రాములు ఆటోగ్రాఫ్ – Part 4 51

రాము చిన్నగా నవ్వుతూ బాత్ రూమ్ డోర్ వేసుకుని స్నానం చెయడం మొదలుపెట్టాడు.
సుమిత్ర బెడ్ రూమ్ నుండి బయటకు వచ్చి తన పనివాళ్ళకు టిఫిన్ రెడీ చెయ్యమని చెప్పింది.
రాము మళ్ళీ తిరిగి వచ్చేసరికి సుమిత్రలో ఆనందం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
సుమిత్ర ఆనందంగా ఉండటం చూసి పనివాళ్ళు మళ్ళీ ఉత్సాహంగా పని చేయడం మొదలుపెట్టారు.
ఇంతలో రాము స్నానం పూర్తి చేసి బెడ్ రూమ్ లోకి వచ్చి బట్టలు వేసుకుంటున్నాడు.
అంతలో ఫోన్ మోగుతుండే సరికి రాము ఫ్యాంట్ వేసుకుంటూ, “అసలే చిరాగ్గా ఉన్నప్పుడు….ఇప్పుడు ఎవడు ఫోన్ చేస్తున్నది,” అని విసుక్కుంటూ ఫోన్ తీసుకుని చూసేసరికి మహేష్ ఫోన్ చేస్తుండటం చూసి లిఫ్ట్ చేసి, “హలో…మహేష్ చెప్పరా,” అన్నాడు.
మహేష్ : ఏరా,.,…చెప్పకుండా ఊరెళ్ళిపోయావు….నాకు చెబితే నేను కూడా వచ్చే వాడిని కదా….
రాము : అరేయ్….నేను అమ్మాయితో రాలేదురా….నీకు చెప్పడానికి….పని మిద వచ్చాను….
మహేష్ : నాకు తెలుసురా…..అందుకనే నేను కూడా వచ్చాను….
ఆ మాట వినగానే రాము గుండె ఒక్కసారిగా వేగంగా కొట్టుకోవడం మొదలయింది….
రాము : ఏంటిరా….నువ్వనేది….ఎక్కడున్నావు….ఎక్కడికి వచ్చానంటున్నావు….
మహేష్ : అదేరా…..మీ నాన్నగారు నీకు చెప్పిన ఒబరాయ్ విల్లా ముందు ఉన్నాను….లోపలికి వద్ధామంటే ఇక్కడ గేటు తాళం వేసి ఉన్నది….లోపల ఉన్నావా….లేక బటకు ఎక్కడికైనా వెళ్లావా….
రాము : ఒరేయ్…..(అంటూ గట్టిగా అరిచాడు….)
మహేష్ : ఏంటిరా…..అంత గట్టిగా అరిచావు….ఏంటి సంగతి….
రాము : ను….వ్వు….ఆ….విల్లాలోకి వె…ళ్ళొ….ద్దు…..అక్కడే ఉండు…
మహేష్ : ఏంటిరా….మాట తడబడుతున్నది….ఇంతకు నువ్వు ఎక్కడ ఉన్నావు….
రాము : రేయ్…నేను నీకు అంతా వివరంగా చెబుతాను…నువ్వు మాత్రం విల్లాలోకి వెళ్ళకు….(అంటూ తన నుదురు రుద్దుకుంటూ ఒక్క క్షణం ఆలోచించిన తరువాత వెంటనే) నువ్వు అక్కడ నుండి వెంటనే సెంటర్ కి వచ్చేస్తే అక్కడ బజాజ్ షోరూమ్ ఉన్నది… నువ్వు అక్కడే ఉండు…నేను కారు పంపిస్తాను….
మహేష్ : సరె….అలాగే….ఉంటా…కాని నువ్వు ఎందుకు అంత కంగారు పడుతున్నావు…..
రాము : అరేయ్….ఇప్పటికె చాలా టెన్షన్ లో ఉన్నాను….విసిగించక….చెప్పింది చెయ్యి….ఇక్కడికి వచ్చిన తరువాత నేను అంతా వివరంగా చెబుతాను…..
మహేష్ : అరేయ్….నెను కారులో వచ్చాను….నువ్వు అడ్రస్ చెప్పు….నేను వచ్చేస్తాను….
రాము : సరె….నేను what’s up చేస్తాను….
మహేష్ : సరె తొందరగా పంపించు….ఆకలేస్తున్నది….(అని ఫోన్ పెట్టేసాడు.)
రాము కూడా పోన్ కట్ చేసి what’s up లో సుమిత్ర అడ్రస్ పంపించాడు.
ఫోన్ బెడ్ మీదకు విసిరేసి రాము బట్టలు వేసుకుని కిందకు వచ్చాడు…..సుమిత్ర కనిపించకపోయే సరికి అక్కడ పనామె కనిపించేసరికి ఆమెను ఆపి….
రాము : సుమిత్ర ఎక్కడ ఉన్నది….
పనామె : డైనింగ్ రూమ్ లో ఉన్నారయ్యా…..
రాము అలాగే అన్నట్టు తల ఊపుతూ నేరుగా డైనింగ్ హాల్లోకి వెళ్లాడు.
అక్కడ సుమిత్ర టిఫిన్ చేస్తూ కనిపించేసరికి రాము ఆమె వైపు చూసి నవ్వుతూ….
రాము : రాక్షసి…..నేను వచ్చేదాకా కూడా ఆగలేకపోయావా….అప్పుడే తినడం మొదలుపెట్టావు….
అంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి చైర్ లాక్కుని కూర్చున్నాడు.
రాము కూర్చోగానే అక్కడ పనామె వచ్చి రాము ముందు ప్లేట్ పెట్టి టిఫిన్ వడ్డిస్తున్నది.
సుమిత్ర : ఇందాకటి దాకా టెన్షన్ మీద ఉండే సరికి ఆకలి తెలియలేదు….కాని నువ్వు కనిపించేసరికి టెన్షన్ మొత్తం దిగిపోయి ఆకలి తెలుస్తున్నది….అందుకనే తినేస్తున్నాను….
రాము : సరె…సరె….కానివ్వు….నీకో విషయం చెప్పాలి…..
సుమిత్ర : చెప్పు….ఏంటి విషయం….
రాము : ఏం లేదు….నా ఫ్రండ్ మహేష్….వస్తున్నాడు….
సుమిత్ర : అతను ఇప్పుడెందుకు వస్తున్నాడు….
అంటూ దిగాలుగా రాము వైపు చూసింది….
రాము : వాడు వస్తుంటే నువ్వెందుకు అలా దిగాలుగా ఉన్నావు….(అంటూ చిన్నగా నవ్వుతూ ఆమె వైపు చూసాడు.)
సుమిత్ర : దిగులు ఉండదా….అతను వచ్చాడంటే…మనిద్దరం కలవడం కుదరదు కదా…..
రాము : అలాంటిదేం లేదు….మన ప్రైవసీకి అడ్డేముండదు….
సుమిత్ర : అలా అయితే ఓకె….
రాము : కాని నేను ఇక్కడకు వచ్చింది….నీతో ఒక విషయం డిస్కస్ చేయాలి…..
సుమిత్ర : అవన్నీ తరువాత చేద్దాం….
రాము : చూడు సుమీ….చాలా ఇంపార్టెంట్ మ్యాటర్…..అది కాక మహేష్ గాడు కూడా వస్తున్నాడు….అందుకని వాడు ఉన్నంత సేపు నువ్వు నాతో చనువుగా కాకుండా కొంచెం హుందాగా ఉండు….వాడికి మన మిద అనుమానం రాకూడదు….
సుమిత్ర : అలాగే రాము గారు…..
రాము : అంత అక్కర్లేదు….రాము అని పిలువు చాలు….
దాంతో సుమిత్ర కూడా నవ్వే సరికి ఇద్దరూ కలిసి టిఫిన్ చేయడం పూర్తి చేసారు.
టిఫిన్ చేసిన తరువాత ఇద్దరూ అక్కడ నుండి హాల్లోకి వస్తుంటే మహేష్ లోపలికి వస్తూ కనిపించేసరికి రాము ఆనందంగా….
రాము : ఒరేయ్ మహీ….ఏంటిరా….ఇలా సడన్ గా….ఊడిపడ్డావు….
అంటూ మహేష్ దగ్గరకు వెళ్ళి వాటేసుకున్నాడు.

1 Comment

Add a Comment
  1. శాపం మూవీ చూసారా? But it’s ok…good one

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *