రాములు ఆటోగ్రాఫ్ – 39 63

కరుణ : ఆయ్యో….వాడికి పెళ్ళి ఆలోచన కూడానా మామయ్యా….వాడికి ఆఫీస్, ఫ్యాక్టరీ ఉంటే చాలు….ఒక్కోసారి అక్కడే పడుకుండి పోతాడు కూడా….ఇక పెళ్ళి ఆలోచన కూడానా…..
రాము : సరె….అయితే ఈ టాపిక్ తరువాత మాట్లాడుకుందాం….
రేణుక : సరె…నువ్వు రెండేళ్ళ తరువాత అంటున్నావు కాబట్టి…నేను నీకు తగ్గ అమ్మాయి కోసం వెదుకుతుంటాను… ఎవరైనా అమ్మాయి నాకు నచ్చితే వెంటనే పెళ్ళి చేసుకోవాలి….సరెనా…..
రాము : ముందు అమ్మాయి దొరకాలి కదా….అయితే ఒక్క కండీషన్….
రేణుక : ఏంటది…..
రాము : నేను చేసుకోబోయే అమ్మాయి….అచ్చం నువ్వు వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండే దానివో….ఎలా బిహేవ్ చేసేదానివో అచ్చం నీలాగే ఉండాలి….లేకపోతే చేసుకోను….సరేనా….(అంటూ తన చేతులతో రేణుక బుగ్గలను చిన్నగా నిమురుతూ నుదురు మీద ముద్దు పెట్టుకుని) సరె….ఇక వెళ్ళొస్తా….టైం అవుతుంది….
రాముకి తన మీద ప్రేమ ఏమాత్రం తగ్గలేదని తెలుసుకున్న రేణుక చాలా సంతోషపడిపోయింది.
రాము ముగ్గురికీ బై చెప్పి అక్కడనుండి వెళ్ళిపోయాడు.
రాము అలా రేణుకతో మాట్లాడే సరికి పద్మ, కరుణ కూడా చాలా హ్యాపీగా ఫీలయ్యారు.

ఆరోజు మామూలుగా రాము తన ఆఫీస్ కి వెళ్ళి తాను చూడాల్సిన కేసు ఫైల్స్ స్టడీ చేస్తున్నాడు.

కొద్దిసేపటికి ప్రసాద్ కూడా స్టేషన్ కి వచ్చి రాముకి సెల్యూట్ చేసి, “ఏంటి సార్….అంత దీర్ఘంగా చూస్తున్నారు,” అనడిగాడు.
రాము ఒక్కసారి ప్రసాద్ వైపు చూసి నవ్వుతూ, “ఏమున్నది ప్రసాద్….మనం చూడాల్సిన కేస్ డీటైల్స్ చూస్తున్నాను,” అంటూ ప్రసాద్ ని కూర్చోమని సైగ చేస్తూ ఆ కేసు ఫైల్ ని అతని ముందుకు తోసాడు.

ప్రసాద్ ఆ ఫైల్ తీసుకుని స్టడీ చేస్తున్నాడు.
ఇక్కడ వీళ్ళీద్దరూ కేసు గురించి డిస్కస్ చేసుకుంటున్నారు.
*****
అదే నగరంలో ఒక ఏరియాలో ఒక భవనం ముందు చావు మేళం మోగుతున్నది.
అందరూ చాలా విచారంగా చనిపోయిన అతని గురించి మాట్లాడుకుంటున్నారు.
అంతలో ఒకతను వచ్చి అక్కడ కూర్చున్న ఒకాయనతో, “సార్….ఇక్కడ డాక్టర్ అని రాసి ఉన్నది…ఈయన హాస్పిటల్ లో డాక్టరా…లేకపోతే phd చేసిన డాక్టరా….ఇక్కడ సంతాపం తెలిపే బోర్డ్ మీద ఏమని రాయాలి,” అనడిగాడు.
దానికి చైర్ లో కూర్చున్న అతను, “ఏమయ్యా….చనిపోయిన వ్యక్తి చాలా పెద్ద మనిషి…సైంటిస్ట్…చాలా ప్రయోగాలు చేసాడు….ప్రెసిడెంట్ అవార్డ్ కూడా నామినేట్ అయ్యాడు….అందుకని అందరికీ అర్ధమయ్యేలా క్లియర్ గా రాయి….” అన్నాడు.
“సార్….ఇక్కడా నాకు ఇచ్చిన పేపర్ మీద డిగ్రీలు చాలా ఉన్నాయి….బోర్డ్ మీద అన్ని డిగ్రీలు రాయాలా…లేకపోతే డాక్టర్ అని రాస్తే చాలా,” అనడిగాడు.
దానికి కుర్చిలో అతను సమాధానం చెప్పేలోపు అక్కడకు ఒకతను చనిపోయిన వ్యక్తికి దండ వేయడానికి వచ్చిన అతను, “ఏయ్….” అంటూ బోర్డ్ రాసే అతని దగ్గరకు వచ్చాడు.
దాంతో బోర్డ్ రాసే కుర్రాడు దండ పట్టుకున్న అతని వైపు తిరిగి, “చెప్పండన్నా….” అన్నాడు.
“రేయ్….అంతా క్లియర్ గా రాసిచ్చాను కదా….అలాగే రాయి,” అన్నాడు.
బోర్డ్ రాసే కుర్రాడు మళ్ళీ ఒకసారి పేపర్ చూసుకుని, “అలాగే అన్నా…” అంటూ అక్కడ నుండి వెళ్ళీపోయాడు.
దండ పట్టుకున్న అతను, “ఇక వెళ్ళి….బోర్డ్ సరీగా రాయి,” అంటూ తన చేతిలో దండ పట్టుకుని శవం దగ్గరకు వెళ్ళి తన చేతిలో ఉన్న దండని శవం ఉన్న గాజు ఐస్ బాక్స్ మీద పెట్టాడు.
ఒక్కసారి ఆ సైంటిస్ట్ శవాన్ని ఒక్క సెకను బాధగా చూసి అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
అతను అంత పెద్ద దండ తీసుకొచ్చి సైంటిస్ట్ మీద వేసే సరికి అక్కడ కూర్చున్న వాళ్ళల్లో ఒకావిడ పక్కన ఉన్న ఆవిడతో, “ఏమ్మా….అతను ఎవరు,” అని చనిపోయిన సైంటిస్ట్ భార్యని అడిగింది.
దానికి ఆమె, “అతను మా ఆయన జిమ్ ట్రైనర్ అశోక్…ఆరు నెలల నుండి ఆ అబ్బాయి మా ఆయన పక్కనే ఉండి అన్ని విషయాలు దగ్గరుండి చూసుకునేవాడు,” అన్నది.
జిమ్ ట్రైనర్ అశోక్ సైంటిస్ట్ శవం దగ్గర నుండి బయటకు వచ్చి జేబులో ఉన్న మోర్ సిగరెట్ తీసి కాల్చి ఒక్కసారి గుండెల నిండా గాలి పీల్చి సైంటిస్ట్ భవనం వైపు చూసి వదిలాడు.
ఒక్క నిముషం ఆ భవనం వైపు చూసి సిగిరెట్ తాగుతూ అక్కడ నుండి వెళ్ళిపోయాడు.
******
ఆరోజు సాయంత్రం రాము, ప్రసాద్ ఎప్పటిలాగే కాఫీ ఫాప్‍లో కూర్చుని మాట్లాడుకుంటున్నారు.

ప్రసాద్ : సార్….ఒక్క విషయం అడగనా…..
రాము : అడుగు ప్రసాద్….ఏంటి….
ప్రసాద్ : ఎవరైనా స్టేషన్‍లోనో….లేకపోతే ఆఫీస్‍లోనో కేస్ డిస్కస్ చేస్తారు….మీరు ఎప్పుడు చూసినా కేస్ డిస్కషన్ కాఫీ షాప్‍లో పెడతారేంటి….
రాము : నాకు అక్కడ కూర్చుంటే మూడ్ రావడం లేదు ప్రసాద్….ఎప్పుడు చూసినా అవే మొహాలు…వెధవ రౌడీ షీటర్లు….వాళ్ళ మొహాలు చూసి చూసి విసుగొచ్చేసింది…అదే కాఫీ షాప్స్ లేకపోతే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ అనుకో….కళ్ళకు చాలా ఎక్సర్‍సైజ్ కూడా….అందమైన అమ్మాయిలు చాలా మంది కనిపిస్తుంటారు…వాళ్లను చూస్తే చాలు మైండ్ ఫ్రెష్ అయిపోతుంది….
ప్రసాద్ : ఒక రెస్పాన్స్ బుల్ జాబ్‍లో ఉండి ఇలా అమ్మాయిల కోసం చేయడం తప్పు కదా సార్….
రాము : నేను ఎవరినీ బలవంతపెట్టడం లేదు ప్రసాద్….అమ్మాయి ఇష్ట ప్రకారంతోనే చేస్తున్నాను…ఎవరినీ నా హోదా చూపించి భయపెట్టడం లేదు…ట్రై చేస్తున్నా…అమ్మాయికి ఇష్టం అయితే రెస్పాన్స్ ఇస్తుంది…లేకపోతే ఇంకొ అమ్మయిని ట్రై చేద్దాం…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *