రాములు ఆటోగ్రాఫ్ – 47 44

ప్రసాద్ : అదేం లేదు సార్….మేజర్ దాకా ఎందుకు….వెంకట్ సార్‍నే బ్రతిమలాడితే పెట్టేస్తారు….ప్లీజ్ సార్…ప్లీజ్….
రాము : ఉపయోగం లేదు ప్రసాద్….వెంకట్ సార్ చాలా కోపంగా ఉన్నారు….(అంటూ అతని భుజం మీద చెయ్యి వేసి) సరె వెంకట్(సతీష్) బయలుదేరుతాం….(అంటూ అక్కడ నుండి వెళ్ళడానికి డోర్ దగ్గరకు వెళ్ళారు.)
కాని ఊహించని విధంగా సతీష్(వెంకట్) పైకి లేచి రాముని వెనక నుండి గట్టిగా కాలితో కొట్టాడు.
దాంతో రాము అప్పుడే ఇంటరాగేషన్ రూమ్ డోర్ తీయడంతో బయటకు వచ్చి కింద పడిపోయాడు.
సతీష్(వెంకట్) వెంటనే తన చేతికి ఉన్న హ్యాండ్ కఫ్స్‍ని ప్రసాద్ మెడకు చుట్టి గట్టిగా బిగించి పట్టుకుని కాలితో ఇంటరాగేషన్ రూమ్ డోర్ తన్నాడు.
డోర్ లాక్ అయిపోవడంతో సతీష్(వెంకట్) తన హ్యాండ్ కఫ్స్‍ని ప్రసాద్ మెడకు బిగించేస్తున్నాడు.
ప్రసాద్‍ని గోడకు ఆనించి పెట్టి అతని మెడకు ఇంకా గట్టిగా హ్యాండ్ కఫ్స్‍ని బింగించి చంపడానికి సతీష్(వెంకట్) ట్రై చేస్తున్నాడు.
సతీష్ అలా రియాక్ట్ అవుతాడని రాము అసలు ఊహించి ఉండకపోవడంతో రాము వెంటనే పైకి లేచి డోర్ మీద కొడుతూ దాన్ని తెరవడానికి ట్రై చేస్తున్నాడు.
ప్రసాద్‍కి గొంతు చుట్టూ హ్యాండ్ కఫ్స్ బిగుసుకుపోవడంతో ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిపోతుండటంతో అతని పట్టు నుండి విడిపించుకోవడానికి ట్రై చేస్తున్నాడు.
కాని సతీష్ గట్టిగా పట్టుకోవడంతో ప్రసాద్ ఇక వేరే దారి లేక తన నడుముకి ఉన్న పౌచ్‍లో నుండి రివాల్వర్ తీసి సతీష్ ని కాల్చేసాడు.
దాంతో సతీష్ వెనక్కు పడిపోయాడు….అతనితో పాటు ప్రసాద్ కూడా వెనక్కు పడిపోయాడు.
మెడ చుట్టూ ఉన్న పట్టు విడిపోవడంతో ప్రసాద్ చిన్నగా దగ్గుతూ పైకి లేచి డోర్ లాక్ తీసాడు.
రాము వెంటనే లోపలికి వచ్చి ప్రసాద్‍ని పట్టుకుని కంగారుగా, “ప్రసాద్….నీకు ఏం కాలేదు కదా,” అన్నాడు.
“అంతా బాగానే ఉన్నది,” అన్నట్టు ప్రసాద్ తల ఊపుతూ సైగ చేసాడు.
కింద పడిన సతీష్ నవ్వుతూ రాము, ప్రసాద్‍ల వైపు చూసి నవ్వుతూ తన చేతికి ఉన్న వాచీలో బటన్ ప్రెస్ చేసి చనిపోయాడు.
దాంతో అది యాక్టివేట్ అయినట్టు గ్రీన్ లైట్ వెలిగింది.
అది చూసి రాము తన మనసులో, “ఆర్మీ మేజర్ నాగేష్ లో యాక్టివేట్ అయ్యాడు,” అనుకుంటూ ఏం చెయ్యాలో తోచక అలాగే చూస్తుండిపోయాడు.
తరువాత రోజు రాము, ప్రసాద్ airport కి వెళ్లారు.
ప్రసాద్ : సార్….మేజర్‍కి ఈ విషయం చెబితే నమ్ముతారా సార్….
రాము : అదే నాకూ అర్ధం కావడం లేదు ప్రసాద్…తరువాత వెంకట్ యాక్టివేట్ అయ్యేది మేజర్ నాగేష్ బాడీలో అన్నది మనకు కన్ఫర్మ్ అయినా ఆయనకు చెప్పలేని పరిస్థితి…అందుకని ముందుగా మనం ఆయన్ని ఇంట్రడ్యూస్ చేసుకుందాం….అప్పుడు ఆయన ప్రవర్తనని బట్టి మనం ఒక నిర్ణయానికి రావడానికి వీలుంటుంది…..
ప్రసాద్ : అంతకు మించి వేరే దారి లేదా సార్….

రాము : నీకు తెలిస్తే…చెప్పు ప్రసాద్…అతను మేజర్…మన ఇష్టం వచ్చినట్టు ఆయన్ను ఎంక్వైరీ చేయలేము… (అంటూ అక్కడ కస్టమ్స్ ఆఫీసర్స్‍కి తన దగ్గర ఉన్న ఆర్డర్ చూపించి లోపలికి వెళ్ళారు.)

అప్పుడే మేజర్ నాగేష్ ఫ్లైట్ దిగి airport లోపలికి వస్తున్నాడు.
బాడీగార్డుల మధ్యలో ఉన్న ఆయన్ని కలవడానికి రాము దగ్గరకు వెళ్లాడు.
కాని అతని బాడీగార్డ్స్ రాముని పక్కకు నెట్టడంతో మేజర్‍ని కలవలేకపోయాడు.
దాంతో రాము అక్కడే నిలబడి airport నుండి బయటకు వెళ్ళిపోతున్న మేజర్ నాగేష్ని ఎలా కలవాలా అని ఆలోచిస్తూ అతని వైపే చూస్తున్నాడు.
మేజర్ నాగేష్ బయటకు వెళ్లబోతూ ఒక్కసారి ఆగి వెనక్కు తిరిగి రాము వైపు చూసి వెటకారంగా ఒక నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు.
దాంతో మేజర్ నాగేష్ బాడీలో ప్రమేద్ యాక్టివేట్ అయ్యాడని రాముకి పూర్తిగా అర్ధమైపోయింది.
రాము వెంటనే కమీషనర్ దగ్గరకు వచ్చి, “సార్…ప్లీజ్….ఆయనతో ఒక్కసారి కలిసి మాట్లాడేలా పర్మిషన్ తీసుకోండి సార్….ఆయనతో మాట్లాడితే మనకు ఏదో ఒక లూప్ హోల్ దొరుకుతుంది….మనం అక్కడ నుండి ప్రొసీడ్ అవొచ్చు…. సతీష్ ని మనం అరెస్ట్ చేయకపోయి ఉంటే ఈ కేస్‍లో మన ఇంత దూరం వచ్చే వాళ్ళమే కాదు….” అన్నాడు.
కమీషనర్ : లేదు రామూ….మనం రూల్స్‍ని దాటి చాలా చేసాం….ఆయన మామూలు మనిషి అయితే పర్లేదు….కాని ఆయన ఒక మేజర్…ఆయకు కోపం వస్తే ఎలాంటి ప్రాబ్లమ్ అయినా క్రియేట్ చేస్తారు….
రాము : సార్….ఒక్కసారి కలవడానికి పర్మిషన్ ఇవ్వండి సార్…..
కమీషనర్ : కుదరదు రామూ….(అంటూ బయటకు వచ్చి కారులో వెళ్ళిపోయాడు.)
దాంతో రాముకి ఏం చెయ్యాలో తెలియక ప్రసాద్‍ని తీసుకుని తన స్టేషన్‍కి వెళ్తున్నాడు.
ప్రసాద్ డ్రైవింగ్ చేస్తుండగా రాము కారులో కూర్చుని ఏం చేయాలా అని ఆలోచిస్తుంటే ఫోన్ మోగే సరికి ఆలోచనల్లోంచి బయటకు వచ్చి…..
రాము : హలో…..
మేజర్ : ఏమ్మా రాము…నన్ను కలవాలనుకుంటున్నావా…సాయంత్రం నాలుగు గంటలకు ఆర్మీ క్యాంపస్‍కి వచ్చేయ్ …కలిసి మాట్లాడుకుందాం…..(అని ఫోన్ కట్ చెసాడు.)
రాము కూడా ఫోన్ పెట్టేసి మేజర్ ఫోన్ చేసి రమ్మనడం ఏంటి అని ఆలోచిస్తూ ఉన్నాడు.
సాయంత్రం నాలుగింటికి ఆర్మీ క్యాంప్‍కి రాము వెళ్ళి అక్కడ మేజర్ నాగేష్ ని కలవాలని చెప్పాడు.
దాంతో వాళ్ళు రాముని చెక్ చేసి మేజర్ దగ్గరకు తీసుకెళ్ళారు.
మేజర్ ఇంకా రాకపోవడంతో రాము అక్కడ చైర్‍లో కూర్చున్నాడు.
ఐదు నిముషాలకు మేజర్ అక్కడకు రావడంతో ఇద్దరూ ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నారు.
మేజర్ తన చైర్‍లో కూర్చుంటూ తన వాళ్ళకు సైగ చేసాడు.
దాంతో రాము తన చైర్‍లో కూర్చోగానే వాళ్ళు అక్కడ ఉన్న తాళ్లతో రాముని కదలకుండా పట్టుకుని చైర్‍కి కట్టేశారు.
రాము కోపంగా, “ఏంటిది,” అని అంటూ తన కట్లను విడిపించుకోవడానికి ట్రై చెస్తున్నాడు.
మేజర్ తన వాళ్ల వైపు చూసి, “మీరు బయట ఉండండి….నేను ఇతనితో పర్సనల్‍గా మాట్లాడాలి,” అన్నాడు.
దాంతో వాళ్ళు అక్కడా నుండి వెళ్ళీపోయారు.
తరువాత మేజర్ ప్రశాంతంగా తన టేబుల్ మీద ఉన్న సిగార్ తీసుకుని లైటర్‍తో వెలిగించుకుంటూ, “చెప్పాను కదా రామూ….నేను తలుచుకుంటే ఏమైనా చేయగలనని ఆ రోజే చెప్పాను…ఇప్పుడు నేను మేజర్…నన్ను టచ్ కూడా చేయలేవు….తరువాత నేను మినిస్టర్ అవొచ్చు….ఆ తరువాత ప్రైమ్ మినిస్టర్ కూడా అవొచ్చు….” అంటూ రాము ఎదురుగా వచ్చి నిల్చుని, “నువ్వ్ ఏం పీకుతావు రామూ….నేను ఇంకా వెయ్యేళ్ళు బ్రతుకుతాను…నాకు చావే లేదు… అందుకే నీకు మర్యాదగా చెబుతున్నా….నాతో పెట్టుకోకుండా నీ పని నువ్వు చూసుకుంటే నీకే మంచిది….నువ్వు నా గురించి….ఈ కేసు గురించి చెప్తే ఎవరూ నమ్మరు….పైగా పిచ్చోడిని చూసినట్టు చూస్తారు….ఇప్పటికి నిన్ను వదిలేస్తున్నా….మళ్ళీ నా జోలికి వచ్చావంటే….ఈసారి నీ ప్రాణాలు తీసేస్తాను,” అంటూ తన వాళ్ళను పిలిచి కట్లు విప్పదీయించాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *