రాములు ఆటోగ్రాఫ్ – 46 80

**********
స్టేట్ పోలిస్ హెడ్ క్వార్టర్స్‍లో సతీష్ ని ఉంచిన చోటు……
సతీష్ ని ఒక గదిలో ఉంచి అక్కడ ఉన్న కెమేరాల ద్వారా అతను ఏం చేస్తున్నాడు….ఎలా బిహేవ్ చేస్తున్నాడు అని ప్రతి క్షణం observe చేస్తున్నారు.
వాళ్లల్లో మనోజ్ కూడా ఉన్నాడు.
మనోజ్ : అతను సిగిరెట్ కాలుస్తున్న స్టైల్, కుర్చీలో కూర్చుని కార్పెట్ మీద కాలు పెట్టిన విధానం అచ్చం వెంకట్ స్టైల్…..
అంతలొ ఆయన అసిస్టెంట్ ఒక మందుని ఇంజక్షన్‍లో లోడ్ చేసి ఇచ్చింది.
అది తీసుకుని మనోజ్ తన చేతిలో ఉన్న మందుని రాము వాళ్లకు చూపిస్తూ, “ఇది కొత్తరకం గ్లూప్ సీరమ్… గ్లూప్ సీరమ్‍లో NSD కలిస్తే ఎంత పవర్‍ఫుల్‍గా ఉంటుందో….ఇదలా ఉంటుంది….నిజం చెప్పించడానికి ఇండియాలో ఇంత వరకు ఎవరి మీదా ఉపయోగించలేదు…ఎందుకంటే చట్టపరంగా దీనికి పర్మిషన్ లేదు….అందువలన ఈ మందు ప్రభావం వలన అతను నిజం చెప్పినా మనం కోర్ట్ లో రుజువు చేయలేము….
రాము : ఈ కేసు వివరాలు కోర్ట్ లో పెడితే మనల్ని పిచ్చోళ్లను చూసినట్టు చూస్తారు…ఎవరూ అంత తొందరగా నమ్మరు….కాబట్టి మనకు ఈ కేసు వివరాలు కనిపెట్టాడం చాలా ముఖ్యం….

రాము చెప్పింది విని మనోజ్ అలాగే అన్నట్టు తల ఊపి తన అసిస్టెంట్‍కి ఇంజక్షన్ ఇచ్చి, “వెళ్ళి చెయ్యి,” అన్నాడు.
“సరె సార్,” అంటూ ఆమె ఇంజక్షన్ తీసుకుని సతీష్ ని ఉంచిన రూమ్ లోకి వెళ్ళింది.
మనోజ్ : దీన్ని మనం అతని మీద ఒక్కసారి మాత్రమే ఉపయోగించొచ్చు….మళ్ళి దీన్ని అతని మీద ప్రయోగించాలంటే కొన్ని రోజులు టైం పడుతుంది…..
అది విన్న రాము, కమీషనర్ అలాగే అన్నట్టు తల ఊపారు.
ఆమె తన చేతిలొ ఉన్న ఇంజక్షన్ సతీష్ కి చేయగానే అతను మగతగా పడుకుండి పోయాడు.
ఐదు నిముషాల తరువాత రాము, మనోజ్ లోపలికి వెళ్ళారు.
రాము అక్కడ ఉన్న కానిస్టేబుల్‍ని పిలిచి సతీష్ కి హ్యాండ్ కఫ్స్ వేయమనే సరికి అతను బేడీలు వేసి వెళ్ళిపోయాడు.
మనోజ్ సతీష్ పక్కనే ఉన్న చైర్‍లో కూర్చుని అతని వైపు చూస్తూ…..
మనోజ్ : వెంకట్….వెంకట్….నేనెవరో తెలుస్తుందా….నీ కొలిగ్ మనోజ్ ని….వింటున్నావా….
సతీష్ (వెంకట్) వింటున్నట్టు మైకంలో తల ఊపుతున్నాడు.
మనోజ్ : వెంకట్ (సతీష్)….నీ మరణం సహజమైనదా…లేక సూసైడ్ చేసుకున్నావా…..
వెంకట్ (సతీష్) : సూసైడ్…..(అంటూ మగతలో సమాధానం చెబుతున్నాడు.)
ఆ మాట వినగానే రాము ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు.
ఇప్పటి దాకా తను అనుమానించింది….తన కేసు చిక్కుముడి మెల్లగా విడిపోతున్నందుకు…ఇది నిజంగా ఎలా జరుగుతుందని నమ్మలేక నమ్ముతూ ఆశ్చర్యంతో వెంకట్ (సతీష్) ఇంకా ఏం చెబుతాడా అని ఆతంగా ఎదురుచూస్తున్నాడు.
మనోజ్ : ఎందుకు సూసైడ్ చేసుకున్నావు….చెప్పు వెంకట్ (సతీష్)….
అలా అడుగుతున్నప్పుడు వెంకట్ (సతీష్) ఆ మైకం లోనే కుర్చీలో నుండి ఎగిరిపడుతున్నట్టు అనిపించడంతో రాము అతన్ని పట్టుకోబోయాడు.
కాని మనోజ్ వెంటనే రాము వైపు చూసి ఆగమన్నట్టు సైగ చేసాడు.
దాంతో రాము తన ప్రయత్నాన్ని ఆపేసి వెంకట్ (సతీష్) వైపు చూస్తున్నాడు.
మనోజ్ : చెప్పు వెంకట్(సతీష్)….నీ మెదడుని కాపీ చేసుకుని దాన్ని ఇంకొకళ్ళ మీద ఎలా ప్రయోగిస్తున్నావు….వాళ్ళను ఎలా కంట్రోల్ చేయగలుగుతున్నావు….
వెంకట్ (సతీష్) : నా దగ్గరకు ట్రీట్‍మెంట్‍కి వచ్చిన వాళ్ళ మెదడు లోకి ఎలక్ట్రానిక్ జెల్‍ని పంపించి దాని ద్వారా వేలాది సెవంత్ జనరేషన్ నానో ట్రాన్స్ మీటర్స్ ని పంపించి వాళ్ళ మెదడులో ఉన్న న్యూరాన్స్ లోకి చేరుకునేలా చేస్తాను…వెంటనే హార్డ్ డిస్క్ లో డిజిటల్‍గా ఉన్న నా జ్ఞాపకాలు అతని మొదడులో ఉన్న నానో ట్రాన్స్ మీటర్స్ లో కాపీ అవుతాయి…ఈ ప్రాసెస్ మొత్తం అయిపోయిన తరువాత వాళ్ళు ఎప్పటిలాగే మామూలుగా ఉంటారు….నా experiment సక్సెస్ అయిందా లేదా అని కనిపెట్టడానికి సూసైడ్ చేసుకున్నాను…నేను చనిపోయే చివరి క్షణాల్లో నా మెదడులో ఉన్న ట్రాన్స్‍మీటర్స్ జిమ్ ట్రైనర్ అశోక్ మెదడులో ఉన్న నానో ట్రాన్స్ మీటర్స్ లోకి పంపించాను…దానిలో మొదటి స్టెప్ ఏంటంటే కావలసినంత ఎలక్ట్రికల్ సిగ్నల్స్‍ ద్వారా అశోక్ మెదడులో ఉన్న ట్రాన్స్ మీటర్స్ కి పంపి అశోక్ మెదడులో అతని తాలూకు జ్ఞాపకాలను ఎరేజ్ చేసేస్తుంది…..ఆ తరువాత వెంటనే ఆ ట్రాన్స్ మీటర్స్ లో ఉన్న నా జ్ఞాపకాలు అశోక్ మొదడులో కాపీ అవుతాయి….అప్పుడు వాడు సృహలోకి వచ్చి కళ్ళు తెరవగానే వాడిలో నేనే (వెంకట్) ఉంటాను… ఒక కొత్త మనిషిలా…అశోక్‍ శరీరంలోకి వెళ్ళిన నేను వెంటనే రీసెర్చ్ లాబ్‍కి వెళ్ళి అక్కడ ఉన్న శరీరాన్ని ఇంటి ముందు పెట్టాను…తరువాత అందరితో పాటు నేను అశోక్ శరీరంతో వెంకట్ చనిపోయిన శరీరానికి శ్రధ్ధాంజలి ఘటించి వచ్చాను…నేను ఇంకొకరి శరీరంలో ప్రాణాలతో ఉన్నంత వరకు….లాబ్‍లో నా జ్ఞాపకాలు హార్డ్ డిస్క్ లో లైవ్‍గా ఎప్పటికప్పుడు update అవుతూ ఉంటాయి….
మనోజ్ : సరె….ఆ జిమ్ ట్రైనర్ అశోక్ భార్యని ఎందుకు చంపావు…..
వెంకట్ (సతీష్) : చాలా….చాలా…..ఇరిటేషన్ తెప్పించేస్తుంది….చాలా చిరాకు పుట్టించేసింది….సిగిరెట్ తాగుతుంటే తాగొద్దు అంటుంది….ప్రతి దానికి పోట్లాట పెట్టుకుంటుంది…పైగా దానికి చాలా కొరికలు ఎక్కువ….అశోక్ శరీరంతో దాన్ని చాలా సార్లు నా కసితీరా అనుభవించాను…..ఒకరోజు నా కోపం హద్దులు దాటిపోయింది….దాంతో ఆమెను చంపేసాను…..
మనోజ్ : మరి సీరియల్ యాక్ట్రస్ హంసని ఎందుకు చంపావు….ఆమెకు నీకు సంబంధం ఏంటి….

వెంకట్ (సతీష్) : దాన్ని ఎందుకు చంపానో నీకు బాగా తెలుసు…..

ఆ మాట వినగానే రాము వెంటనే మనోజ్ వైపు చూసాడు….

వెంకట్ (సతీష్) : చాలా….చాలా…..ఇరిటేషన్ తెప్పించేస్తుంది….చాలా చిరాకు పుట్టించేసింది….సిగిరెట్ తాగుతుంటే తాగొద్దు అంటుంది….ప్రతి దానికి పోట్లాట పెట్టుకుంటుంది…పైగా దానికి చాలా కొరికలు ఎక్కువ….అశోక్ శరీరంతో దాన్ని చాలా సార్లు నా కసితీరా అనుభవించాను…..ఒకరోజు నా కోపం హద్దులు దాటిపోయింది….దాంతో ఆమెను చంపేసాను…..

2 Comments

Add a Comment
  1. Anna story super ga undhi apakunda continu cheyandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *