రాములు ఆటోగ్రాఫ్ – 47 40

దాంతో రాము చేసేది లేక మానసని పిలిచి రేణుకని పరిచయం చేసాడు.
రాము : మానసా….ఈమె పేరు రేణుక……
మానస : హాయ్….బామ్మ గారు….(అంటూ రాము వైపు తిరిగి) నీకు నాయనమ్మ అవుతారా…..(అనడిగింది.)
మానస అడిగిన దానికి రాముకి ఏం చెప్పాలో తెలియలేదు.
రాము : నా నాయనమ్మ కాదు….నాకు భార్య అవుతుంది….
రాము అలా అనగానే మానస ఒక్కసారిగా బిత్తరపోయింది….ఆమె నోటి వెంట మాట రాలేదు.
రాముని, రేణుకని మార్చి మార్చి చూస్తున్నది.
రేణుక చూస్తే డెబ్బై ఏళ్ళు ముసలావిడ….రాము పాతికేళ్ళ కుర్రాడు….వీళ్ళిద్దరూ భార్యాభర్తలేంటి అన్న ఆలోచనతో రాము వైపు అయోమయంగా చూస్తున్నది.
మానస తన వైపు అలా ఎందుకు చూస్తుందో అర్ధం అయిన రాము, “మానసా….నీకు మా కధ పూర్తిగా వివరంగా చెప్పేంత టైం లేదు….అందుకని బ్రీఫ్‍గా చెబుతున్నాను….మా పెళ్ళి ఎలా జరిగింది అనేది మాత్రం చెబుతాను,” అంటూ జరిగింది మొత్తం చెప్పాడు.
రాము చెప్పింది విన్న మానసకు నమ్మబుధ్ధి కాలేదు….కాని రాము మొహం చూస్తుంటే అతను అబధ్ధం చెబుతున్నాడని అనిపించడం లేదు.
మానస : అంటే ఈమె నిజంగా నీ భార్యేనా……(అంటూ నమ్మలేనట్టు రాము వైపు చూస్తూ అడిగింది.)
రాము : మరి అదే కదా చెబుతున్నది….
మానస : నాకు అసలు నమ్మబుధ్ధి కావడం లేదు…నువ్వు కాలంలో వెనక్కు వెళ్ళడం ఏంటి…ఈమెను పెళ్ళి చెసుకుని పిల్లల్ని కన్న తరువాత మళ్ళీ నువ్వు నీ కాలానికి తిరిగి వచ్చి నీ ఫ్యామిలీని కలవడం….నాకు అంతా ఏదో సైన్స్ ఫిక్షన్ సినిమా కళ్ళ ముందు కదులుతున్నట్టు ఉన్నది….
రాము : ఇదంతా చెబితే ఎవరూ నమ్మరనే…..ఎవరికీ చెప్పలేదు….కాని పరిస్థితుల వలన నీకు చెప్పాల్సి వచ్చింది….
మానస : అందుకేనా మొన్న నువ్వు కౌన్సిలింగ్‍లో బావి గురించి చెప్పావు….
రాము : అవును….ఆ బావిలొ పడటం వలనే నేను నా కాలానికి తిరిగి వచ్చాను….
మానస : సరె….ఇప్పుడు నన్ను ఎందుకు రమ్మన్నావు…..
రాము : వెంకట్ చేసిన experiment గురించి నీకు తెలుసు కదా…..
మానస : అవును….ఆ కేసు మిస్టరీ చేదించింది నువ్వే కదా…..
రాము : ఇప్పుడు నాకు రేణుకతో కలిసి బ్రతకాలని ఉన్నది…
మానస : ఎలా కుదురుతుంది రామూ….ఆమె చూస్తూ డెబ్బై ఏళ్ళ ముసలావిడ….నువ్వు చూస్తే ఇంకా పాతికేళ్ళ వయసు ఉన్నవాడివి….
రాము : నువ్వు ఒప్పుకుంటే కుదురుతుంది…..(అంటూ ఆమె కళ్ళల్లోకి చూడలేక తల దించుకున్నాడు.)
మానస : నేను ఒప్పుకుంటే….కుదిరేదేంది….(అంటూ రాము వైపు డౌట్‍గా చూస్తూ….) అంటే నీ ఉద్దేశ్యం వెంకట్ చేసిన experiment ద్వారా రేణుకని నా శరీరం లోకి పంపిద్దామనుకుంటున్నావా…..
రాము తల ఎత్తకుండానే అవునన్నట్టు తల ఊపాడు.
తన డౌట్ క్లియర్ అయ్యే సరికి….రాము అలా అనే సరికి మానసకి నోట మాట రాలేదు.
ఆమె కళ్ల వెంబడి కన్నీళ్ళు కారుతున్నాయి.
మానస : నిజంగా నువ్వేనా రామూ ఇలా మాట్లాడుతున్నది….(అంటూ ఇంకా మాట్లాడటానికి నోట మాట రాక అలాగే రాము వైపు చూస్తూ నిల్చుండి పోయింది.)
రాముకి కూడా తప్పు చేస్తున్నట్టు క్లియర్‍గా తెలుస్తుండటంతో మాసన కళ్లల్లోకి చూడలేక అలాగే తల వంచుకుని ఉన్నాడు.
రాము ఏమీ మాట్లాడకపోయేసరికి మానస ఇక రేణుక వైపు తిరిగి….
మానస : మీక్కూడా ఇది కరెక్ట్ అనిపిస్తుందా…..
రేణుక : అది కాదమ్మా…..
మానస : ఏది కాదండీ….మీ స్వార్ధం కోసం నా జీవితాన్ని నాశనం చేస్తారా…..
రేణుక : లేదమ్మా….నేను కూడా అదే చెప్పానమ్మా….రాము నా మాట వినడం లేదు….ఇక నావల్ల కాక నిన్ను ఒప్పించమని పంపించాను…నువ్వు ఎలాగూ ఒప్పుకోవని….అలా చెప్పాను….
రేణుక మాట కూడా వినడం లేదని అర్ధమయిన మానసకి ఏం చేయాలో తోచక అక్కడ ఉన్న చైర్‍లో కూర్చున్నది.
మానస అలా ఏడుస్తుంటే రాముకి చాలా బాధగా అనిపించి మెల్లగా లేచి అడుగులో అడుగు వేసుకుంటూ మానస దగ్గరకు వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేసాడు.
దాంతో మానస ఒక్కసారిగా తల ఎత్తి రాము కళ్ళల్లొకి చూస్తూ ఇందాకటికంటే గట్టిగా ఏడుస్తూ చైర్‍లో నుండి లేచి రాముని గట్టిగా వాటేసుకుని ఏడుస్తూ, “రామూ….నువ్వంటే నాకు చాలా ఇష్టం…నాకు నీతో కలిసి బ్రతకాలని ఉన్నది… కాని నీకు నా మీద ప్రేమ లేదు,” అంటూ అతని ఛాతీ మీద తల పెట్టి ఏడుస్తూ ఒక చేత్తో రాము వీపుని గట్టిగా పట్టుకుని, ఇంకొ చేత్తో రాము గుండె మీద చిన్నగా కొడుతున్నది.
వాళ్ళిద్దరిని అలా చూసిన రేణుక కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి.
అప్పటికే ఆమె కూడా రాముకి పెళ్ళి చేద్దామని డిసైడ్ అవడంతో వాళ్ళిద్దరిని అలా చూసినా కూడా భాధ అనిపించలేదు.
కాకపోతే రాము తన మాట వినకుండా ఒక అమ్మాయికి అన్యాయం చేస్తున్నాడన్న భాధ మాత్రం ఆమెను నిలువనివ్వడం లేదు.
రేణుకు వాళ్ల దగ్గరకు వచ్చి రాము భుజం మీద చెయ్యి వేసి, “రామూ…..” అన్నది.
రేణుక మాట వినగానే రాము, మానస ఒక్కసారిగా సృహలోకి వచ్చి విడివడ్డారు.
రేణుక : రామూ….ఒక్కమాట అడుగుతాను సమాధానం చెబుతావా…..
రాము : ఏంటది రేణూ….
రేణుక : ఆ సైంటిస్ట్ ని ఎందుకు అంత పట్టుదలగా వెంటబడి మరీ పట్టుకున్నావు…..
రాము : అతను మర్డర్స్ చేసాడు…..ఐదుగురిని చంపేసాడు….
రేణుక : ఎందుకు చంపాడు….
రాము : అలా అడుగుతావేంటి రేణూ….వాడు ఒకళ్ళ శరీరంలో ఉండటానికి….తన పాత పగలు తీర్చుకోవడానికి ఈ భయంకరమైన పన్నాగం పన్నాడు…..
రేణుక : మరి నువ్వు చేస్తున్నదేంటి…నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు…అతను తన స్వార్ధం కోసం చేస్తే…నువ్వు నీ స్వార్ధం కోసం చేస్తున్నావు….అది తప్పు కదా…..
రాము : నేను స్వార్ధం కోసం చేయడం లేదు….మన ప్రేమను బ్రతికించుకోవడానికి ట్రై చేస్తున్నాను….నేను నీతో సంతోషంగా గడపాలనుకున్నాను….కాని…కుదరలేదు….నీకు మాత్రం నాతో సంతోషంగా గడపాలని లేదా….
రేణుక : నీతో జీవితాంతం కలిసి ఉండాలని ఉన్నది రాము….నాక్కూడా నీతో సంతోషంగా జీవితం గడపాలని ఉన్నది… కాని దానికి ఇది మార్గం కాదు….ఒక ఆడపిల్ల జీవితాన్ని పణంగా పెట్టకూడదు….నువ్వు కాలంలో వెనక్కు రావడం… నీతో పిల్లల్ని కనడం వరకే నా సంతోషం ముడిపడి ఉన్నది….అక్కడితో నా పని అయిపోయింది….దేవుడు ఇచ్చిన దాంతో తృప్తి పడాలి రాము….నీ సంతోషానికి నేను ఎప్పుడూ అడ్డు రాను….నీకు మళ్ళీ పెళ్ళి చేద్దామని అనుకుంటున్నాను….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *