రాములు ఆటోగ్రాఫ్ – 47 44

దాంతో నాగేష్(వెంకట్) కింద పడిపోయి నొప్పితో గిలగిలలాడిపోతున్నాడు.
రాము చేసిన పనికి రేణుక మొహంలొ సంతోషం కనిపించగా….మానస మొహంలో ఆశ్చర్యం కనిపిస్తున్నది.
దాంతో రాము వెంటనే మానస దగ్గరకు వెళ్ళి గట్టిగా కౌగిలించుకుని, “సారీ….మానసా…..నీ ప్రేమని అర్ధం చేసుకోలేక పోయాను….రేణుకని బ్రతికించుకోవాలన్న స్వార్ధంతో నీకు అన్యాయం చేయాలనుకున్నాను….కాని నువ్వు నన్ను అసహ్యించుకోకపోగా నా కొసం ఈ త్యాగానికి సిధ్ధపడ్డావు….నన్ను క్షమించు,” అన్నాడు.
రాము అలా అనగానే మానస కూడా సంతోషంతో రాముని గట్టిగా కౌగిలించుకుని, “రామూ….ఇందులో క్షమాపణలు చెప్పడానికి ఏమున్నది…నీ ప్రేమ కొసం నువ్వు చేసావు….నా ప్రేమ కోసం నేను చేసాను….కాని ఇలాంటి ప్రయోగాలు ఎప్పటికైనా ప్రమాదమే,” అన్నది.
రాము : అవును మానసా….నన్నే ఒక్క నిముషం ఈ ప్రయోగం తప్పుగా అలోచించేలా చేసింది….ఇలాంటి ప్రయోగాలు సమాజానికి మేలు చేయకపోగా దీని వల్ల జరిగే నష్టం ఎక్కువగా ఉంటుంది…..(అంటూ మళ్ళి నాగేష్(వెంకట్) దగ్గరకు వచ్చాడు.)
రాము తన చేతిలో గన్ తీసుకుని నాగేష్ తలకు ఎయిమ్ చేసి, “ఒక్క నిముషం నన్ను కూడా నీ రూట్‍లోకి తెచ్చుకున్నావు…..నిన్ను ఇలాగే వదిలేస్తే చాలా ప్రమాదం,” అన్నాడు.
నాగేష్ భయపడుతూ, “వద్దు….నన్ను చంపొద్దు….ప్లీజ్….” అంట్రూ రాముని బ్రతిమలాడటం మొదలుపెట్టాడు.
“ఏరా…నువ్వు ఎంతమందిని చంపావు….అప్పుడు నీకు జాలి అనిపించలేదా….ఆఖరికి ఇపుడు నువ్వు ఉన్న ఈ శరీరం కూడా నీది కాదు…నువ్వు చిన్నప్పుడు కలిసి చదువుకున్న నీ ఫ్రండ్‍ది…మరి ఆయన శరీరంలోకి దూరినప్పుడు నీకు ఏమీ అనిపించలేదా….నీలాంటి వాడు బ్రతికి ఉండటం సమాజానికి చాలా చేటు కలిగిస్తుంది… నిన్ను జైల్లో పెడితే ఇపుడు నా మైండ్‍ని పొల్యూట్ చేసినట్టే అక్కడ వాళ్ళ మైండ్ కూడా పొల్యూట్ చేస్తావు,” అంటూ ఇక నాగేష్‍కి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా గన్‍లో ఉన్న బుల్లెట్లు మొత్తం నాగేష్(వెంకట్) బాడీలోకి దింపేసాడు.
దాంతో నాగేష్(వెంకట్) చలనం లేకుండా పడిపోయాడు.
రాము మారిపోయి మంచిగా నిర్ణయం తీసుకోవడంతో రేణుక కూడా ఆనందంగా రాముని వాటేసుకున్నది.
మానస కూడా రాము దగ్గరకు వచ్చి వెనకనుండి గట్టిగా వాటేసుకున్నది.
అలా ఒక్క నిముషం గడిచిన తరువాత రాము వాళ్ళిద్దరి కౌగిలి నుండీ విడిపించుకుని, “పదండి….ఇక్కడ నుండి వెళ్దాం….ప్రసాద్ ఎలా ఉన్నాడో చూద్దాం,” అంటూ తన దగ్గర ఉన్న వాకీటాకీని తీసి పోలీసులకు ఇక్కడ జరిగింది చెప్పి ఫార్మాలిటీస్ పూర్తి చేయమని చెప్పాడు.
అలాగే కమీషనర్‍కి ఫోన్ చేసి జరిగింది చెప్పి నాగేష్(వెంకట్)ని ఎన్‍కౌంటర్ చేసిన విషయం మొత్తం చెప్పేసాడు.
దాంతో కమీషనర్ అలాగే అని ల్యాబ్ దగ్గరకు వచ్చాడు.
అతను రాగానే మొత్తం జరిగింది చెప్పి, “సార్….ప్రసాద్ దగ్గరకు వెళ్తున్నా….ఏదైనా అవసరం అయితే పిలవండి సార్,” అన్నాడు.
“అదేంటి రామూ….ఈ న్యూస్ ప్రెస్‍కి రీలీజ్ చేద్దాం….కొద్దిసేపు ఉండు,” అంటూ కమీషనర్ రాముని ఆపి అక్కడ ఉన్న కానిస్టేబుల్‍తో రేణుకని, మానసని హాస్పిటల్‍లో దింపమని చెప్పాడు.
దాంతో కమీషనర్ ప్రెస్ మీట్ పెట్టి కేసు వివరాలు మొత్తం చెప్పి రాము, ప్రసాద్ కలిసి ఈ కేసుని ఎలా ఛేధించారో వివరంగా చెప్పారు.
ఆ కేసు గురించి చెబుతున్నంత సేపూ ప్రెస్ వాళ్ళు నమ్మలేనట్టు చాలా సైలెంట్‍గా ఒక్క ప్రశ్న కూడా వేయకుండా ఆసక్తిగా విన్నారు.
మొత్తం చెప్పిన తరువాత రాము ఆ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రెస్‍కి రిలీజ్ చేసారు.
ఆ తరువాత రెండు రోజులు టీవీల్లో ఈ కేసు గురించి, కేసుని సాల్వ్ చేసిన రాము, ప్రసాద్, అతని టీం గురించే చర్చలు జరిపారు.
ఇదంతా ప్రసాద్ హాస్పిటల్‍లో ఉన్న టీవిలో చూసి చాలా సంతోషపడిపోయాడు.
వారం రోజుల తరువాత ప్రసాద్ హాస్పిటల్ నుండి డిస్చార్జ్ అయ్యాడు.
తరువాత రోజు రాము, ప్రసాద్ ఇద్దరూ కమీషనర్ ఆఫీస్‍కి వెళ్లారు.
రాము, ప్రసాద్ లోపలికి వెళ్ళి కమీషనర్‍కి సెల్యూట్ చేసారు.
కమీషనర్ కూడా వాళ్ళ వైపు చూసి కూర్చోమన్నట్టు చైర్స్ వైపు చూపిస్తూ ప్రసాద్‍తో, “ఎలా ఉన్నది ప్రసాద్….అంతా బాగానే ఉన్నది కదా,” అనడిగాడు.
ప్రసాద్ : అంతా బాగున్నది సార్….డ్యూటీలో జాయిన్ అవడానికి ఫార్మాలిటీస్ కూడా పూర్చి చేసాను….

కమీషనర్ : గుడ్…గుడ్….(అంటూ రాము వైపు చూస్తూ)….ఇప్పుడు మీ ఇద్దరికీ ఒక న్యూస్ చెబుదామని పిలిచాను.

రాము : ఏంటి సార్….అది….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *