రాములు ఆటోగ్రాఫ్ – 46 76

మనోజ్ : ఇప్పుడు మీరు ఎవరు అని అడిగితే మీరు ఎవరని చెబుతున్నారు….మీ పేరు చెబుతున్నారు… అదెలా జరుగుతుంది….మీ అమ్మా, నాన్న మీకు ఆ పేరు పెట్టడం వలన జరుగుతుంది…అదీ కాక చుట్టూ ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఆ పేరుతో పిలవడం వలన…అది మీ మెదడులో జ్ఞాపకాలు అయి ఉండటం వలన మీరు అలా అంటున్నారు….ఈ జ్ఞాపకాలే మీరు రాము అని నిర్ధారిస్తున్నాయి….అందరికీ ప్రాణం ఒక్కటే ఉంటుంది….కాని జ్ఞాపకాలు అనేవి వేరు వేరుగా ఉంటాయి…మీ జ్ఞాపకాలు మిమ్మల్ని ఈ పోలిస్ జాబ్ చేయమని ప్రేరేపిస్తున్నాయి… అలాగే నాలో ఉన్న జ్ఞాపకాలు నన్ను ఇలా సైంటిస్ట్ గా మార్చేసాయి….ఇప్పుడు మీ మెదడుని ఎలా ఉన్నదో అలా బయటకు కాపీ తీసామంటే…అది మిమ్మల్ని కాపీ చేసినట్టు అవుతుంది…ఈ జ్ఞాపకాలు అన్నీ సైకలాజికల్‍గా మన మెదడులో చాలా చోట్ల ఉన్న రసాయనాలే….ఈ రసాయనాలన్నీ ప్రవహించే పాయింట్లు అన్నీ కనెక్ట్ చేస్తే డాట్లే న్యూరాన్స్….మొదట్లో వెంకట్ దీన్ని ఎలకల మీద చేసాడు…ఎలుకల మీదే ఎందుకంటే….మనిషి మెదడు పని చేసే విధానం….ఎలుక మెదడు పని చేసే విధానం దాదాపుగా ఒకేలా ఉంటుంది…దాని మెదడులో ప్రకృతి సహజంగా ఉత్పత్తి అయ్యే విద్యుఛ్చత్తితో పనిచేయగల ఒక సిలికాన్ ఎలక్ట్రిక్ జెల్‍తో మెదడులోకి ఇంజెక్ట్ చేస్తే….ఆ ఎలక్ట్రానిక్ జెల్‍లో ఉన్న వేలాది నానోట్రాన్స్ మీటర్లు మెదడులో ఉన్న ఒక్కో న్యూరాన్ లోకి వెళ్లి చేరుతుంది….అలా న్యూరాన్స్ చేరిన తరువాత ఒక్కసారి వాటిని కాపీ చేసే ప్రాసెస్‍ని యాక్టివేట్ చేయగానే ఆ నానోమీటర్లు మెదడులో ఉన్న ఫిజికల్ ఇన్ఫర్‍మేషన్ మొత్తాన్ని ఫైబర్ ఆప్టిక్ కేబుల్ ద్వారా డిజిటలైజేషన్ చేసి ఎలుక మెదడు మొత్తం ఒక కంప్లీట్ స్ట్రక్చర్‍గా ఫామ్ అయ్యి డిజిటల్‍గా హార్డ్ డిస్క్ లో కాపీ అవుతుంది….సింపుల్‍గా చెప్పాలంటే ఒక పాటల కేసెట్ టేప్‍లో ఉన్న ఎనలాగ్ సౌండ్‍ని CDలో రికార్డ్ చేయడం లాంటిది….నారాయణకి ముందు ఉన్న CEO వెంకట్ కనిపెట్టిన ఈ పరిశోధనకు బాగా ఇంప్రెస్ అయ్యాడు…వెంకట్ ఈ టెక్నాలజీని ఉపయోగించి మనిషి మెదడుని కాపీ చేయడానికి ఆయన దగ్గర అప్రూవల్ తీసుకుని ఈ రీసెర్చ్ కోసమే మా ఇన్‍స్టిస్ట్యూట్‍లో ఒక లాబ్ construct చేయించుకున్నాడు….ఈ పరిశోధన మనిషి మీద చేస్తే వచ్చే ప్రమాదాలు చాలా ప్రమాదం….ఈ experiment కొంచెం బెడిసికొట్టినా…మనుషులు పిచ్చివాళ్ళు అవొచ్చు లేదా….కోమాలోకి వెళ్ళిపోవచ్చు….లేకపోతే చనిపోయినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు…ఒక మనిషి ప్రాణాన్ని కనీసం లెక్కచేయకుండా ఈ experiment ఎలాగైనా సక్సెస్ అవ్వాలని విశ్రాంతి తీసుకోకుండా ఒక రకమైన కసితో వెంకట్ పని చేసాడు….చివరికి వేరేదారి లేక తన ప్రాణాన్ని పణంగా పెట్టి తన మెదడులోకే ఆ ఎలాక్ట్రానిక్ జెల్ ఇంజెక్ట్ చేసుకుని తన ఫిజికల్ బ్రెయిన్‍ని పూర్తిగా లేటేస్ట్ వైర్‍లెస్ టెక్నాలజీ ద్వారా ఒక హార్డ్ డిస్క్ లో డిజిటల్‍గా కాపీ చేసి సక్సెస్ అయ్యాడు….ఈ బ్యాకప్ ద్వారా మీరు చనిపోయినా మీ మెమరీ తాలూకు కాపీ హార్డ్ డిస్క్ లో ఉన్నంత వరకు మిమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు….ఒక విధంగా చెప్పాలంటే మృత్యువుని జయించడం కింద లెక్క….

రాము : సార్….మీరు చెప్పినట్టు….ఆర్టిఫిషియల్ సిలికాన్ జెల్‍ని మనిషి మెదడు లోకి ఎక్కించడం వలన ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశం లేదా….
మనోజ్ : అందుకేగా….వెంకట్ ప్రపంచంలో ఉన్న ఫేమస్ న్యూరో సైంటిస్ట్ లలో ఒకరు అయ్యారు…అతను మాతో ఉన్న చివరి రోజు వరకు తన ఇంజక్ట్ చేసుకున్న జెల్ అతని మొదడులోనే ఉన్నది…చనిపోయేంత వరకు వెంకట్ ఎప్పుడూ ఎలాగ ఉండేవాడో అలాగే ఉన్నాడు….అదీకాక మనకు తెలిసి ముప్పై ఏళ్ళుగా మెదడులో బుల్లెట్ ఉన్నా బ్రతికున్న వాళ్ళు ఉన్నారు….అదీ కాక ఈ రీసెర్చ్ లో next level ఏంటంటే….ఒక మనిషిలో ఉన్న ప్రతిభని, విద్వత్తుని, జ్ఞాపకాలను ఇంకొకరి మొదడులోకి ట్రాన్స్ ఫర్ చేయడమెలా అన్న టెక్నాలజీని వెంకట్ కనిపెట్టాడు….
మనోజ్ ఈ మాట చెప్పగానే జరిగిన హత్యలు, వాళ్ళల్లో శారీరకంగా, మానసికంగా ఎలా మార్పు వచ్చిందో అర్ధం అయ్యింది.
కమీషనర్ కూడా కేసు పూర్తిగా అర్ధమయినట్టు రాము వైపు చూసాడు.
కాని వాళ్ళిద్దరి మనసుల్లో ఇక ముందు ముందు ఏం జరగబోతుందో అన్న అందోళన స్పష్టంగా కనిపించింది.
మనోజ్ : కాని వెంకట్ బ్యాడ్‍లక్ ఏంటంటే ఆ టైంలో ఉన్న CRO మారి నారాయణ కొత్త CROగా అపాయింట్ అయ్యారు….అది వెంకట్ కి నచ్చలేదు….వెంకట్ ఈ రీసెర్చ్ గురించి నారాయణని అప్రూవల్ అడిగినప్పుడు నారాయణ ఒప్పుకోలేదు…దాంతో వెంకట్ ఓపెన్‍గానే నారాయణతో గొడవపడ్డాడు….దాంతో వెంకట్ తన జాబ్‍కి రిజైన్ చేసాడు…ఆ తరువాత ఆ రీసెర్చ్ రిపోర్ట్ పట్టుకుని అప్రూవల్ కోసం మా డిపార్ట్ మెంట్ తాలూకు మినిస్టర్ దగ్గరకు వెళ్ళినా ఆయన కూడా అప్రూవల్ ఇవ్వలేదు…పైగా ఆయన ప్రమోద్‍కి బాగా చివాట్లు పెట్టాడు….
రాము : ఎందుకు….ఆయన ఒప్పుకోలేదు…..
మనోజ్ : ఈ రీసెర్చ్ ద్వారా ఒకరి ఐడెంటిటీని తుడిచేసి…ఇంకొకరి శరీరంలో బ్రతకాలనుకోవడం చాలా తప్పు…వెంకట్ రీసెర్చ్ వలన ఒకతను ఇంకా కోమాలోనే ఉన్నాడు….అది వెంకట్ తన రిపోర్ట్ లో చూపించలేదు…ఈ రీసెర్చ్ డీటైల్స్ బయటకు వస్తే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నది…అందుకని మినిస్టర్ ఈ రీసెర్చ్ ని నారాయణ చేత బ్యాన్ చేయించారు….ఆ తరువాత వెంకట్ మాకు ఎవరికీ ఫోన్ చేయలేదు, కనిపించలేదు….కాని ఒకరోజు మాత్రం చనిపోయాడన్న వార్త మాత్రం మాకు చేరింది….(అంటూ రాము వైపు చూసి) ఇప్పుడు మీరు చెప్పిన ఈ కేసుల్లో వివరాలను బట్టి వెంకట్ ఈ రీసెర్చ్ లో సక్సెస్ అయి ఉండాలి…అంటే మృత్యువుని జయించి ఉండాలి….
ఆ మాట వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా ఆందోళన పడిపోయారు.
ప్రసాద్ : నిజంగా అది సాధ్యమేనా సార్….
మనోజ్ : అది అతన్నే అడగాలి ప్రసాద్ గారు….

2 Comments

Add a Comment
  1. Anna story super ga undhi apakunda continu cheyandi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *