ప్రేమ 396

ఇంటి పైన బట్టలను ఆరెస్తున్నాను.ఎందుకొగాని వాడు కనిపించినట్లయింది.వీధిలొకి గమనించి చూశాను,వాడు కనిపించలేదు.నా భ్రమకు నేనే నవ్వుకుంటూ బట్టలు ఆరేయటంలో నిమగ్నమైయ్యాను.కొద్దిసేపటి తర్వాత నన్నెవరో గమనిస్తున్నట్లనిపించింది.ఆరేసిన బట్టలను కొద్దిగా పక్కకు జరిపి వీదిలోకి చూశాను. అంతే నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను.ఎదురుగా panshop దగ్గర నిల్చొని వాడు నన్నే తదేకంగా చూస్తున్నాడు. నా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి.వాన్నిచూడక ఆరు నెలలపైనే అవుతోంది.అమాంతంగా పరుగెత్తుకెళ్ళి వాన్ని పట్టుకొని తనివితీరా ఏడవాలనిపించింది.ఇన్ని రోజులు ఎక్కడికెళ్లావురా? అని చెడామడా కొట్టాలనిపించింది. ఎలావున్నావన్నట్లుగా సైగలు చేశాడు. బాగున్నానన్నట్లుగా తలూపాను.బయటకు రాగలవా?అన్నట్లుగా సైగలు చేశాడు. టైం పడుతుంది అని సైగ చేశాను. సరే అన్నట్లుగా సైగలు చేశాడు. అంతే తొందరగా బట్టలు ఆరేసి కిందికి ఇంట్లోకి వెళ్ళి ఆదరబాదరగా బట్టలు మార్చుకొని, “అమ్మా శ్రావణి దగ్గరికి వెళ్తున్నాను”.అని చెప్పి బయటికి వచ్చాను. వాడు నా కోసమే చూస్తున్నాడు. నేను కొద్ది దూరం వెళ్ళిన తరువాత బైక్ తీసికొచ్చి నాపక్కన ఆపగానే ఎక్కి కూర్చున్నాను.ఊరి బయటికి తీసుకెళ్ళి ఒక చెట్టుకింద ఆపాడు. బైక్ దిగగానే వాణ్ణి గట్టిగా కౌగిలించుకొని నా బాధ తీరేవరకూ ఏడ్చాను.కొద్దిగా తేరుకున్నాక “సంగీతక్కా! ఇది ఎలా జరిగింది ? ఎప్పుడు జరిగింది? అని అడిగాడు. “నీకు తెలుసుకదరా కంపెనీ లో యాసిడ్* కాళ్ళ మీద పడిన తరువాత అయిన ఆరోగ్యం కుదురుకోలేదు.ఎన్ని హాస్పిటల్లు తిరిగినా శరీరం విషపూరితం ఎక్కువవుతూనేవుంది.ఈ రోజుకు43 రోజుల క్రితం హాస్పిటల్ లోనే ప్రాణాలు వదిలారు”.అని ఏడుస్తూ చెప్పాను.కొద్ది సేపటి తర్వాత”సంగీతక్కా! నిన్నోకటి అడగనా?”అన్నాడు. “చెప్పు”అన్నాను. “మనం పెళ్లి చేసుకుందామా?”అని అడిగాడు. తలెత్తి చూశాను.”బాగా ఆలోచించే అడుతున్నాను.నీవు కూడా ఆలోచించి చెప్పు.”అన్నాడు. కొద్దిసేపటికి తనే వెళ్దామా అని లేచాడు.

క్ పై తీసుకొచ్చి వీది చివరలో వదిలేస్తూ “నేను మూడు రోజులుంటాను.ఆలోచించి నీ నిర్ణయం చెప్పు.నేను వస్తాను .”అని చెప్పి వెళ్లిపోయాడు.ఇంటికి వెళ్లినతరువాత ఏ పని చేయాలనిపించలేదు.తలనొప్పిగా ఉందని అమ్మకు చెప్పి రూమ్*లోకెళ్ళి పడుకున్నాను. మనసంతా వాడి ఆలోచనలే .వాడిలా అడిగాడేంటి?వాడంటే నాకూ ఇష్టమే,ఇష్టమా?వాడంటే పిచ్చి,వాడంటే పిచ్చి ప్రేమ,పిచ్చి అభిమానం. అసలు వాడు నాకు పరిచయమవ్వడమే నా అదృష్టం. కానీ దురదృష్టం నాకు పెళ్ళయిన సంవత్సరంనర తరువాత పరిచయమయ్యాడు. సుమారుగా మూడున్నర సంవత్సరాల క్రింద **********************

******ఒకరోజు మా ఆయన ఒకబ్బాయిని ఇంటికి తీసుకొచ్చాడు. వంటింట్లో ఉన్న నన్ను బయటికి పిలిచి ఆ అబ్బాయిని చూపిస్తూ “సంగీతా వీన్ని గుర్తుపడ్తావా?”అనడిగాడు. నాకు చిరాకేసింది.ఎవణ్ణో తీసుకొచ్చి గుర్తు పడ్తావా అనడగడం నాకు నచ్చలేదు. అయినా ఒకసారి చూసి చూడనట్లు చూసి ముక్తసరిగా “లేదు”అన్నాను. ఆ అబ్బాయి మాత్రం “నమస్కారమక్కా”అన్నాడు. నేను బదులివ్వకుండా వంటింట్లోకి వెళ్లి పోయాను. మా ఆయన “సంగీతా టీ లు తీసుకురా”అని కెకేశాడు.కొద్దిసేపటికి టీ లు తీసికెళ్ళాను.ఇద్దరికి టీ లు ఇచ్చాను.టి తాగుతూ “సంగీతా వీడు ఈ ఊరిలోనే డిగ్రీ జాయినయ్యాడు,రూమ్ కోసం వెతుకుతుంటే మన దగ్గర రూమ్ ఖాళీగా ఉందికదా అని తీసుకొచ్చాను. మన రూమిద్దామా?” అనడిగాడు.” ఎంతమందుంటారు?”అనడిగాను.”నేనొక్కడనే ఉంటానక్కా”అని బదులిచ్చాడు.” “సరే మీ ఇష్టం. కాని ఫ్రెండ్స్ గట్రా ఎవరూ ఎక్కువగా రాకూడదు “.అని చెప్పి వంటింట్లోకి వెళ్దామని సడెన్గా లేచేసరికి మొకాళ్ళలో కలుక్కుమంది.కొద్దిగా కంటుతూ వెళ్ళాను. “ఇంకా నొప్పి తగ్గలేదా?”అని మా ఆయన అడిగాడు. “లేదు “.అన్నాను.”వీణ్ణి రూమ్*లోకి ఎప్పుడు దిగమంటావో చెప్పు”అన్నాడు. “ఆ అబ్బాయిష్టం,కాని ఎల్లుండి తర్వాత ఎప్పుడైనా రమ్మనండి. రూంలోని సామానంతా సర్దెయాలికదా”అన్నాను. “సరే ..విన్నావు కదరా ఎల్లుండి తర్వాత ఎప్పుడోస్తావురా”అని మా ఆయన ఆ అబ్బాయిని అడిగాడు. “ఈ రోజు ఊరికెళ్ళి ఎల్లుండి బ్యాగ్ తీసుకొని రూం కొస్తాను.”అని ఆ అబ్బాయి బదులిచ్చాడు.కొద్దిసెపటి తర్వాత “శేఖర్ బావా నేనెళ్ళొస్తా”అని చెప్పి ఆ అబ్బాయి వెళ్ళిపోయాడు.ఆ అబ్బాయి వెళ్ళిపోయిన తర్వాత “ఆ అబ్బాయి మంచోడేనా”అని మాఆయన్ని అడిగాను. “వాడు చాలా మంచోడు.వాళ్ళన్న నా క్లాస్*మేట్ “అన్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *