రాములు ఆటోగ్రాఫ్ – 47 44

అలా చూస్తున్న వాళ్ళకు అప్పుడే ఇంట్లోకి అడుగు పెట్టిన మేజర్ నాగేష్(వెంకట్) వాళ్ల వైపు చూసి నవ్వుతూ అక్కడకు వచ్చి వాళ్ళ ఎదురుగా ఉన్న చైర్‍లో కూర్చున్నాడు.
మేజర్ నాగేష్(వెంకట్)ని చూసిన వాళ్లకు ఏం చేయాలో తెలియక భయంతో లేచి నిల్చున్నారు.
మేజర్ నాగేష్(వెంకట్) : ఏంటి….కొత్త వ్యక్తిని చూసినట్టు అలా భయపడిపోతున్నారేంటి….కూర్చోండి….
మేజర్ అలా అనగానే మళ్ళి ఏం చేస్తాడో అన్న భయంతో అందరూ మళ్ళీ సోఫాలో కూర్చున్నారు.
మేజర్ నాగేష్ (వెంకట్) : ఎలా ఉన్నావు మనోజ్…..(అంటూ సిగార్ వెలిగించుకుంటున్నాడు.)
************
అప్పుడే రాము కారు మనోజ్ ఇంటి ముందు ఆగింది.
కారు ఆగిన వెంటనే రాము కిందకు దిగి గేటు తీసుకుని లోపలికి పరిగెత్తాడు.
కాని మనోజ్ ఇంటికి తాళం వేసి ఉండటంతో అక్కడ ఉన్న కిటికీ లోనుండి చూసిన రాముకి లోపల మనోజ్ పిల్లల్ని కట్టేసి…వాళ్ళు అరవకుండా నోటికి ప్లాస్టర్స్ వేసి ఉండటం చూసాడు.
రాము వెంటనే గన్ తీసుకుని ఇంటి తాళాన్ని షూట్ చేసి లోపలికి వెళ్ళగానే అతనితో పాటు వచ్చిన వాళ్ళు మనోజ్ భార్య, పిల్లల కట్లు విప్పేసారు.
అంతలో లోపల నుండి మనోజ్ కూతురు గన్‍తో బయటకు వచ్చి రాముకి aim చేసింది.
రాము వెంటనే పైకి లేచి నిల్చుని, “ఏయ్….ఏం చేస్తున్నావు,” అన్నాడు.
“నేను నిన్ను ప్రాణాలతో వదిలేస్తే….వాడు మా నాన్నని చంపేస్తాడు…” అంటూ కంగారు పడిపోతున్నది ఆ అమ్మాయి.
“తొందర పడకు…నీకు ఈ గన్ ఎవరు ఇచ్చారు…ఇంతకు మీ నాన్న, మేజర్ నాగేష్(వెంకట్) ఎక్కడ ఉన్నారు,” అనడిగాడు రాము.
కాని ఆ అమ్మాయి భయపడుతూ కంగారుగా తన చేతిలో ఉన్న గన్‍ని దించకుండా భయంగా చూస్తున్నది.
“చూడు….టెన్షన్ పడకుండా జరిగింది చెప్పు….నీ తమ్ముడికి ఆస్తమా ఉన్నది….స్నీజింగ్ వలన ఊపిరాడక ఇబ్బంది పడుతున్నాడు…ముందు ఇన్‍హేలర్ ఎక్కడ ఉన్నదో చెప్పు,” అంటూ రాము మెల్లగా ఆ అమ్మాయి దగ్గరకు రావడానికి ట్రై చేస్తున్నాడు.
పక్కనే ఉన్న కానిస్టేబుల్ ముందుకు వచ్చి, “అమ్మా….నా మాట విను,” అంటూ ఆ అమ్మాయి దగ్గరకు వెళ్ళబోయాడు.
దాంతో ఆ అమ్మాయి కళ్ళు మూసుకుని గన్ షూట్ చేసేసరికి బుల్లెట్ కానిస్టేబుల్ భుజంలో తగిలింది.
కానిస్టేబుల్ అలాగే వెనక్కు సోఫాలో పడిపోయాడు.
రాము వెంటనే కానిస్టేబుల్ దగ్గరకు వెళ్ళి ఏమయిందో అని కంగారు పడుతున్నాడు.
అది చూసిన కానిస్టేబుల్, “సార్…నాకేమీ కాలేదు…ముందు ఆ అమ్మాయిని సేవ్ చేయండి,” అన్నాడు.
ఇంతలో ఆ అమ్మాయి తన ఫ్యాంట్ పాకెట్‍లో ఉన్న ఇన్‍హేలర్ తీసుకుని తన తమ్ముడికి ఇచ్చింది.
అతను వెంటనే ఇన్‍హేలర్ తీసుకుని దాన్ని నోట్లో పెట్టుకుని ప్రెస్ చేసాడు.
ఆ అమ్మాయి తన ఫోన్ తీసుకుని తన తండ్రికి ఫోన్ చేసింది.
మనోజ్ ఫోన్ కట్ చేయడంతో ఆ అమ్మాయి ఫోన్ పక్కన పెట్టేసి రాము వైపు గన్ చూపిస్తూ, “కదలొద్దు…. దగ్గరకు రావాలని ట్రై చేస్తే షూట్ చేస్తాను,” అంటున్నది.
ఇంతలో ఆ అమ్మాయి తమ్ముడు first aid box తీసుకొచ్చి కానిస్టేబుల్‍కి రక్తం ఎక్కువ పోకుండా కట్టు కట్టాడు.
ఇక ఆ అమ్మాయి ఏం చేయదని రాముకి నమ్మకం కుదిరాక చిన్నగా వెనక్కు తిరిగి అక్కడ నుండి బయటకు వచ్చాడు.
***********
అయితే ఇక్కడ న్యూరో ఇన్‍స్టిట్యూట్‍లో మేజర్ గన్ పట్టుకుని మనోజ్ ని బెదిరిస్తూ లోపలికి తీసుకెళ్ళాడు.
మనోజ్ ల్యాబ్ లోకి వెళ్ళి అక్కడ ఉన్న సిస్టమ్స్ ని యాక్టివేట్ చేస్తున్నాడు.
ఇంతలో తన ఫోన్ మోగడంతో మనోజ్, మేజర్ నాగేష్ (వెంకట్) లు ఫోన్ లో అతని కూతురు నెంబర్ చూసి నాగేష్ తన చేతిలో ఉన్న గన్‍ని మనోజ్ తల మీద పెట్టి, “వాడు రాము మీ ఇంటికి వచ్చాడు….తొందరగా కానివ్వు,” అన్నాడు.
దాంతో మనోజ్ ఫోన్ కట్ చేసి అక్కడ ఉన్న మిషన్స్ కి యాక్సెస్ కోడ్‍లు ఎంటర్ చేసి వాటిని యాక్టివేట్ చేయడం మొదలుపెట్టాడు.
సిస్టమ్ యాక్సెస్ చేసిన తరువాత క్యూబాక్స్ పెట్టడానికి ఇంకో మిషన్ దగ్గరకు వెళ్ళి మనోజ్ తన బయోమెట్రిక్ యాక్సెస్ కోసం చేతిని యాక్సెస్ పాయింట్ మీద పెట్టాడు.
దాంతో మిషన్ మనోజ్ చేతిని స్కాన్ చేసి మ్యాచ్ అవడంతో క్యూబాక్స్ పెట్టడానికి డోర్ ఓపెన్ అయింది.
మేజర్ నాగేష్ తన చేతిలో ఉన్న క్యూబాక్స్ మనోజ్ చేతిలో పెట్టాడు.
మనోజ్ ఆ క్యూబాక్స్ ని సిస్టమ్ లోపల పెట్టగానే అది లోపలికి వెళ్ళిపోయి పని చేయడం మొదలుపెట్టింది.
క్యూబాక్స్ పని చేయడం మొదలవగానే మేజర్ నాగేష్ తన చేతిలో ఉన్న రివాల్వర్‍తో మనోజ్ తల మీద కొట్టడంతో అతను సృహతప్పి కింద పడిపోయాడు.
మేజర్ నాగేష్(వెంకట్) కింద పడిన మనోజ్ చేయి పట్టుకుని ఈడ్చుకుంటూ పక్కకు తోసి….అక్కడ ఉన్న కంప్యూటర్‍లో తనకు సంబందించిన మెమరీ ఫైల్స్ అప్‍డేట్ చేయడం మొదలుపెట్టాడు.
క్యూ బాక్స్ లో ఉన్న మెమరీని మొత్తం హార్డ్‍డిస్క్‍లో కాపీ చేస్తున్నాడు.
దాంతో క్యూ బాక్స్‍లో మెమరీ మొత్తం హార్డ్ డిస్క్ లో కాపీ అవుతున్నట్టు ప్రోగ్రెస్ బార్ సిస్టమ్‍లో కనిపిస్తున్నది.
అంతలో పక్కనే ఉన్న మానిటర్‍లో రాము ల్యాబ్‍ లోకి వచ్చినట్టు చూపించడంతో మేజర్ నాగేష్(వెంకట్) చిన్నగా నవ్వుకుంటూ తన బ్రెయిన్ డేటాని కాపీ చేస్తున్నాడు.

రాము డోర్ తీసుకుని ల్యాబ్‍లోకి వచ్చాడు.
మేజర్ ఎక్కడ ఉన్నాడా అని మెల్లగా లోపలికి వస్తున్న రాముకి మేజర్ నాగేష్(వెంకట్) బుల్లెట్‍తో స్వాగతం పలికాడు.

దాంతో రాము వెంటనే తన నడుముకి ఉన్న పౌచ్‍లో గన్ తీసుకుని మేజర్ మీద కౌంటర్ ఫైరింగ్ చేస్తూ లోపలికి రావడానికి ట్రై చేస్తున్నాడు.
అలా వీళ్ళీద్దరూ ఫైరింగ్ చేసుకుంటుంటే ఇక్కడ సిస్టమ్‍లో వెంకట్ బ్రెయిన్ మెమరీ కాపీ అవుతున్నది.
ఫైరింగ్ చేసుకుంటున్న వాళ్ళిద్దరి గన్స్ లో బుల్లెట్లు అయిపోవడంతో మేజర్ నాగేష్(వెంకట్) ముందుకు దూకి రాముకి అవకాశం ఇవ్వకుండా కొడుతూ అతను కింద పడేలా కొట్టాడు.
దాంతో రాము కింద పడిపోయి పైకి లేవడానికి ట్రై చేస్తూ మేజర్‍ని అటాక్ చేస్తున్నాడు.
వాళ్ళిద్దరూ అలా కొట్టుకుంటుంటే అక్కడ ఉన్న గ్లాస్ డోర్స్, కొన్ని సిస్టమ్స్ పగిలిపోతున్నాయి.
మేజర్ ఒకసారి తలతిప్పి సిస్టమ్ వైపు చూసే సరికి అక్కడ సిస్టమ్‍లో కాపీ ప్రోగ్రెస్ బార్‍లో 43% కాపీ అయినట్టు చూపిస్తున్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *