రాములు ఆటోగ్రాఫ్ – Part 11 35

రాము ట్రైనింగ్ నుండి తిరిగి వచ్చేలోపు శివరామ్ తన తమ్ముళ్లను రాము వాళ్ల నాన్న, బాబాయిల దగ్గరకు పంపించి వాళ్ల వ్యాపారాలు మొత్తం తమ కంపెనీల్లో కలిపేస్తున్నట్టు ఫార్మాలిటీస్ పూర్తి చేసి అక్కడ ఎంప్లాయిస్ ని రిక్రూట్ చేసి అందరినీ ముంబై కి తీసుకువచ్చేసారు.
రాము వాళ్ల అమ్మ, నాన్న, బాబాయ్ లు అందరూ ముంబై వచ్చిన తరువాత రాముకి ఒబరాయ్ ఫ్యామిలీతో ఉన్న సంబంధం విన్నతరువాత అచ్చు గుద్దినట్టు తన కొడుకులా ఉన్న శివరామ్ (ముని మనమడు) ని చూసి వాళ్లకు ఆనందంతో నోట మాట రాలేదు.
అందరూ ఆనందంగా ఉన్నారు కాని రాము వాళ్ల అమ్మా నాన్నల మనసుల్లో మాత్రం రేణుక గురించి బెంగ పట్టుకున్నది.
వాస్తవానికి రేణుక తమ కన్నా పెద్దది…..కాని రాము కాలంలో వెనక్కు వెళ్లి ఆమెని పెళ్ళి చేసుకోవడంతో ఆమె తమకు కోడలు అయింది.
అంత ముసలామెను కోడలుగా అంగీకరించడానికి వాళ్లకు మనసు రావడం లేదు.
దాంతో రాము వాళ్ల నాన్న తన వాళ్లతో, “ఈ విషయం గురించి రాము వచ్చిన తరువాత మాట్లాడదాం….అప్పటి వరకు అందరితో హ్యాపిగా ఉండండి,” అనడంతో అందరు సరె అని తల ఊపారు.
వాళ్ళు అలా మాట్లాడుకుంటుండగా రేణుక వాళ్ల దగ్గరకు వస్తూ మాట్లాడుకుంటున్నది విన్న ఆమె తనలో తాను చిన్నగా నవ్వుకుంటూ రాము వాళ్ల అమ్మ వైపు చూసి, “అత్తయ్యా…..ఇలా బంధాల్లో మీరు పెద్దవారయినా…నేను మీకంటే పెద్దదాన్ని….మీరు రాము గురించి ఏం బాధపడొద్దు…..రాముని నా కొడుకు అదే మీ మనవడు విశ్వ అందరికీ రాము, శివరామ్ ఇద్దరూ కవల పిల్లలని తన తమ్ముడు రఘు కొడుకులని….చిన్నప్పుడు తప్పిపోయాడని పరిచయం చేసాడు….రాము ట్రైనింగ్ నుండి రాగానే మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసేద్దాం…..మన బంధాలు బయట వాళ్లకు చెబితే ఎవరూ నమ్మరు…అందుకని రాముని మీ కొడుకుగానే పరిచయం చేద్దాము…అలాగే పెళ్ళి చేద్దాము…” అన్నది.
రేణుక అలా అనగానే అందరు ఇంకా చాలా సంతోషించారు.

ఇక రాము ట్రైనింగ్ అయిపోయి ముంబై లోనే పోస్టింగ్ వచ్చేలా శివరామ్ చేయడంతో అందరూ చాలా సంతోషంగా ఉన్నారు.
అలా అందరు హ్యాపీగా ఉంటుండగా రాము తన probationary period పూర్తి చేసుకున్నాడు.
తరువాత రాముని డిపార్ట్ మెంట్ లో క్రైం సెక్షన్ లో రిక్రూట్ చేసారు.
వారం రోజుల తరువాత కమీషనర్ అర్జంట్ మీటింగ్ ఏర్పాటు చేసారు.
అందరూ కాన్ఫరెన్స్ హాల్లో కూర్చున్నారు……కమీషనర్ మీటింగ్ స్టార్ట్ చేయాలని లేచి నిల్చుని ఒకసారి అందరి వైపు చూసి…..
కమీషనర్ : Look Gentle Men….మిమ్మల్ని అందరినీ ఇక్కడకు పిలిచిన కారణం ఏంటంటె….ఇక్కడకు దగ్గరలో ఒక పల్లెటూరు ఉన్నది…..
ఆ పల్లెటూరులో ఒక పురాతనమైన గుడి ఉన్నది.
గుడి చాలా పురాతనమైనది.
అయితే అక్కడ ఒక విచిత్రమైన ఆచారం ఉన్నది.
ఇంతకు ఆచారం ఏంటంటే…..ఎవరైనా సరే…..రాత్రి పూట ఆ గుళ్ళో ఉంటే…..ఉంటే….ఉదయానికల్లా చనిపోయి శవం అయిపోతున్నారు.
ఇంతకు ముందు మన ఆఫీసర్లు ఎంక్వైరీ చేసిన దాని ప్రకారం అక్కడ మనుషులు చనిపోయిన దగ్గర నుండి అక్కడ గుడిని సాయంత్రం ఆరు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు గుళ్ళో అందరినీ బయటకు పంపించి గుడి తలుపులకు తాళాలు వేసేస్తారు.
చనిపోయిన మనుషుల గురించి ఎంక్వైరీ చేయడానికి కూడా మన డిపార్ట్ మెంట్ ని ఊర్లో వాళ్ళు ఊర్లోకి కూడా రానివ్వడం లేదు.
అందుకని మన డిపార్ట్ మెంట్ నుండి అండర్ కవర్ ఆపరేషన్ మొదలుపెట్టింది….అందులో భాగంగా మన ఆఫీసర్స్ లో ఒకరిని అండర్ కవర్ గా ఆ ఊరికి పంపించి అక్కడ investigation మొదలుపెట్టాలి…..
కాని ఒక్క విషయం మనం అక్కడ ఏమాత్రం రాంగ్ స్టెప్ వేసినా ప్రాణాలకే ప్రమాదం.
కాబట్టి అక్కడ మనం వేసే ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి.
ఇది మన డిపార్ట్ మెంట్ ఎంతో ప్రెస్టేజియష్ గా తీసుకున్నది.
అందుకని మీలో ఒకరిని అక్కడకు పంపించాలనుకుంటున్నాను…..ఎవరు వెళ్తారు…..
(అంటూ కమీషనర్ అక్కడ కూర్చున్న వాళ్ళందరి వైపు చూసాడు.)
అందరూ ఒక్కసారి ఒకళ్ళ వైపు ఒకరు చూసుకున్నారు.
అంతలో రాము పైకి లేచి నిల్చుని….
రాము : సార్…..అక్కడికి వెళ్లడానికి నేను రెడీగా ఉన్నాను……
కమీషనర్ : రామూ….నువ్వు కొత్తగా రిక్రూట్ అయ్యావు…..కొత్తగా నీ prohibition period అయిపోయింది….ఇంత పెద్ద ఆపరేషన్ కి నిన్ను ఒంటరిగా పంపించడం నాకు ఇష్టం లేదు…..
రాము : సార్….నాకు భయం లేదు సార్….పోనీ నాకు తోడుగా ఎవరినైనా పంపించండి….కాని నన్ను మాత్రం ఈ ఆపరేషన్ లో ఉండటానికి వద్దనొద్దు సార్…..
దాంతో కమీషనర్ ఒక్క నిముషం ఆలోచించినట్టు తల ఊపుతూ అందరి వైపు చూసి….
కమీషనర్ : ఇక మీరందరూ వెళ్ళొచ్చు…..
ఆయన అలా అనగానే అక్కడ నుండి అందరూ వెళ్ళిపోయారు.
కమీషనర్ అక్కడ నుండి తన కేబిన్ వైపు వెళ్తూ రాము వైపు చూసి….
కమీషనర్ : రామూ….నువ్వు నాతో రా…..
రాము అలాగే అంటూ కమీషనర్ వెనకాలే ఆయన కేబిన్ లోకి వెళ్ళారు.
కేబిన్ లోకి వెళ్లగానే కమీషనర్ తన చైర్ లో కూర్చుంటూ తన ఎదురుగా ఉన్న చైర్ చూపించి రాముని కూడా కూర్చోమన్నాడు.
రాము చైర్ లొ కూర్చుని కమీషనర్ ఏం చెప్తాడా అని ఆయన వైపు చూసాడు.
కమీషనర్ తన టేబుల్ మీద ఉన్న ఫోన్ తీసుకుని, “హలో……” అన్నాడు.
“సార్….చెప్పండి….” అని అవతల వైపు.
“మన ధారావి ఏరియా SI వచ్చారా,” అనడిగాడు కమీషనర్.
“ఆయన వచ్చారు సార్,” అన్నారు అవతల వైపు.
“సరె….ఆయన్ను లొపలికి పంపించండి,” అని కమీషనర్ ఫోన్ పెట్టేసాడు.
కమీషనర్ ఫోన్ పెట్టేసి రాము వైపు చూసి, “సరె….రామ్ ప్రసాద్…..మిమ్మల్ని ఈ ఆపరేషన్ మీద అండర్ కవర్ గా పంపించడానికి ఒప్పుకుంటున్నాను…..కాని చాలా జాగ్రత్తగా ఉండాలి,” అన్నాడు.
“అలాగే సార్….మీరు చెప్పినట్టు జాగ్రత్తగా ఉంటాను సార్….ఎప్పటి కప్పుడు మీకు ఈ మిషన్ గురించి updates ఇస్తూ ఉంటాను,” అన్నాడు రాము.
వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగా డోర్ తీసుకుని ధారావి SI లోపలికి వచ్చి కమీషనర్ కి సెల్యూట్ చేసి, “సార్ రమ్మన్నారంట,” అన్నాడు.
కమీషనర్ తల తిప్పి అతని వైపు చూసి, “మిమ్మల్ని SI నుండి CI గా ప్రమోషన్ ఇస్తున్నా,” అన్నాడు.
ప్రమోషన్ మాట వినగానే ఆయన మొహంలో ఆనందం కనిపించింది.
ఎందుకంటె జాయిన్ అయిన కొద్ది కాలంలోనే ప్రమోషన్ వెంట వెంటనే రావడం చాలా అరుదు.
“చాలా థాంక్స్ సార్…..” అన్నాడు CI.
“సరె…..ఇప్పుడు విషయం ఏంటంటే….నిన్ను ఒక ఆపరేషన్ మీద బయట ఊరికి పంపిస్తున్నాము,” అంటూ రాముని చూపించి, “ఈయన కొత్తగా రిక్రూట్ అయిన DCP రామ్ ప్రసాద్….ఈయనకు అసిస్టెంట్ గా నిన్ను పంపిస్తున్నాను,” అంటూ రాముకి CI ని పరిచయం చేస్తూ, “ఈయన ధారావి CI…..ప్రసాద్…..చాలా సిన్సియర్…..నీకు చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటాడు,” అన్నాడు.

4 Comments

Add a Comment
  1. Inka eni parts pedutaru. em baledhu story.please appeyandi.edina new story start cheyandi.

  2. స్టోరీ చాల అద్భుతంగా రాసారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోయాను ముఖ్యంగా రేణుక రామ్ ల మధ్య లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది కానీ రేణుక మళ్ళీ యవ్వనంగా అయితే మాత్రం మీ స్టోరీ చాలా హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం ఇది కేవలం సజెసషన్ గా మాత్రమె తీస్కోండి నచ్చకపోతే క్షమించండి😊

  3. Bayya story qnvasranga laguthunavu.feell mothamu poyendhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *