా….నీకు అంత ధైర్యం ఉన్నదా….
రాము : నాకు స్మశానంలో దెయ్యాలు ఉంటాయా ఉండవా అనేది తెలియదు….కాని రెండు రోజుల నుండి విల్లాలో దెయ్యాలు ఉన్నాయని తెలిసినా కూడా అక్కడె ఉంటున్నాను….వాటితో మాట్లాడాను కూడా…నీకు ఇంతకంటె ధ్యైర్యం కావాలా….
సుమిత్ర : కాని నువ్వు చేసే ప్రతి పని ఆ రెండు ఆత్మలకు కోపం కలిగించాయంటే….నీ ప్రాణానికే ప్రమాదం….తెలిసి తెలిసి నేను నీ లైఫ్ ని రిస్క్ లో పెట్టలేను…..నీకు ఏదైనా జరిగితే తట్టుకోవడం నావల్ల కాదు….నేను ఈ విషయంలో నీకు ఏ హెల్ప్ చేయలేను… నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోతే మంచిది…..
రాము : సరె సుమిత్ర….ఈ విషయంలొ నేను నిన్ను బలవంత పెట్టలేను….(అంటూ కుర్చీలో నుండి లేచి వెళ్ళిపోతూ వెనక్కు తిరిగి సుమిత్ర వైపు చూసి) కాని నేను మాత్రం నా ప్రయత్నం చేయకుండా వదిలిపెట్టే ప్రసక్తే లేదు….నీ హెల్ప్ ఉంటే ఒక పధకం ప్రకారం దాన్ని నిరోధించొచ్చు….లేకపోతే నాకు చేతనైన పధ్ధతిలో నేను వెళ్తాను….(అంటూ అక్కడ నుండి వెళ్లబోయాడు)
దాంతో సుమిత్రకు రాము ఇక ఏం చెప్పినా వినడని అర్ధమయింది….దాంతో ఒక్కసారి గట్టిగా గుండెల నిండా గాలి పీల్చుకుని అక్కడ నుండి వెళ్తున్న రాము వైపు చూసి….
సుమిత్ర : రామూ….ఒక్క నిముశం…..నేను చెప్పేది అర్ధం చేసుకో….ప్రశాంతంగా ఆలోచించు….
రాము : నాక్కూడా చావంటే చాలా భయం సుమిత్ర…..కాని నాకు మాత్రం ఒక సాధారణమైన వ్యక్తిగా చనిపోవడం ఏమాత్రం ఇష్టం లేదు….నేను రేణుక ఆత్మని ఈ బాధల నుండి రక్షించడానికి ఏమైనా చేస్తాను….ఆ విషయం ఇప్పటికే అది నీకు బాగా అర్ధం అయిఉంటుంది…ఇంత చెప్పినా కూడా నువ్వు నాకు హెల్ప్ చేయకపోయినా కూడా….నేను ఒంటరిగా ఐనా నా ప్రయత్నం నేను చేస్తాను…..
రాము చెప్పింది విని సుమిత్ర ఒక్క క్షణం ఆలోచించి….
సుమిత్ర : రామూ….నేను నీతో ఉండటం వలన కాని…నీకు హెల్ప్ చేయడం వలన కానీ నీ ప్రాణానికి ప్రమాదం జరగదని ఏమాత్రం గ్యారెంటీ నేను ఇవ్వలేను….కాని….నేను నీకు తప్పకుండా హెల్ప్ చేస్తాను….ఇక మనం చేయబోయే పని చాలా ప్రమాదకరమైనది.
రాము : అది నాకు తెలుసు….
సుమిత్ర : నన్ను పూర్తిగా చెప్పనివ్వు రామూ…..మనం బయలుదేరే ముందు….నువ్వు ఎవరినైనా కలవాలన్నా, మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలన్నా మాట్లాడు….తరువాత అవకాశం వస్తుందో రాదో చెప్పలేను….ఎందుకంటె మనం వెళ్తున్న దారిలో వెళ్లడం వరకే మన చేతుల్లో ఉన్నది….తిరిగి వస్తామా….లేదా అన్నది నీ చేతుల్లో కాని, నా చేతుల్లో కాని లేదు….
రాము : మరి నీ సంగతేంటిరా మహేష్….నువ్వు ఇంటికి బయలుదేరితే మంచిది….
మహేష్ : లేదురా…నేను కూడా నీతో వస్తాను….
రాము : నీకేమైనా పిచ్చి పట్టిందా….ఇందులో చాలా ప్రమాదం ఉన్నది….సుమిత్ర చెప్పింది అర్ధం కావడం లేదా….
మహేష్ : నాక్కూడా భయం లేదురా….ఒకరికి ఇద్దరం ఉంటే చాలా ధైర్యంగా ఉంటుంది….అయినా నువ్వు ఇక్కడ ఇంత రిస్క్ తీసుకుంటుంటుంటే….నేను అక్కడ ప్రశాంతంగా ఎలా ఉంటాను….
రాము : అది కాదురా….
మహేష్ : ఇంక నువ్వు ఏం చెప్పొద్దు….కాలేజీలొ పరిచయం అయిన దగ్గర నుండి మనిద్దరం ఎలా ఫ్రండ్స్….అలాగే ఇప్పుడు కూడా నేను నిన్ను వదిలి వెళ్ళను…..
దాంతో రాముకి ఇక ఒప్పుకోక తప్పలేదు.
సుమిత్ర కూడా వాళ్ళిద్దరి ఫ్రండ్ షిప్ చూసి సంతోషించింది.
రాము : సుమిత్రా….మనం ఇక ఇప్పుడు ఏం చేద్దాం…..
సుమిత్ర : నా దగ్గర ఒక ప్లాన్ ఉన్నది రామూ….ఈ రాత్రికి మన ముగ్గురం ఒక చోటకు వెళ్తున్నాం….రెడీగా ఉండండి….
ఆ మాట వినగానే రాము అలాగే అన్నట్టు తల ఊపి మహేష్ వైపు చూసి….
రాము : రేయ్ మహేష్….ఇక నీ సంగతేంటి….ఇప్పుడు నువ్వు గెస్ట్ రూమ్ కి వెళ్ళి రాత్రి మనం వెళ్లేదాకా బాగా ఆలోచించుకో… మళ్ళీ చెబుతున్నాను….మనం చేయబోయేది చాలా ప్రమాదకరమైన పని…నాకు మాత్రం నిన్ను తీసుకెళ్లడం అసలు ఇష్టం లేదు. అందుకని మాతో వచ్చేముందు బాగా ఆలోచించుకుని బయలుదేరు….
మహేష్ : ఇందులో ఆలోచించుకునేది ఏం లేదు రామూ….నేను నీతో పాటే….
రాము : సరె….వెళ్ళి రెస్ట్ తీసుకో….ఈ లోపు ఒకసారి ఆలోచించుకో….
మహేష్ సరె అన్నట్టు తలఊపేసరికి…సుమిత్ర తన అసిస్టెంట్ ని పిలిచి మహేష్ ని గెస్ట్ రూమ్ కి తీసుకెళ్లమని చెప్పడంతో మహేష్ ఆమె వెనకాలే గెస్ట్ రూమ్ కి వెళ్ళాడు.
మహేష్ అక్కడ నుంది వెళ్ళిపోయిన తరువాత సుమిత్ర రాము దగ్గరకు వచ్చి….
సుమిత్ర : తెలిసి….తెలిసి నాకెందుకో మహేష్ ని కూడా రిస్క్ లోకి లాగుతున్నామేమో అనిపిస్తున్నది….
రాము : నాక్కూడా అదే అనిపిస్తున్నది….కాని వాడు మాట వినడం లేదు కదా…..
సుమిత్ర : సరె…ఇవన్నీ తరువాత మాట్లాడుకుందాం….నీతో రావడానికి ఒప్పుకున్నా కదా….మరి నా సంగతేంటి….

1 Comment

Add a Comment
  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *