రాములు ఆటోగ్రాఫ్ – Part 11 35

(ప్రసాద్ ఎవరో తెలుసుకదా……ఓ భార్య కధ…..ఇందులో SP గారి రికమండేషన్ తో SI అయ్యాడు….)
దాంతో రాము తన చైర్ లో నుండి లేచి ప్రసాద్ కి షేక్ హ్యాండ్ ఇవ్వడానికి తన చేతిని ముందుకు చాపాడు.
ప్రసాద్ వెంటనే రాము వైపు తిరిగి అతనికి సెల్యూట్ చేసి చేతిని చాపి షేక్ హ్యాండ్ ఇచ్చాడు.
కమీషనర్ : సరె….ఇప్పుడు పరిచయాలు అయిపోయాయి కాబట్టి….ముందు మనం ఏం చేయాలో చెబుతాను…. (అంటూ రాము వైపు చూసి) రామూ….మీరు ప్రసాద్ కి మనం చేయబోయే ఆపరేషన్ వివరాలు చెప్పండి (అంటూ తన టేబుల్ మీద ఫైల్ తీసుకుని రాముకి ఇస్తూ) ఇందులో ఆ గుడికి సంబంధించిన అన్ని వివరాలు ఉన్నాయి….(అని ప్రసాద్ వైపు చూసి) ప్రసాద్…..నువ్వు ఆ ఊర్లొకి వెళ్లిన తరువాత మీ ఇద్దరూ ఒకరికి ఒకరు తెలియనట్టె ఉండాలి…. కాని ఒకరికి ఒకరు అవసరం అయినప్పుడు హెల్ప్ చేసుకోండి…..

రాము : అలాగే సార్……
ప్రసాద్ : అలాగే సార్……
కమీషనర్ : ఇక మీరు ఇద్దరూ ఆ పని మీద ఉండండి…..ఇక వెళ్ళొచ్చు…..
దాంతో రాము, ప్రసాద్ ఇద్దరూ కమీషనర్ కి సెల్యూట్ చేసి బయటకు వచ్చారు.
బయటకు వచ్చిన తరువాత రాము తన కేబిన్ వైపు వెళ్తూ, “ప్రసాద్….మీరు నాతో రండి,” అన్నాడు.
ప్రసాద్ : అలాగే సార్…..
అంటూ ప్రసాద్ రాము వెనకాలే అతని కేబిన్ లోకి వెళ్ళాడు.
కేబిన్ లోకి వెళ్ళిన తరువాత రాము తాము చేయబోయే ఆపరేషన్ గురించి అంతా వివరంగా చెప్పాడు.
అంతా విన్న తరువాత ఇద్దరూ కలిసి ఒక ప్లాన్ చేసుకుని దాని ప్రకారం అక్కడకు వెళ్లడానికి రెడీ అయ్యారు.
వాళ్ళిద్దరు ఆ కేసు గురించి సాయంత్రం దాకా డిస్కస్ చేసేసరికి మంచి స్నేహితులు అయిపోయారు.
రాము : ప్రసాద్…..మీకు పెళ్ళయిందా….
ప్రసాద్ : అయింది సార్…..నా భార్య పేరు తులసి…..
రాము : ఓహ్….అయిందా….మరి ఈ కేసు వల్ల మీరు మీ భార్యకు దూరంగా ఉండాల్సి వస్తుంది…..
ప్రసాద్ : మన ఉద్యోగాలు అంతే కదా సార్….ఎప్పుడు ఎక్కడ ఉంటామో తెలియదు….
రాము : సరె….మీది లవ్ మ్యారేజా….అరేంజ్డ్ మ్యారేజా…..
ప్రసాద్ : పరిస్థితుల వలన తులసిని లవ్ చేయాల్సి వచ్చింది సార్…..కాని అది నిజమైన ప్రేమగా మారిపోయింది….
రాము : అవునా….చాలా విచిత్రంగా ఉన్నదే….అయినా ఎక్కడో కొడుతున్నది….కొంచెం వివరంగా చెప్పు…..
దాంతో ప్రసాద్ తన భార్య తులసితో తన పరిచయం గురించి….తన వదిన రాశి, అన్నయ్య విజయ్ ని ప్రాబ్లమ్స్ నుండి ఎలా బయట పడేసింది అంతా చెప్పి తన రిక్రూట్ మెంట్ కూడా SP గారి రికమండేషన్ అని పూర్తిగా వివరంగా చెప్పాడు.
అంతా విన్న రాము, “పోనీలే ప్రసాద్…..చాలా పెద్ద గండం నుండి బయట పడ్డారు….” అంటూ ప్రసాద్ వైపు చూసి నవ్వుతూ, “అంటే మీరు చాలా రసికులన్న మాట,” అన్నాడు.
రాము అలా నవ్వుతూ ప్రసాద్ కూడా వెంటనె నవ్వుతూ, “ఏదో అలా కలిసొచ్చింది సార్…..” అన్నాడు.
ప్రసాద్ ఇప్పుడు రాముతో చాలా ఫ్రీగా ఉండటం మొదలుపెట్టాడు.
రాముకి కూడా కావలసింది అదే….అందుకే అతని పర్సనల్ విషయాలు అడిగి సరదాగా మాట్లాడటంతో ప్రసాద్ ఒక DCP తో మాట్లాడుతున్నట్టు కాకుండా ఒక ఫ్రండ్ తో ఉంటున్నట్టు అతన్ని రెడీ చేసాడు.
ఎందుకంటే వాళ్ళు వెళ్తున్నది డిపార్ట్ మెంట్ పని మీద అయినా అండర్ కవర్ అయ్యే సరికి ఒకరితో ఒకరు ఫ్రీగా మాట్లాడుకునేంత చనువు వాళ్ళిద్దరి మధ్యా ఉండాలి.
ఆ సాయంత్రం రాము, ప్రసాద్ ఇద్దరూ కాఫీ షాప్ లో కూర్చుని ఉన్నారు.
ప్రసాద్ రాము వైపు చూసి…..అడగాలా వద్దా అన్న సంశయంలో ఉన్నాడు.
ప్రసాద్ తనను ఏదో అడగాలని అనుకుంటున్నాడని గమనించిన రాము అతని వైపు చూసి నవ్వుతూ….
రాము : ఏంటి….ప్రసాద్….ఏమైనా చెప్పాలనుకుంటున్నావా…..
ప్రసాద్ : సార్….అదీ….అదీ….ఎలా అడగాలా అని ఆలోచిస్తున్నాను….
రాము : పర్లేదు…..నోటితోనే అడుగు…..
ప్రసాద్ : మీరు మరీ జోకులు బాగా వేస్తారు సార్….(అంటూ నవ్వాడు.)
రాము : మరీ నా జోక్ కి అంతలా బలవంతంగా నవ్వు తెచ్చుకుని నవ్వక్కర్లేదు….నేను వేసిన జోక్ బాగోలేదని నాక్కూడా తెలుసు…..ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావు…..
ప్రసాద్ : ఏం లేదు సార్….causual but personal…..అడగొచ్చా…..
రాము : అడుగు ప్రసాద్…..చెప్పగలిగిందైతే…..తప్పకుండా చెబుతాను….

ప్రసాద్ : సార్…..నా గురించి అంతా చెప్పాను….మీ గురించి ఏం చెప్పలేదు….
రాము : నీ గురించి ఇంకా పూర్తిగా చెప్పలేదు ప్రసాద్…..
ప్రసాద్ : మొత్తం చెప్పాను కదా సార్…..ఇంక చెప్పటానికి ఏమున్నది…..
రాము : నీకు తులసితో పెళ్ళి అయిన తరువాత మీ వదిన రాశి, సంగీత, అజయ్ సంగతులు చెప్పలేదు…..
ప్రసాద్ : ఓహ్…..ఆ సంగతులా….తరువాత తీరిగ్గా చెబుతాను సార్…..మీ గురించి చెప్పండి….
రాము : నా గురించి ఏం తెలుసుకోవాలనుకుంటున్నావు…..
అని అంటుండగా వెయిటర్ వచ్చి కాఫీ తీసుకురాగానే రాము కాఫీ తాగుతూ అడిగాడు.
ప్రసాద్ : అదే సార్….మీక్కూడా ఏమైనా ఎఫైర్స్ ఉన్నాయా…..
రాము : అలాంటిదేం లేదు ప్రసాద్…..నాకు ఏ ఆడవాళ్లతో ఎఫైర్స్ కాదు కదా….పరిచయం కూడా లేదు…..(అంటూ తడుముకోకుండా అబధ్ధం చెప్పాడు.)
కాని ప్రసాద్ కి ఆయన మాటలు నమ్మబుధ్ధి కాలేదు….
ప్రసాద్ : ఊరుకోండి సార్….మీరు చూడటానికి బాగుంటారు….ఏ ఎఫైర్స్ లేవంటే ఎలా సార్…..
రాము : చూడటానికి బాగుంటే….ఎఫైర్స్ ఉండాలా ప్రసాద్….
ప్రసాద్ : అలా అని కాదు సార్….మీరు పైన మాట్లాడే మాటలకు మీ ప్రవర్తనకు అసలు మ్యాచ్ అవడం లేదు సార్….
రాము : ఎందుకలా అనిపించింది….
ప్రసాద్ : మనం ఇక్కడకి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను సార్….మీరు మన పక్క టేబుల్ లో కూర్చున్న ఆవిడ వైపు చూడటం….సైగలు చేయడం….ఆమె కూడా మీ వైపు చూడటం….ఇద్దరూ కళ్లతోనే మాట్లాడుకోవడం అన్నీ గమనిస్తున్నాను….సార్….
ప్రసాద్ ఆ మాట అనే సరికి రాము అతని వైపు మెచ్చుకున్నట్టు చూసాడు.
రాము : నువ్వు మామూలోడివి కాదు ప్రసాద్….గుడ్….నిజంగా పోలీసోడివి అనిపించావు…..
ప్రసాద్ : సరె….ఇప్పటికైనా చెబుతారా….మీ గురించి….
దాంతో రాము ఇక తన గురించి మొదట నుండి మొత్తం రేణుకతో జరిగింది తప్పితే మొత్తం వివరంగా తనకు ఆడవాళ్లతో ఉన్న ఎఫైర్స్ గురించి మొత్తం చెప్పుకొచ్చాడు.
అంతా విన్న తరువాత ప్రసాద్ ఆశ్చర్యంగా రాము వైపు చూసి….
ప్రసాద్ : మీరు కాలాంతకులు సార్…..అమాయకంగా మొహం పెట్టి ఎంత ఈజీగా ఆడవాళ్లతో పరిచయం లేదని అబధ్ధం చెప్పారు…..
రాము : ఏదో ప్రసాద్…..అలా కలిసొచ్చింది….
ప్రసాద్ : మనకు ఈ టెన్షన్స్ అన్నీ మామూలే కదా సార్….మీ స్టోరి చాలా బాగున్నది సార్…..అంజలితో జరిగింది….తరువాత మీ జరీనా మేడమ్ తో ఏం జరిగిందో చెప్పకుండా మధ్యలో ఆపేసారు….అది కూడా పూర్తిగా చెప్పండి సార్…..
రాము : నీ ఆత్రం చూస్తుంటే…..పూర్తిగా చెప్పే దాకా వదిలేలా లేవు….
అంటూ కాఫి సిప్ చేసి కధను చెప్పడం మొదలుపెట్టాడు.

ప్రసాద్ : మీరు కాలాంతకులు సార్…..అమాయకంగా మొహం పెట్టి ఎంత ఈజీగా ఆడవాళ్లతో పరిచయం లేదని అబధ్ధం చెప్పారు…..
రాము : ఏదో ప్రసాద్…..అలా కలిసొచ్చింది….
ప్రసాద్ : మనకు ఈ టెన్షన్స్ అన్నీ మామూలే కదా సార్….మీ స్టోరి చాలా బాగున్నది సార్…..అంజలితో జరిగింది….తరువాత మీ జరీనా మేడమ్ తో ఏం జరిగిందో చెప్పకుండా మధ్యలో ఆపేసారు….అది కూడా పూర్తిగా చెప్పండి సార్…..
రాము : నీ ఆత్రం చూస్తుంటే…..పూర్తిగా చెప్పే దాకా వదిలేలా లేవు….
అంటూ కాఫి సిప్ చేసి కధను చెప్పడం మొదలుపెట్టాడు.
(పార్ట్ – 1 మొదలు…..)
నా పేరు రామ్ ప్రసాద్…మేము గుంటూరు జిల్లాలో ఒక పల్లెటూరు.

మేము ఉండేది పేరుకి పల్లెటూరే….కాని అక్కడ అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి.

4 Comments

Add a Comment
  1. Inka eni parts pedutaru. em baledhu story.please appeyandi.edina new story start cheyandi.

  2. స్టోరీ చాల అద్భుతంగా రాసారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోయాను ముఖ్యంగా రేణుక రామ్ ల మధ్య లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది కానీ రేణుక మళ్ళీ యవ్వనంగా అయితే మాత్రం మీ స్టోరీ చాలా హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం ఇది కేవలం సజెసషన్ గా మాత్రమె తీస్కోండి నచ్చకపోతే క్షమించండి😊

  3. Bayya story qnvasranga laguthunavu.feell mothamu poyendhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *