యుద్ధ నీతి 2 112

వారిని చూసీ చూడనట్లుగానే టేబల్ మీద మందు పెట్టుకొని గార్డ్స్ తెచ్చిన సీ ఫుడ్ మాంసాన్ని తింటూ ముగ్గురూ ఎంజాయ్ చేయసాగారు.
అందులో సుకృతకు క్లోజ్ గా ఉన్న ఒకామె ఒక ప్లేట్ సర్దుకొని తినమన్నట్టుగా సైగ చేసి ఇచ్చింది.
సుకృత భయం భయంగా పాణి వైపు చూసింది. పాణి ఏమీ చెప్పక పోవడంతో ప్లేట్ ను తీసుకొంది.
ఆమె ప్లేట్ ను తీసుకోవడం చూసి ఇంకో ఆమె ధీర్గత్ కూడా ఓ ప్లేట్ అందించింది.
ఇద్దరూ ఆవురావుమంటూ తినడం చూసి ఆ తండ్రి మనసు నొచ్చుకొంది.
ఈలోగా ఓ ప్లేట్ ను పాణి కి కూడా ఇవ్వబడింది.
పాణి :- ఏమిటి జెనరల్ ఏఐనా విశేషమా? ఈ రోజు మాకు ఇంత మంచి ఫుడ్ ఇస్తున్నారు.అంటూ అడిగాడు పాణి.
అవును పాణీ విశేషమే మీ ప్రభుత్వం మీ గురించి మాతో సంప్రదింపులు మొదలు పెట్టింది. కాని చర్చలు విఫలమయ్యాయి. మా సేనలు అరేబియా సముద్రంలో ఉన్న మీ నౌకలను ముంచివేసాయి.సిలోన్ నుండి కారాచి తీర ప్రాంతం వరకూ ఎక్కడా మీ నౌకలు మిగల లేదు. మీ వాళ్ళు రష్యన్ వారితో సహాయమడిగారట. అదే గనుక జరిగితే తొందరలో మిమ్మల్ని విడిచిపెట్టమని ఆర్డర్స్ రావచ్చు. ఈలోగా మిమ్మల్ని బాగా చూసుకొమ్మని అన్నారు.
పాణికి మొహం చింపి చాటంత అయ్యింది. గర్వంగా పిల్లల వైపు చూసాడు.
హాల్దియా కల్పించుకొంటూ అప్పుడే సంతోషపడిపోకు పాణీ. . .మిమ్మల్ని విడిచిపెట్టాలంటే మీరు మీ సైనిక స్థావరాలను చెబితే గాని మిమ్మల్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. ఇక్కడి నుండి ఇటే మిమ్మల్ని మా దేశానికి పార్సెల్ చేయంచగలను.జీవితాంతం జైలు లో మగ్గ వలసి వస్తుంది.
పాణి చేతులు కడుక్కొంటూ చూడండి జనరల్ మీకు ఇందాకే చెప్పాను. నా నుండి ఎటువంటి సమాచారాన్నీ మీరు పొందలేరు.
హాల్దియా నిశా తలకెక్కుతూ ఉంటే నువ్వు భీష్మించుకూచొన్నంత మాత్రాన వదిలేస్తానని అనుకోవద్దు పాణీ . . .నేను ఎంత మంచి దాన్నో అంత చెడ్డదాన్ని. ఇప్పటికే నీ పిల్లలు అపరాధ భావనతో కుమిలిపోతూ ఉంటారు. నీవు మాకు సహకరించని పక్షంలో వారిని జీవితాతం కుమిలిపోయేలా చేస్తాను. ఓ భారతీయుడిగా ఓ మంచి తండ్రిగా నీకు అది పెద్ద శిక్షే అవుతుంది. నేనేం చెబుతున్నానో నీకు అర్థం అవుతోంది కదా
పాణి :- ఆహా . . .బేషుగా అర్థం అవుతోంది.నీ ఇష్టం వచ్చింది చేసుకో . . .నేను ముందే చెప్పాను. కేవలం నా ఇద్దరి పిల్లల భవిష్యత్తు కోసం, నా దేశాన్ని తాకట్టు పెట్టలేను.
సరే . . .సరే. . . కూల్ డవున్ పాణి ,అంత ఆవేశం పనికి రాదు. ఇదిగో ఈ డ్రింక్ తీసుకోండి ఆర్డర్స్ వచ్చేతవరకూ మిమ్మల్ని ఏమీ చేయవాదని మాకు అర్డర్స్ ఉన్నాయి. అంటూ మందు సీసను గ్లాసును చేతికిచ్చింది.
అనుమాంగా చూస్తూ డ్రింక్ చేతికి తీసుకొని ఓ రెండు పెగ్గులేసాడు.
హాల్దియా అతడు మధ్యాన్ని తీసుకొని తీరిగ్గా కూచోవడం చూసి మనసులోనే అచ్చెరువయ్యింది. వారం రోజులుగా హింసిస్తున్నా బాడీ లో స్టామినా తగ్గలేదు. మనిషి నీరసపడలేదు. లోలోపలే అతడి ట్రైనింగ్ కు హ్యాట్స్ ఆఫ్ చెప్పుకొంది.
పాణిని మాటల్లోకి దించుతూ ఏం పాణి గారు, మీ భార్య గుర్తుకు రావడం లేదా అంది కోరగా చూస్తూ. .
పాణి ఆమెను ధీర్గంగా చూసి మీరు చేసిన నిర్వాకం వల్ల వారు ఎక్కడున్నరో తెలియలేదు. మీకు బందీగా ఉన్నానన్న ఒక్క కారణం తప్పితే నాకు నాకుటుంబానికి చేసిన అపకారానికి మిమ్మల్ని ఎటువంటి అవకాశం దొరికినా మీ అందరికీ నరకం చూపించగలను. ఇది ష్యూర్.
హాల్దియా నీవు అంతటి ఘనుడవే పాణి , ఇదిగో ఇంకో పెగ్ తీసుకో అంటూ బాటల్ ను చేతికి అందించి నేను మాత్రం ఏం చేయగలను పాణి నాకు నా గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్స్ ప్రకారమే నడుచుకోవాల్సి వస్తుంది కదా. . .
పాణి మౌనంగా మందు తాగుతూ కూచొన్నాడు.
ధీర్గత్ సుకృతలిద్దరికీ ఆమె పోకడ ఆశ్చర్యం కలిగిస్తోంది.
పాణి కిక్ తలకెక్కుతున్నట్లుగా తూలుతూ లోపల మైండ్ ను బాగా షార్ప్ చేసుకొంటూ హాల్దియా ను అంచనా వేస్తున్నాడు.
హాల్దియా అతడినే గమనిస్తూ కొద్దిగా తూలుతున్నట్లుగా కనిపించగానే ఆడవారిద్దరికీ సైగ చేసి టేబల్ దగ్గర కూచోబెట్టి ఎదురుగా కొన్ని పేపర్లను పెట్టి చక చకా కొన్ని ఫోటోలను తీయించింది.
ఆమె అలా ఎందుకు పోటోలను తీయిస్తోందో అర్థం చేసుకోలేంత మూర్కుడేమీ కాదు. అదీ ఒకందుకు మంచిదేలే అన్నట్టుగా టేబల్ పై తలవల్చుకొని ఉండిపోయాడు.
వాటిని నేరుగా భారత ప్రభుత్వానికి పంపి తను వాళ్లకు లొంగిపోయినట్టుగా చెప్పి బెదిరించడానికి ఇంత నాటకం ఆడుతోందీ ఈవిడ, ఇప్పుడేం చేయబోతోందో అనుకొని అలానే ఉండి ఎదురు చూస్తున్నాడు.
Haaldiyaa పిల్లలిద్దరినీ దగ్గరకు పిలిపించి చూడండి పిల్లలూ మీ నాన్నను ఇలా ఫోటోలు తీసి పంపడం వెనుక మా ఇంటెన్షను ఏముంటుందో మీకర్థం కాదు. అర్థమయినా మీ నాన్న ఏమీ చేయలేడు.కాని మీ ఇద్దరిలో ఒకరిని బయటకు పంపుతాను. మీ నాన్న ఆఫీసులో ఉన్న అత్యంత ముఖ్యమైన ఫైళ్ళను తెచ్చి అందించగలిగితే మిగతా ఇద్దరినీ విడుదల చేయిస్తాను. ఏమంటారు.

ఇద్దరూ మొహాలు చూసుకొన్నారు.ఆమె ఏం చెబుతోందో అర్థం కాలేదు.
సుకృతకు చప్పున పట్టేసింది.అన్నయ్యా ఈమె మాటలు పట్టించుకోవద్దు.ఆమె అడిగినదానికి ఒప్పుకొన్నామో రెంటికీ చెడి ఏ దేశంలోనూ మనకు బ్రతక నివ్వరు. అందుకే నాన్నకు మందు తాపించి పడుకో బెట్టింది.ఇందాకా నాన్న ఇదేగా చెప్పాడు.

Updated: April 24, 2021 — 3:16 am

3 Comments

Add a Comment
  1. Next story plźzzzzz

  2. Whare is next episode

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *