ప్రేమ 267

అన్నట్లుగానే మూడోరోజే ఆ అబ్బాయి రూంలోకి దిగిపోయాడు. అన్నట్లు చెప్పడం మర్చిపోయాను.వాడు రూంలోకొచ్చిన ఐదు రోజుల తర్వాత తెలిసింది. వాడి పేరు “ప్రేమ్ కుమార్ “. మా ఆయన చెప్పినట్లే ,వాడి లోకం వాడిదే.కాలేజీ వెళ్ళడం,రూంకు రాగానే తలుపేసుకుని చదువుకోవడం.వాడు రూంలోకొచ్చి నెల రోజులు గడిచినా,నెల రోజుల్లో వాడు నాతో మాట్లాడిన ఒకే మాట “నమస్కారమక్కా” అదీ నేనెదురుపడినప్పుడే.నెల రోజుల తర్వాత ,ఆదివారం రోజు మాఆయనున్నప్పుడు రెంటు డబ్బులు ఇవ్వటానికి మా పోర్షన్ లోకొచ్చాడు.”బావా రెంటు డబ్బులు “అంటూ మా ఆయనకు డబ్బులిచ్చాడు.మా ఆయన “కూర్చొరా”అనగానే కూర్చున్నాడు.వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతుండగా నేను కొద్దిగా కంటుతూ టీ లు తీసుకెళ్ళి ఇచ్చాను.”ఏమయిందక్కా కుంటుతున్నావు.”అనడిగాడు. వెంటనే మా ఆయన “ఆమెకొక రోగముంది.ఊరికే ఆమె కండరాలు బెణుకుతాయి.ట్యాబ్లెట్లు వేసుకుంటేగాని నొప్పి తగ్గదు.”అని చెప్పాడు. “ఎక్కడ నొప్పిగా ఉందక్కా?”అనడిగాడు. “ఎడమ కాలు మడమ దగ్గర “అని చెప్పాను.”ఈ బెణుకుల గురించి నాకు కొద్దిగా తెలుసు, నేనొకసారి చూడొచ్చా?అని అడిగాడు. నేనెమనలేదు.మాఆయనే “చూడరా బాబు నీకు పుణ్యముంటుంది. “అన్నాడు. నేను కుర్చీలో కూర్చోగానే, నా కాళ్ళ దగ్గర కూర్చొని నా కాలిని వేళ్ళతో మడమ చుట్టూ వత్తి చూశాడు. నాకదోలా ఇబ్బందిగా అనిపించింది. తర్వాత వాడు నా కాలిని పట్టుకుని ఛటుక్కున తిప్పాడు. ఒక్కసారిగా అబ్బా అన్నాను.”ఇప్పుడు నడువక్కా నొప్పిండదు.”అన్నాడు. లేచి నడిచాను.నిజమే నొప్పి చాలా తగ్గింది.”థ్యాంక్స్ రా”అన్నాను. “నేను ఒక ఆయిల్ ఇస్తాను రెండు రోజులు మడమ చుట్టూ రాయక్కా పూర్తిగా తగ్గుతుంది. “అన్నాడు.” తొందరగా ఇవ్వారా బాబు ఈమె బాధ చూడలేకపోతున్నాను.”అన్నాడు మా ఆయన. వాడు వాని రూంలోకెళ్ళి ఒక సీసాలో ఏదో ఆయిల్ తీసుకొచ్చి ఇచ్చాడు.

రోజులు గడుస్తున్నాయి.నా కాలి నొప్పి తగ్గించిన రోజు నుండి వాడి మీదెందుకో కొద్దిగా అభిమానం పెరిగింది. వాడు కనిపించినప్పుడలగల్లా నేనే మాటలు కలుపుతున్నాను.బయటనుండి ఏవయినా తెప్పించుకోవడం,వాడు మార్కెట్ కు వెళ్తున్నప్పుడు వాడి తోనే కూరగాయలు తెప్పించటంలాంటి పనులు చెప్పడం మొదలుపెట్టాను.వాణ్ణి చూస్తే అప్పుడప్పుడు ముచ్చటేసేది.వాడు మా ఆయనతో మాట్లాడేటప్పుడు వింటుంటే ఆశ్చర్యమనిపించేది.వాడు గుండుసూది నుండి రాకెట్ల దాకా, ఆదియుగం నుండి ఈ అణుయుగం దాకా దేని గురించైనా మాట్లాడేవాడు.ఒకవ్యక్తికి ఇన్ని విషయాలు ఎలా తెలుస్తాయబ్బా అనిపించేది. మా ఆయన ఎప్పుడయినా ఊరికెళ్ళాలనుకుంటే రాత్రికి తిరిగొచ్చె విదంగా చూసుకొనెవారు.కాని ఈ మధ్య రాత్రికి రాకపోవచ్చు అని చెప్పెళ్తున్నారు.నేనేమయినా అంటే “ప్రేమ్ గాడున్నాడు కదా ఏం భయం లేదు “.అంటున్నారు. ఒక రోజు నిద్ర లేచేసరికి మెడ కండరాలు పట్టేసుకున్నాయి.ఉదయం పనులు ఎలాగోలా ముగించుకుని డాక్టర్ దగ్గరకు వెళ్ళాను. “నీకిదేమి ప్రాబ్లమమ్మా?పెయిన్ కిల్లింగ్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడకూడదు. ఎవరయినా మస్సాజ్ తెలిసినవాళ్ళుంటే కనుక్కో.ఎక్కడయినా బ్యూటీపార్లర్లో అడుగు మస్సాజ్ తెలిసినవాళ్ళు ఉన్నారేమో.ఇప్పటికయితే రెండు ట్యాబ్లెట్లు తీసుకెళ్ళు.అని అంది.ఇంటికొచ్చి ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాను.సాయంత్రం ఇంటి పనులు చేసుకుంటుంటే నొప్పి అనిపించలేదు కాని మెడ తరగకపోయింది.ముఖం కుడివైపుకే ఉంది. మా ఆయన కోసం ఎదురుచూస్తూ ఉన్నాను.కొద్దిసేపటికి ఆయన్నుంచి ఫోనొచ్చింది.తను ఊరెళ్ళుతున్నానని,రాత్రికి రానని చెప్పాడు. ఏం చేయాలో తెలియలేదు. మెడ కండరాలు పట్టుకున్నాయని ప్రేమ్ గాడితో చెప్పాలనిపించలేదు.రాత్రికి మరో ట్యాబ్లెట్ వేసుకొని పడుకున్నాను.మరుసటిరోజు ఉదయం ఇంటి పనులు చేసుకుంటుంటే ఒకటే నొప్పి, భరించలేకపోయాను.ఇక తప్పదనుకొని వాడి రూం తలుపు తట్టాను.తలుపుతీసి “ఏంటక్కా?”అనడిగాడు. “నిన్న మెడ కండరాలు పట్టేసున్నాయిరా,ప్లీజ్ సరిచేయవా?” అనడిగాను. “సరే, నిన్ననే చెప్పోద్దా?”అంటూ నా వెంట హాల్లోకి వచ్చాడు. “కింద కూర్చో,అక్కా ఆయిల్ ఎక్కుడుంది”.అనడిగాడు. సెల్ఫ్ ల వైపు చూపించాను. సెల్ఫ్ లోనుంచి ఆయిల్ తీసుకొనొచ్చి నా వెనుక కూర్చొని, మెడపైన వేళ్ళతో వత్తితూ చూశాడు. తర్వాత చేతులకు ఆయిల్ అంటించుకొని మడపై మసాజ్ చేశాడు. వాడి స్పర్శ ఏదోలా అనిపించింది. కాని అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను.కొద్దిగా మసాజ్ చేసిన తర్వాత తన రెండు కాళ్ళను నా వీపుకు సపోర్టుగా ఉంచి ఎడమచేతితో నా గదవను పట్టుకొని,కుడి చేతితో మెడను పట్టుకొని ఒక్కసారిగా ముఖాన్ని ఎడమవైపుకు తిప్పాడు. “అమ్మా! “అన్నాను. కాని మెడలో ఏవో కండరాలు ఒకవైపు నుండి మరోవైపుకు జరిగినట్లు అనిపించింది. “ఇప్పుడు మెడ తిప్పి చూడక్కా”అన్నాడు. తిప్పి చూశాను. నొప్పి పోయింది. “థ్యాంక్సురా”అన్నాను. “సరేగాని మూడు రోజులు ఇలా మసాజ్ చేసుకో”అంటూ మెడపైన కొద్దిసేపు మసాజ్ చేసి కాలేజీకి రెడీ కావాలంటూ వెళ్లిపోయాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *