రాములు ఆటోగ్రాఫ్ – 47 44

ఆ వీడియో చూసిన వెంటనే మేజర్ నాగేష్(వెంకట్) మీద బ్రిగేడియర్ అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసేసాడు.
ఇక ఆ వారెంట్ తీసుకుని రాము తన డిపార్ట్‍మెంట్‍తో, ఆర్మీ వాళ్ళు కొంత మంది కలిసి మేజర్ నాగేష్(వెంకట్)ని అరెస్ట్ చేయడానికి వచ్చారు…వాళ్లతో పాటు కల్నల్ కూడా ఉన్నాడు.
అప్పటికి జరిగిన విషయం తెలియని మేజర్ నాగేష్ (వెంకట్) టీ తాగుతూ కూర్చున్నాడు.
కమీషనర్ : మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మేజర్….
మేజర్ నాగేష్ (వెంకట్) : ఎందుకు….అయినా మా డిపార్ట్‍మెంట్ కూడా వచ్చిందేంటి….
రాము : రాత్రి నువ్వు నీ పవర్‍ని ఉపయోగించి ఒక పోలీసాఫీసర్‍ని చంపడానికి ప్రయత్నించావు కదా….ఆ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నా….(అంటూ వీడియో చూపించాడు.)
మేజర్ నాగేష్(వెంకట్) : అది నువ్వు సృష్టించింది రామూ….నా మీద కోపంతో ఇదంతా చేస్తున్నావు…..
రాము : నాకు మీ మీద కోపం ఎందుకు ఉంటుంది మేజర్….మీకు నాకు అసలు పరిచయం కూడా లేదు….(అంటూ చీకట్లో బాణం వేసాడు.)
మేజర్ నాగేష్(వెంకట్) : (అప్పటికే కోపంతో ఏం చేస్తున్నాడో….మాట్లాడుతున్నాడో అర్ధం కాని పరిస్థితిలో) ఎందుకంటే… నేను నీకు బాగా తెలుసు….
రాము : అదే….నేను చెప్పేది…నాకు ఇంతకు ముందు కూడా నీతో పరిచయం లేదు….
మేజర్ నాగేష్ (వెంకట్) : ఎందుకంటే….నేను వెంకట్ అని నువ్వు తెలుసుకున్నావు….అందుకు…(అంటూ కోపంలో నోరు జారాడు.)
అయితే అక్కడ జరుగుతున్నదంతా వీడియో తీస్తుండటంతో మేజర్ నాగేష్(వెంకట్) తన నోటితో నిజాన్ని ఒప్పుకోవడంతో వాళ్లకి సాక్ష్యం ఇంకా బలంగా దొరికింది.
మేజర్ నాగేష్ (వెంకట్) : అయినా ఇదంతా వీడియోలో ఉన్నది నేను కాదు….వీడియో మార్ఫింగ్ చేసి ఎవరో మొహానికి నా ఫేస్ పెట్టారు…..
రాము : ఇక ఎక్కువ ఆర్గ్యూ చేయడం వలన ఉపయోగం లేదు మేజర్….సారీ వెంకట్…నువ్వు ప్రసాద్ మీద మర్డర్ ఎటాక్ చేసింది మొత్తం లైవ్‍లో అందరు చూసారు….
కల్నల్ : మేజర్ నాగేష్…నీ గేమ్ పూర్తి అయిపోయింది….నీ అంతట నువ్వు సరెండర్ అయ్యి కోర్ట్ మార్షల్‍కి రెడి అవ్వు…
కమీషనర్ : డాక్టర్ వెంకట్ నుండి…ల్యాబ్‍లో క్యూబాక్స్, ప్రసాద్ మీద మర్డర్ ఎటాక్ మొతం కల్నల్‍కి సాక్ష్యాలతో సహా సబ్‍మిట్ చేసాము….
కాని మేజర్ నాగేష్(వెంకట్) తన రివాల్వర్ తీసుకుని కమీషనర్ నుదిటి మీద పెట్టాడు.
దాంతో అక్కడ ఉన్న వాళ్ళు రాముతో సహా అందరూ తమ గన్స్ తీసి మేజర్ నాగేష్(వెంకట్) వైపు aim చేసారు.
మేజర్ నాగేష్(వెంకట్) : నో….నో….మీలో ఎవరు ముందుకు అడుగు వేసినా నేను కమీషనర్‍ని చంపేస్తాను….(అంటూ కమీషనర్‍ని తన రూమ్ లోకి తీసుకెళ్ళి అక్కడ డెస్క్‍లో ఉన్న క్యూబాక్స్ తీసుకుని బయటకు వచ్చి) నేను వెళ్ళే వరకు ఎవరైనా అతితెలివి ప్రదర్శించారో మీ కమీషనర్‍ని చంపేస్తాను….
అలా వెళ్తుండగా ఒక సోల్జర్ తన చేతిలో ఉన్న గన్‍తో మేజర్ నాగేష్(వెంకట్) మీద ఎటాక్ చేయడానికి ట్రై చేసాడు.
కాని మేజర్ వెంటనే రియాక్ట్ అయ్యి ఆ సోల్జర్ కాలి మీద కాల్చేసాడు.
కల్నల్ : మేజర్….ఇప్పటికే తప్పు చేసావు….మళ్ళీ తప్పు చేయొద్దు…సరెండర్ అయిపో…..
మేజర్ నాగేష్ (వెంకట్) : ప్లీజ్ సార్…నాకంటూ ఒక మర్యాద ఉన్నది….చీప్‍గా బిహేవ్ చెయ్యొద్దు అని చెప్పండి….
అంటూ కమీషనర్‍ని అడ్డం పెట్టుకుని ఇంటి నుండి బయటకు వచ్చాడు.
కమీషనర్‍ని కార్లో కూర్చోబెట్టి మేజర్ కూడా పక్కనే కూర్చుని గన్‍ని అతని తల మీద పెట్టి, “ముందు ఇక్కడ నుండి పోనివ్వు,” అన్నాడు.

దాంతో కమీషనర్ కారు స్టార్ట్ చేసి పోనిస్తున్నాడు.

మిగతా ఆర్మీ వాళ్ళు, పోలీసులు తమ కార్లలో మేజర్‍ని ఫాలో అవుతున్నారు.
రాము తన దగ్గర ఉన్న వాకీటాకీలో ట్రాఫిక్ పోలీసులతో మాట్లాడుతూ ట్రాఫిక్ క్లియర్ అయ్యేలా చూస్తున్నాడు.
అలా వాళ్ళు సిటీ అవుట్‍స్కర్ట్‍లో వచ్చారు.
కమీషనర్ : వెంకట్….ఇలా ఒక మేజర్ శరీరంలో ఉండి ఇలా చేయడం పధ్ధతి కాదు….
మేజర్ నాగేష్(వెంకట్) : తప్పేం లేదు కమీషనర్….మనుషులు ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు….కాని అది ఎవరి వల్లా కాదు….కాని నేను ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యాను…నాకు చావు లేదు…నేను ఎన్నేళ్ళు బ్రతకాలనుకుంటే అన్నేళ్ళు బ్రతుకుతాను….
అలా వెళ్తున్న వాళ్లకు కారులో డీజిల్ అయిపోతున్నట్టు ఇండికేషన్ చూపిస్తున్నది.
కమీషనర్ : డీజిల్ అయిపోతున్నది….
మేజర్ నాగేష్ : అలాగే….
దాంతో కమీషనర్ కారుని అక్కడ హైవే మీద ఉన్న పెట్రోల్ బంక్‍లోకి పోనిచ్చి ఆపాడు.
రాముతో పాటు అందరూ కూడా తమ కార్లను పెట్రోల్ బంక్ ముందు ఆపి గన్స్ పట్టుకుని పొజిషన్స్‍లో నిల్చున్నారు.
తనతో పాటు వచ్చిన వాళ్లను అక్కడే నిలబడమని సైగ చేసి రాము గన్ పట్టుకుని మెల్లగా పెట్రోల్ బంక్‍లోకి వెళ్లాడు.
లోపలకు వెళ్ళిన రాముకి కారులో కమీషనర్‍ని షూట్ చేసి మేజర్ తప్పించుకుని పోయాడని అర్ధమయింది.
రాము వెంటనే అంబులెన్స్‍కి ఫోన్ చేసి కమీషనర్‍ని హాస్పిటల్‍కి పంపించాడు.
కాని మేజర్ ఎక్కడకు వెళ్లాడో అర్ధంకాక ఆలోచిస్తున్న రాముకి కారు వెనకాల డీజిల్ పైప్ పెట్టి ఉండటంతో ట్యాంక్ నిండిపోయి డీజిల్ బయటకు కారి పోవడం చూసాడు.
అలా డీజిల్ కారిపోతూ అక్కడ కొంచెం దూరంలో ఉన్న లైటర్ దగ్గరకు వెళ్ళడం చూసిన రాము వెంటనే రియాక్ట్ అయ్యి పెట్రోల్ బంక్ నుండి బయటకు పరిగెత్తుకుంటూ వచ్చాడు.
కాని అప్పటికే డీజిల్ లైటర్ దగ్గరకు రావడంతో పెట్రోల్ బంక్ పేలిపోవడంతో రాము ఎగిరిబయట ఉన్న తన కారుకి గుద్దుకుని కింద పడిపోయాడు.
దాంతో కొద్దిసేపటి వరకు రాముకి సృహ రాలేదు….అప్పటికే అంబులెన్స్‍లు వచ్చి అక్కడ గాయపడిన వాళ్ళందరినీ హాస్పిటల్‍లో చేర్చారు.
హాస్పిటల్‍లో చేర్చిన కొద్దిసేపటికి రాము సృహలోకి వచ్చాడు.
రాము వెంటనే తన టీంని పిలిచి మొత్తం జరిగింది తెలుసుకుని, “ఇప్పుడు మేజర్ నాగేష్(వెంకట్) ఎవరి కోసం వెళ్ళుంటాడు….” అని ఆలోచిస్తున్నాడు.
అలా ఆలొచిస్తున్న రాముకి ఇంతకు ముందు మనోజ్ చెప్పిన మాటలు, “వెంకట్….తన కోసం స్పెషల్‍గా ఒక ల్యాబ్ తయారు చేయించుకున్నాడు….” అన్న మాటలు గుర్తుకు రావడంతో అక్కడ ఉన్న SIతో, “తప్పకుండా సైంటిస్ట్ మనోజ్ కోసం వెళ్ళుంటాడు….ఆయన ఒక్కడే మనకు ఈ పరిశోధన విషయంలొ హెల్ప్ చేస్తున్నది…ఆయన ప్రాణానికి ప్రమాదం ఉన్నది….తొందరగా వెళ్దాం పదండి,” అంటూ అక్కడ నుండి బయటకు వచ్చి కారులో మనోజ్ ఇంటికి బయలుదేరాడు.
ఇక్కడ మనోజ్ తన ఇంట్లో ఫ్యామిలీతో కూర్చుని న్యూస్ అప్‍డేట్‍లో మేజర్ నాగేష్(వెంకట్)కి పోలీసులకు జరిగిన చేజింగ్, పెట్రోల్ బంక్‍లో జరిగిన బ్లాస్టింగ్ చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *