రాములు ఆటోగ్రాఫ్ – 45 64

రాము : సరె….నువ్వు ఇక వెళ్ళు…..

దాంతో ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయింది.
రాము అక్కడ టీపాయ్ మీద పేపర్ తీసుకుని చదువుతున్నాడు.
పది నిముషాల తరువాత సుభద్ర స్నానం చేసి బయటకు వచ్చింది.
సుభద్ర బయటకు రాగానే ఇంతకు ముందు నారాయణ చనిపోయినప్పుడు చూసినప్పుడు పెద్దగా పట్టించుకోలేదు.
కాని ఇప్పుడు సుభద్రని చూస్తుంటే చాలా అందంగా కనిపిస్తున్నది.
హెడ్‍బాత్ చేసి రావడంతో సుభద్ర చాలా అందంగా కనిపిస్తున్నది.
ఆమెను చూడగానే రాముకి ఇందాక పనిమనిషి చెప్పిన విషయాలు గుర్తుకొచ్చి రాము తన మనసులో, “ఇంత అందమైన ఆడది….మగాడికి దూరంగా ఎలా ఉంటుందో అర్ధం కాలేదు….” అని ఆలొచిస్తుండగా సుభద్ర దగ్గరకు వచ్చింది.

సుభద్ర : ఏంటి సార్….ఎప్పుడొచ్చారు….

రాము : ఇప్పుడే పది నిముషాలు అయింది….(అంటూ సుభద్రని పైనుండి కింద దాకా కన్నర్పకుండా చూస్తున్నాడు.)

సుభద్ర : సరె….ఇంతకు ఇక్కడకు వచ్చిన విషయం ఏంటి….(అంటూ రాము తనను అలా కన్నార్పకుండా చూస్తుంటే ఇబ్బందిగా తన పైటని సర్దుకున్నది.)

రాము : ఏం లేదు….మీతో కొంచెం మాట్లాడాలి…..

సుభద్ర : చెప్పండి….(అంటూ రాము ఎదురుగా ఉన్న సింగిల్ సీట్ సోఫాలో కూర్చున్నది.)

రాము : మీ ఆయనకు వెంకట్ అని ఎవరైనా తెలుసా…..

సుభద్ర : హా…హా….వెంకటే కదా….ఆయన మా ఆయనతో కలిసి పని చేసేవారు.….అప్పుడప్పుడు మా ఇంటికి కూడా వస్తుంటారు…

రాము : చేసేవారు అంటే…ఇపుడు చేయడం లేదా….

సుభద్ర : అతను జాబ్ మానేసారు….

రాము : అవునా….ఎందుకు….

సుభద్ర : అది నాకు తెలియదు రాము గారు….మీరు రీసెర్చ్ సెంటర్‍లో అడిగితే తెలియొచ్చు….

రాము : ఓకె థాంక్స్ సుభద్ర గారూ…వెళ్ళొస్తాను…

సుభద్ర : అలాగే రాము గారూ….

రాము ఇంటి నుండి బయటకు వచ్చి తన స్టేషన్‍కి వచ్చాడు.

రాము : ప్రసాద్….ఇలా రా….

ప్రసాద్ : ఏంటి సార్….

రాము : నాతో రా…క్లూ దొరికేట్టున్నది….

ప్రసాద్ : అలాగే సార్….

ఇద్దరూ కలిసి న్యూరాలజీ రీసెర్చ్ సెంటర్‍కి వెళ్ళి అక్కడ ఆఫీసర్‍ని కలిసారు.

అక్కడ ఆఫీసర్‍తో మాట్లాడుతుండగా ఒకతను వచ్చి ఒక ఫోల్డర్ ఇచ్చి వెళ్ళాడు.

ఆఫీసర్ ఆ ఫోల్డర్‍ని రాము చేతికి ఇచ్చి, “ఇది పోయిన ఏడాది జరిగిన సెమినార్ బ్రోచర్….అందులో లెఫ్ట్ సైడ్ ఉన్నది నారాయణ, పక్కనే ఉన్న అతను వెంకట్…అతని గురించే మీరు అడిగింది,” అన్నాడు.

రాము ఆ ఫోల్డర్ తీసుకుని అందులో ఉన్న ఫోటోలు చూస్తున్నాడు.

రాము వెంటనే అందులో ఉన్న లెటర్ హెడ్ తీసుకుని దాని మీద ఉన్న వెంకట్ సంతకంతో తన దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్‍లో సతీష్ పెట్టి కొట్టేసిన వెంకట్ సంతకాన్ని మ్యాచ్ చేసుకుని చూసుకున్నాడు.

రెండు ఒకేలా ఉండటంతో రాము చాలా ఆనందపడిపోయాడు.

కేసుకు సంబంధించిన ముఖ్యమైన క్లూ బయటకు రావడంతో మనసులో పెద్ద భారం దిగిపోయినట్టు ఫీల్ అయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *