రాములు ఆటోగ్రాఫ్ – 47 42

కాని ప్రసాద్ అతని మాటలను పట్టించుకోకుండా వెళ్తుండే సరికి ప్రసాద్ చేతిలో డిజిటల్ బాక్స్ ఉండటం హ్యాకర్ చూసాడు.
బయటకు వచ్చిన ప్రసాద్‍కి అక్కడకు కొద్దిదూరంలో రాము వేరే వాళ్లతో మాట్లాడుతుండటం గమనించాడు.
ప్రసాద్ అలాగే తన కారు దగ్గరకు వచ్చి స్టార్ట్ చేసి పోనిచ్చాడు.
హ్యాకర్ : సార్….దీని పాస్‍వర్డ్ కనుక్కోవాలంటే….ఈ ఎక్విప్‍మెంట్ ఇచ్చిన కంపెనీని కాంటాక్ట్ చేస్తే మంచిది….
రాము : మనకు అంత టైం లేదు….పోనీ విరక్కొడదామా……
హ్యాకర్ : దీన్ని విరక్కొట్టడానికి ట్రై చేస్తే…బ్లాస్ట్ కూడా అయ్యే చాన్స్ ఉంటుందేమో సార్…..
రాము : ఇది సినిమా కాదు….బ్రేక్ చేయగానే పేలిపోవడానికి….(అంటూ నవ్వాడు.)
హ్యాకర్ : కాని ఈ ల్యాబ్ చూస్తుంటే….సినిమా కన్నా భయంకరంగా ఉన్నది సార్….
ఆ మాట వినగానే రాము మళ్ళి ఆలోచనలో పడిపోయాడు.
“మరి ఏం చేద్దాం….ముందు లోపలికి వెళ్దాం,” అంటూ రాము వాళ్లను తీసుకుని లోపలికి వెళ్లాడు.
ఆ మిషన్ దగ్గరకు రాగానే రాముకి అందులో ఉన్న క్యూబాక్స్ మిస్ అయిందని అర్ధమయింది.

రాము : మనకు అంత టైం లేదు….పోనీ విరక్కొడదామా……

హ్యాకర్ : దీన్ని విరక్కొట్టడానికి ట్రై చేస్తే…బ్లాస్ట్ కూడా అయ్యే చాన్స్ ఉంటుందేమో సార్…..
రాము : ఇది సినిమా కాదు….బ్రేక్ చేయగానే పేలిపోవడానికి….(అంటూ నవ్వాడు.)
హ్యాకర్ : కాని ఈ ల్యాబ్ చూస్తుంటే….సినిమా కన్నా భయంకరంగా ఉన్నది సార్….
ఆ మాట వినగానే రాము మళ్ళి ఆలోచనలో పడిపోయాడు.
“మరి ఏం చేద్దాం….ముందు లోపలికి వెళ్దాం,” అంటూ రాము వాళ్లను తీసుకుని లోపలికి వెళ్లాడు.
ఆ మిషన్ దగ్గరకు రాగానే రాముకి అందులో ఉన్న క్యూబాక్స్ మిస్ అయిందని అర్ధమయింది.

రాము వెంటనే అక్కడ ఉన్న హ్యాకర్ అజయ్‍ని పిలిచి, “అజయ్….అజయ్….ఇక్కడ ఉన్న క్యూబాక్స్ ఎక్కడ….” అనడిగాడు.

అజయ్ అక్కడకు వచ్చి మిషన్ వైపు చూస్తూ, “తెలియదు సార్….” అంటూ ఏదో ఆలోచించి, “సార్ ఇందాక ప్రసాద్ గారు వచ్చారు…ఆయన చేతిలో ఏదో బాక్స్ ఉండటం చూసాను,” అన్నాడు.
ఆ మాట వినగానే రాముకి మొత్తం అర్ధమయిపోయి అక్కడ నుండి బయటకు వచ్చాడు.
ఇక ప్రసాద్ విషయానికి వస్తే డిజిటల్ బాక్స్ తీసుకుని తన ఇంటి వైపు కారుని వేగంగా పోనిస్తున్నాడు.
మధ్యలో ఏదో ఆలోచన వచ్చిన వాడిలా జీప్‍ని ఆపి డాష్‍బోర్డ్‍లో ఉన్న మైక్రో కెమేరాని తన షర్ట్‍కి తగిలించుకుని….ఫోన్ తీసుకుని రాముకి కాల్ చేసాడు.
అప్పుడే ల్యాబ్ నుండి బయటకు వచ్చిన రాము ఫోన్ మోగడంతో ప్రసాద్ పేరు కనిపించే సరికి లిఫ్ట్ చేసి, “ప్రసాద్… ఎక్కడున్నావు….క్యూ బాక్స్ ఎందుకు తీసుకెళ్ళావు,” అన్నాడు.
దాంతో ప్రసాద్, “సార్….మేజర్ నాగేష్ (వెంకట్) నా ప్యామిలీని మొత్తం ఇంట్లో బంధించాడు…ఇది ఇవ్వకపోతే వాళ్లను చంపేస్తాను అంటున్నాడు….ఇప్పుడు నేను నా షర్ట్‍కి సీక్రెట్ కెమేరా పెట్టుకున్నాను….దాన్ని మీ ఫోన్‍కి కనెక్ట్ చేస్తాను….మనం లీగల్‍గా మేజర్‍ని ఏమీ చేయలేము….అందుకని జరుగుతున్న లైవ్ మొత్తం మన డిపార్ట్‍మెంట్‍లో అందరికీ చూపించండి…అప్పుడు మనకు సాక్ష్యం లభిస్తుంది….కాని ఎట్టి పరిస్థితుల్లోనూ క్యాబాక్స్ మాత్రం వాడికి దొరకనివ్వను,” అన్నాడు.
“అది సరె….ప్రసాద్….నువ్వు ఇంటికి వెళ్ళి ముందు వాళ్ళను విడిపించు….నీ వెనకాలే నేను కూడా వస్తున్నాను….అ క్యూబాక్స్ వాడి చేతికి వెళ్ళినా పర్లేదు…ఇప్పుడు నువ్వు ఇస్తున్న లైవ్ మాత్రం కట్ అవకుండా….క్లియర్‍గా ఉండేట్టు చూడు…” అంటూ రాము తన కారులో కూర్చుని ప్రసాద్ ఇంటి వైపు పోనిచ్చాడు.
ప్రసాద్ కూడా సరె అని కెమేరాని ఫోన్‍కి కనెక్ట్ చేసాడు.
దాంతో రాము ఫోన్‍కి ఏం జరుగుతున్నది మొత్తం కనిపిస్తున్నది.
ఆ వీడియోని రాము వెంటనే కమీషనర్‍కి, మిగతా తన టీమ్‍కి, అలాగే సోషల్ మీడియాలో లైవ్ వచ్చేట్టు కనెక్ట్ చేసాడు.
ప్రసాద్ తన ఇంటి ముందు జీప్ ఆపి క్యూ బాక్స్ తీసుకుని తలుపు తీసుకుని లొపలికి వచ్చాడు.
లొపల హాల్లో ఒక మూల నేల మీద రాశి, విజయ్, తులసి భయపడుతూ కూర్చున్నారు.
వాళ్ల ఎదురుగా మేజర్ నాగేష్(వెంకట్) గన్ పట్టుకుని వాళ్ళ వైపు చూపిస్తూ బెదిరిస్తున్నాడు.
డోర్ తీసుకుని లోపలికి వచ్చిన ప్రసాద్ వైపు చూసి మేజర్ నాగేష్ (వెంకట్) సోఫాలోనుండి లేచి క్యూ బాక్స్ ఇవ్వమన్నట్టు చెయ్యి చాపాడు.
ప్రసాద్ మెల్లగా క్యూబాక్స్ మేజర్ నాగేష్ (వెంకట్) చేతిలొ పెట్టాడు.
ఇదంతా లైవ్‍లో రాము, కమీషనర్, పోలీస్ డిపార్ట్‍మెంట్, సోషల్ మీడియా మొత్తం చూస్తున్నది.
క్యూ బాక్స్ తీసుకున్న తరువాత మేజర్ నాగేష్(వెంకట్) ఏమీ మాట్లాడకుండా గన్‍తో ప్రసాద్‍ని కాల్చేసాడు.
తరువాత తులసి వాళ్ల వైపు చూస్తూ, “ఈ విషయం ఎవరికైనా చెప్పారంటే మీ ప్రాణాలు కూడా పోతాయ్,” అంటూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
అతను వెళ్ళిపోగానే తులసి పరిగెత్తుకుంటూ ప్రసాద్ దగ్గరకు వచ్చి అతన్ని కుదుపుతూ ఏడుస్తున్నది.
రాశి, విజయ్ కూడా ప్రసాద్ కదలకుండా ఉండటం చూసి ఏడుస్తూ ఉన్నారు.
అప్పుడే రాము, మానస ఇంట్లోకి వచ్చి ప్రసాద్ బుల్లెట్ దెబ్బ తగిలి నేల మీద కదలకుండా పడి ఉండటం చూసి దగ్గరకు వచ్చి, “ప్రసాద్….ప్రసాద్,” అని కదిలిస్తున్నాడు.
మానస వెంటనే ప్రసాద్ చేయి పట్టుకుని పల్స్ చూసింది.
పల్స్ ఇంకా కొట్టుకుంటూ ఉండటంతో రాము వైపు చూసి, “రాము….వెంటనే ప్రసాద్‍ని హాస్పిటల్‍కి తీసుకెళ్దాం….బ్రతికే ఉన్నాడు,” అన్నది మానస.
దాంతో రాము వెంటనే తన చేతులతో ప్రసాద్‍ని పైకి ఎత్తుకుని బయటకు తీసుకువచ్చి కారులో కూర్చోబెట్టుకుని హాస్పిటల్‍కి తీసుకెళ్లారు.
అక్కడ వెంటనే డాక్టర్లు ప్రసాద్‍కి ఆపరేషన్ చేసి అతని ఒంట్లో ఉన్న బుల్లెట్ తీసేసారు.
బయటకు వచ్చిన డాక్టర్, “ప్రసాద్‍కి ఇక ప్రమాదం లేదు….రెండు గంటల్లో సృహ వచ్చేసుద్ది….వెళ్ళి చూడొచ్చు,” అన్నాడు.
ఆ మాట వినగానే రాము, తులసి అందరూ ఒక్కసారిగా గాలి పీల్చుకుని డాక్టర్‍కి థాంక్స్ చెప్పి ప్రసాద్‍ని చూడటానికి వెళ్లారు.
ప్రసాద్‍కి ప్రాణాపాయం లేదనగానే రాము సంతోషంతో కమీషనర్‍కి కాల్ చేసి, “సార్…లైవ్ చూసారు కదా…” అన్నాడు.
కమీషనర్ : రామూ….ఈ సాక్ష్యం చాలు….ఆ మేజర్‍ని అరెస్ట్ చేయడానికి….
రాము : ఇప్పుడే వస్తున్నాను సార్….
అంటూ ఫోన్ కట్ చేసి కమీషనర్ ఆఫీస్‍కి వెళ్లాడు.
అక్కడ వాళ్ళిద్దరూ కూర్చుని ఫోన్‍లో ప్రసాద్ ఫ్యామిలీని బెదిరిస్తున్న వీడియోని, ప్రసాద్‍ని షూట్ చేసిన వీడియోని ఆర్మీ హెడ్‍క్వార్టర్స్‍కి పంపించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *