యుద్ధ నీతి 204

మాన్వితా దాదాపుగా ఏడుస్తూ స్వీకృత్ గారూ మీరు నాకు తోడబుట్టిన అన్నయ్యలాంటి వారు . . .ఏదో విధంగా వారి క్షేమ సమాచారాలు కనుక్కోండి.
హవ్యక్ ఏమీ మాటాడకుండా కూచొని ఇద్దరి మాటలూ వింటున్నాడు.
స్వీకృ త్ కాసేపు ఆలోచించి ఈ దీవిలో నాకు తెలిసిన కొంత మంది మిత్రులు ఉన్నారు. వారు కూడా పోర్చుగీసు సైన్యంలో పని చేసిన వారే. . .వీలు చూసుకొని మిమ్మల్ని వారితో పరిచయం చేస్తాను. వారు ఏదైనా సహాయం చేస్తారేమో కనుక్కొందాం సరేనా మీరు కాస్త రెస్ట్ తీసుకోండి.
హలో హవ్యక్ ఈ ఐల్యాండ్ చాలా అందమైనది. ఇక్కడ నీవు బాగా ఎంజాయ్ చేయ వచ్చు గొ అహెడ్ అంటూ కన్ను గొట్టాడు.
హవ్యక్ పేలవంగా నవ్వి ఊరుకొన్నాడు.
స్వీకృత్ లోపలకెళ్ళి ఇద్దరికీ బట్టలిచ్చి ఒక రమ్ము బాటలును తీస్కొని వరండాలో కూచొంటూ వంటవాళ్ళకు ఫుడ్ ఆర్డర్ చేసాడు.
మాన్విత హవ్యక్ లిద్దరూ ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి టేబల్ పైన ఘుమ ఘుమలాడుతున్న వంటకాలు వీరిద్దరి కోసం ఎదురు చూస్తున్నాయి.
స్వీకృత్ ఇద్దరికీ చెరో పెగ్ ఆఫర్ చేసాడు.మాన్విత మొహ మాడుతోంటే ఏం పరవాలేదు. మీరు కూడా హై ర్యాంక్ అఫీషియల్సే కదా అలవాటు తప్పకుండా ఉంటుంది.కొద్దిగా తీసుకోండి కొద్దిగా రిలాక్స్ అవుతారు. హవ్యక్ కు మీ ముందర తీసుకోవడం మీకు అభ్యంతరం ఐతే అతనికి నేను ఆఫర్ చేయను అన్నాడు.
మాన్విత హవ్యక్ వైపు చూసింది. హవ్యక్ ఏం మాట్లాడకుండా గ్లాసును తీసుకొని చిన్నగా సిప్ చేసి ఫుడ్ తిన సాగాడు.
మాన్వితకు కొద్దిగా బెరుకు పోయింది. తనూ ఒక సిప్ తీసుకొని ఫుడ్ ను తీసుకొనసాగింది.

సుకృతకు ఆశ్చర్యంగా అనిపించింది. తాము స్పృహ లో లేనప్పుడు చేతులు కాళ్ళు కట్టేసి ఇప్పుడేమో తిండి బట్ట ఇస్తున్నారు.అదే మాట నాన్న తో అడిగింది.
ఆయన నిట్టూర్చుతూ. . ఇదంతా ఓ గేం . . .మనల్ని యుద్ద ఖైదీలుగా పట్టుకొన్నామని చెప్పి ప్రభుత్వానికి మెసేజీ పంపిస్తారు. మనలాగా చాలా మందినే పట్టుకొని వచ్చుంటారు.
సుకృత:- అంటే మనల్ని కిడ్నాప్ చేసారంటారా?
చేసింది కిడ్నాపే అయినా, యుద్ధ ఖైదీలుగానేప్రకటించుకొంటారు.
సుకృత:- మీరైతే ప్రభుత్వ ఉద్యోగి మరి అమ్మా వాళ్ళని ఎలా అని ప్రకటిస్తారు?
గూఢాచారులుగా. . .అందుకే ఇంటిని అలా ధ్వంసం చేసి పట్టుకొచ్చారు.
సుకృత:- మరి ఇప్పుడు మీ నుండి ఏం ఆశిస్తున్నరు నాన్నా. . .ఆమె అడిగిందేదో ప్రభుత్వానికి చెప్పేస్తే మనల్ని వదిలేస్తారు కదా
లాభం లేదమ్మా . . .అదంతా ట్రిక్, నేను ప్రభుత్వానికి చెప్పినా చెప్పక పోయినా వీరు మనల్ని అంత సులువుగా వదలరు.సైనిక రహస్యాలను తెలుసుకోవడానికే ఇదంతా . . .అవసరమయితే నన్ను చంపినా చంపేయ్యవచ్చు.
సుకృత ధీర్గత్లిద్దరూ ఆందోళనగా చూసారు ఆయన మాటలకు.
ఆయన పిల్లలిద్దరినీ భయపడవద్దంటూ ధైర్యం చెబుతూ చూద్దాం ఏదైనా దారి దొరుకుతుందేమో?అంటూ కళ్ళు మూసుకొన్నాడు.
ఆయన కళ్ళు మూసుకోగానే భారీ అకారాలతో ఉన్న ఇద్దరు ఆడవాళ్ళను వెంటబెట్టుకొని వచ్చింది.
అందులో తెల్ల సీమ అందిలా ఉన్న ఒకామె సుకృత వైపు కొరా కొరా చూసింది,
సుకృతకు ఆమె చూపులు చూడగానే గుండెలు జారిపోయాయి.
Gen.Haldana ronalds వచ్చీ రాంగనే, మిస్టర్ పాణి మా ఆథిత్యం నచ్చిందా? ఏం నిర్ణయించుకొన్నారు?.అని అడిగింది ఎదురుగా కుర్చీలో కూచొంటూ
పాణి తల ఆడ్డంగా తిప్పుతూ. . . చూడండి జనరల్ నేను కూడా కల్నల్ ర్యాంక్ లో ఉన్నవాడినే . . .నా వల్ల మీ పని ఎంతవరకు జరుగుతుందో మీరు ఇప్పటికే ఊహించి ఉంటారు. ఆ రకంగా మీరు నా నుండి ఏం ఆశిస్తున్నారో అర్థం చేసుకోలేనంతటి వెర్రి వాడిని కాదు. మీకు కావాల్సింది సైనిక రహస్యాలు. నేరుగా ఆ విశయం అడక్కుండా ఈ డొంక తిరుగుడు మాటలెందుకు చెప్పండి అన్నాడు.
Gen:- శెహబాష్ పాణి గారు. . .మీరు చాలా స్మార్ట్,మీ గురించి నేను చాలా తక్కువగా ఊహించాను. నీవన్నట్టుగా మాకు కావాల్సింది అదే . . .ఇప్పుడు మా అంతరంగం అర్థం అయ్యింది కదా ఇపుడు చెప్పండి.
పాణి :-సారీ జనరల్ నేను చెప్పేదేమీ లేదు. మీరు ఇంకోరిని చూసుకోవడం మంచిది.
ఆమె దవడలు బిగిస్తూ. . . చూడండి పాణి గారూ మీ నుండి అ రహస్యాలు ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసు అలా అని మిమ్మల్ని శారీరకంగా చిత్ర హింసలకు గురి చేయను. మానసికంగా కృంగదీస్తాను. మీనోటి వెంటే ఆ రహస్యాలు చెప్పిస్తాను. బహుశా నా గురించి వినే ఉంటారు.
పాణి :- ఆ. .. . విన్నాను ఏదో పిచ్చాసుపత్రి నుండి పారిపోయి వచ్చి, ఇక్కడ మనుషులను చంపుకు తింటున్నవని
ఆమె పాణి దవడ వాచిపోయేలా కొట్టి ఈడియట్ నన్ను పిచ్చిదంటావా. . .మీ దేశం నీకెలా ముఖ్యమో నా దేశం నాకూ అలానే కదా ఎప్పుడు నేర్చుకొంటార్రా మీ ఇండియన్స్. నీతో మాతలనవసరం, నీకు నీవుగా నోరు విప్పేంతవరకూ మాన్సికంగా మా వాళ్ళు నిన్ను పీల్చుకు తింటారు. గాల్స్ కమాన్ . . . ఈ పొగరు బోతును ముందు టిఫిన్ తో మొదలు పెట్టి ఆ తరువాత భోజనాలు ఏర్పాటు చెయ్యండి అని ఆర్డర్ చేసి వెళ్ళి దూరంగా కూచొంది.
సుకృత ధీర్గత్ లిద్దరూ బిగుసుకుపోయి చూస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *