యుద్ధ నీతి 204

అది 1990 సం.భారత దేశానికి బ్రిటీష్ పాలన ముగిసినా ఇంకా అక్కడక్కడ పోర్చుగీసు వారి పాలనలో కొన్ని ప్రాంతాలు పరాయి పాలనలోనే ఉన్నాయి. స్వతంత్ర్య భారతం వాటిని కూడా చేజిక్కికొనేందుకు వ్యూహాలు పన్నుతూ ఉంటోంది.
అందులో భాగంగా అప్పటి విశాఖ లో నేవీ లో ఉన్న కల్నల్ పాణిని పోండాలో ఉన్న సైన్యాలకు నేతృత్వం వహించాల్సిందిగా కోరుతూ ఉత్తర్వులు రావడంతో కుటుంబం తో సహా పాణి గోమాంతక్ (గోవా) లో ఉన్న పోండా దగ్గరలో ప్రభుత్వ తనకు కేటాయించిన విల్లాలో దిగిపోయాడు. పాణి తెలుగు వాడే ఐనా రాయల్ ఆర్మీ లోనూ ఇంకా ఇతర దేశాల అత్యవసర పరిస్థితుల్లో పని చేసిన విశేషమైన అనుభవంతో ఉన్నవాడు. ఆయనకు తగ్గట్టుగానే ఆయన భార్య మాన్విత వారి ముగ్గురు పిల్లలు అందరూ విల్లాను సర్దుకొని ఎవరి గదుల్లో వారు కుదురుకొంటున్నారు.పాణి ముగ్గురు పిల్లల్లో ముందు ఇద్దరబ్బాయిలు కవల పిల్లలు, హవ్యక్, ధీర్గత్. మూడో సంతానం సుకృత. ముగ్గురు పిల్లలూ వయసుకొస్తున్నారు. 18 ఏళ్ల సుకృతకు అన్నలిద్దరి దగ్గరా మంచి చనువు ఉన్నది.
అబ్బాయిలిద్దరూ అప్పటి బ్రిటీష్ కల్చరును బాగా వంట బట్టించుకొని పెరిగినవారైనా చెల్లెల్ని మాత్రం గారాబంగా చూసుకొనే వారు. ఎంత గారాబం చేసేవారో అంత ఆటపట్టించేవారు. పిల్లల ఆటపాటల్ని చూసి తల్లి తండ్రులిద్దరూ మురిసిపోయేవారు.
ఉప్పొంగిపోతున్న సముద్ర తీరం వెంట కుండపోతగా కురుస్తున్న వర్షాన్ని చూస్తూ తన విల్లాలో నుండి చేతిలో మందు గ్లాసుతో బయట వరండాలోనికొచ్చి టేబల్ మీద కూచొని సిగరెట్ కాలుస్తున్నాడు.
ఇంతలో మాన్విత కూడ ఓ గ్లాసును చేతిలో పట్టుకొని అతనికి కొద్ది దూరంలో కూచొంటూ మన ఊళ్ళో వర్షాకాలంలో వచ్చే మెరుపులూ ఉరుములూ ఇంత ఉదృతంగా ఉండవు కదండీ అంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *