రాములు ఆటోగ్రాఫ్ – Part 11 35

రాము : నువ్వు చెప్పింది బాగానే ఉన్నది శివ….కాని నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి IPS అవ్వాలన్నది నా కల….

శివరామ్ : అది కాదు అన్నయ్యా…..

అని శివరామ్ ఏదో చెప్పబోతుండగా రాము అతని మాటలను మధ్యలోనే తుంచేస్తూ…..

రాము : అరేయ్ శివా….నా మాట విను….నేను మీతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు….చాలా ఆనందంగా ఉన్నది….నువ్వు చెప్పినట్టు నేను కూడా కంపెనీ వ్యవహారాలు చూసుకుంటాను….(ఆ మాట వినగానే విశ్వ, శివరామ్ ఇద్దరూ ఆనంద పడ్డారు….) కాని నాదో చిన్న షరతు….(అనగానే వాళ్ళిద్దరూ ఏంటి అన్నట్టు రాము వైపు చూసారు) నా కల నేను కూడా ఎంజాయ్ చేయాలి కదా…..అందుకని కొద్దికాలం జాబ్ చేసిన తరువాత మీతో పాటు జాయిన్ అవుతాను…..

శివరామ్ : అది కాదు అన్నయ్యా…..

రాము : ప్లీజ్ రా….ఇంకేం మాట్లాడొద్దు….కొద్దికాలం నేను యూనిఫామ్ వేసుకుని డ్యూటి చేయాలి….ఆ సరదా తీర్చుకోనివ్వండి…..

రాము అంత గట్టిగా అనడంతో విశ్వ కాని, శివరామ్ కాని ఏం మాట్లాడలేకపోయారు.

కాని శివరామ్ ఏదో ఆలోచించిన వాడిలా రాము వైపు చూసి….

శివరామ్ : కాని మీరు కూడా మా మాట ఒకటి వినాలి…..

రాము : ఏంటో చెప్పు…..

శివరామ్ : డ్యూటీలో జాయిన్ అయిన తరువాత కూడా మీరు మాతో పాటే….ఇక్కడే ఉండాలి….

రాము : అది ఎలా కుదురుతుందిరా…..నాకు ఎక్కడ పోస్టింగ్ వస్తుందో నాకే తెలియదు….అలాంటప్పుడు నేను ఇక్కడ ఎలా ఉంటాను….

శివరామ్ : అదంతా నేను చూసుకుంటాను అన్నయ్యా….మీరు ట్రైనింగ్ అయిపోయిన తరువాత మీకు ఇక్కడే పోస్టంగ్ వచ్చేలా అంతా నేను చూసుకుంటాను…..

రాము : అరేయ్….ఇది IPS రా…..ఎలా మ్యానేజ్ చేస్తావు…..

శివరామ్ : నాకు చాలా మంది మంత్రులు తెలుసు అన్నయ్యా…నేను పార్టీ ఫండ్స్ కూడా చాలా ఇస్తుంటాను….అయినా ఆ విషయం నాకు వదిలేయండి….

దాంతో రాము కూడా ఇక చేసేది లేక సరె అని తల ఊపాడు.

శివరామ్ : ఇంతకు ట్రైనింగ్ ఎక్కడ….
రాము : డెహ్రాడూన్……

శివరామ్ : ఎప్పుడు బయలుదేరాలి…..

రాము : దాదాపు నెల రోజులు పట్టొచ్చు…..మళ్ళీ మెయిల్ వస్తుంది….
శివరామ్ : సరె…..ఈ నెల రోజులు మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయండి…..
అంటూ తన wallet లోనుండి ఒక కార్డ్ తీసి రాముకి ఇచ్చాడు.
రాము ఆ కార్డ్ తీసుకుని ఎందుకు అన్నట్టు చూసాడు.
శివరామ్ : ఇది International Credit Card…..మీరు ఎక్కడకు కావాలంటె అక్కడికి….మీకు నచ్చినట్టు ఎంజాయ్ చేయండి…..
రాము : ఎన్నో ఏళ్ళ తరువాత మిమ్మల్ని అందరినీ కలిసారా….మీ అందరితో ఉన్నంత ఎంజాయ్ మెంట్ నాకు బయట ఒక్కడినే ఉన్నా కూడా నాకు దొరకదు….ట్రైనింగ్ డేట్ వచ్చేదాకా మీ అందరితో ఉంటాను….
అంటూ తన చేతిలో ఉన్న కార్డ్ శివరామ్ కి ఇవ్వబోయాడు.
కాని శివరామ్ ఆ కార్డ్ తీసుకోకుండా….
శివరామ్ : సరె….ఇక్కడే మాతోనే ఉండండి….కార్డ్ కూడా మీ దగ్గరే ఉంచుకోండి….అవసరం అయినప్పుడు వాడుకోండి…..
వాళ్ళు ముగ్గురూ అలా మాట్లాడుసుకుంటుండగా కరుణ వచ్చి అందరిని భోజనాలకు రమ్మని పిలిచింది.
దాంతో అందరూ కలిసి డైనింగ్ హాల్లోకి వెళ్ళి భోజనం చేసారు.
అలా రాము కళ్ళు మూసి తెరిచేలోగా ఇరవై రోజులు అలా గడిచిపోయాయి…..తరువాత వారం రోజుల్లో డెహ్రాడూన్ లో ట్రైనింగ్ అటెండ్ అవమని మెయిల్ రావడంతో రాము ఇక అంతా సర్దుకుని బయలుదేరడానికి సిధ్ధమయ్యాడు.
కాని ఇంట్లో వాళ్ళు రాముని ఆపుతూ….
రఘు : అదేంటి నాన్నా….ట్రైనింగ్ ఇంకా వారం రోజులు ఉన్నది కదా….ఇప్పుడు ఎక్కడికి….
రాము : ఏంటిరా…నేను కూడా మా నాన్నను చూసి చాలా రోజులు అవుతుంది…..ఒకసారి వాళ్లను కూడా కలిసి వారం రోజులు వాళ్లతో కూడా గడిపిన తరువాత ట్రైనింగ్ కి వెళ్తాను…..తరువాత ఎలాగూ పోస్టింగ్ ఇక్కడే వేయిస్తానని శివరామ్ చెప్పాడు కదా…..
శివరామ్ : అది కరెక్టే అన్నయ్యా…..అసలు మీ నాన్నగారిని….అందరిని ఇక్కడకు తీసుకువస్తానంటె ఎందుకు వద్దన్నారు…..చక్కగా ఇక్కడె అందరం కలిసి ఉండే వాళ్ళం కదా…..
రాము : ఇప్పుడు అందరూ ఇక్కడకు ఎందుకు లేరా….అయినా అక్కడ వాళ్లకు వ్యాపారాలు ఉన్నాయి కదా…అవన్నీ వదిలేసి ఎలా వస్తారు…..
శివరామ్ : ఇందుకా మీరు వద్దన్నది….
రాము : అవును…..
శివరామ్ : భలేవారే అన్నయ్యా…..వాళ్ళ వ్యాపారాలు అన్నీ మనం టేకోవర్ చెయ్యొచ్చు కదా….అవన్ని మన కంపెనీలో కలిపేద్దాం….అప్పుడు అందరం ఇక్కడే ఉండొచ్చు కదా….
రాము : నువ్వు చెప్పింది కరెక్టేరా శివా….నాకు ఆలోచన రాలేదు….
శివరామ్ : అయినా ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏం లేదు…..మీరు ఇప్పుడు వెళ్ళిన తరువాత తాతయ్యకు, నాయనమ్మకు….అదే మీ అమ్మ, నాన్నలకు విషయం చెప్పి…..మీరు ప్రశాంతంగా ట్రైనింగ్ కి వెళ్ళండి….నేను అంతా చూసుకుంటాను….మీరు ట్రైనింగ్ నుండి వచ్చేసరికి అందరు ఇక్కడ ఉంటారు….సరేనా…..
రాము : నువ్వు ఇంతలా చెప్పిన తరువాత నేను ఎందుకు కాదంటాను….నీ ఇష్టం వచ్చినట్టు కానివ్వు…..
అంటూ అక్కడనుండి రాము అందరికీ బై చెప్పి తన ఊరికి వచ్చాడు.
అక్కడ తన నాన్నకు రేణుక వాళ్ల గురించి పూర్తిగా చెప్పకుండా వ్యాపారాలను వాళ్ళ కంపెనీల్లో కలిపేందుకు ఒప్పించాడు.
ఆ తరువాత రాము ట్రైనింగ్ కి డెహ్రాడూన్ వెళ్ళిపోయాడు……ట్రైనింగ్ పది నెలలు అయిపోయిన తరువాత శివరామ్ తన పలుకుబడిని ఉపయోగించి రాముకి ముంబాయ్ లోనే డైరెక్ట్ గా DCP గా పోస్టింగ్ వచ్చేలా చేసాడు.
కాకపోతే రాము ఒక ఏడాది పాటు probationary period ఉంటుంది.

4 Comments

Add a Comment
  1. Inka eni parts pedutaru. em baledhu story.please appeyandi.edina new story start cheyandi.

  2. స్టోరీ చాల అద్భుతంగా రాసారు నేను మీకు పెద్ద ఫ్యాన్ ఐపోయాను ముఖ్యంగా రేణుక రామ్ ల మధ్య లవ్ స్టోరీ మాత్రం అదిరిపోయింది కానీ రేణుక మళ్ళీ యవ్వనంగా అయితే మాత్రం మీ స్టోరీ చాలా హిట్ అవుతుందని నా గట్టి నమ్మకం ఇది కేవలం సజెసషన్ గా మాత్రమె తీస్కోండి నచ్చకపోతే క్షమించండి😊

  3. Bayya story qnvasranga laguthunavu.feell mothamu poyendhi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *