పతి, పత్నీ! 1 181

“400 బస్తాలమ్మా.” అన్నాడతను. “ఇక వెళదామా?” అన్నాడు రవి ఆమెతో. అప్పటికే భోజన సమయం అవ్వడంతో, సరే అని అతనితో బయలుదేరింది. ఆమెని ఇంటి దగ్గర దింపి “ఇక వెళ్ళొచ్చా మేడమ్?” అన్నాడతను. “వెళ్ళొచ్చులే సార్. ఎలాగూ లంచ్ టైమ్, కాస్త కంపెనీ ఇవ్వొచ్చుగా.” అంది. అతను ఆలోచిస్తుంటే, “ఈ రోజు వంట నాదే. కాస్త టేస్ట్ ఎలా ఉందో చెప్పొచ్చుగా.” అంది. అతను బండి పార్క్ చేసి లోపలకి నడిచాడు.

డైనింగ్ టేబుల్ దగ్గర ఆమె ఒక్కోటీ సర్ధుతుంటే అతను ఆమెనే గమనించ సాగాడు. అతనికి ఇందాక మిల్ దగ్గర ఆమె పరిమళం సోకినప్పటినుండీ ఒక విషయం అర్ధం కావడం లేదు. ఎందుకు ఆమె అభ్యర్ధిస్తుంటే కాదనలేకపోతున్నాడూ? నిన్న రాత్రి చూసిన అమ్మాయితో పోలిస్తే, తను ఏ విధంగానూ సరిపోదు. కానీ ఆమె తన పక్కనున్నంతసేపూ ఎందుకు తన మగతనం ఉరకలు వేస్తుందీ? పెద్ద అందగత్తేం కాదూ, అంత ఆకర్షణీయంగానూ లేదు. కానీ వాటికి మించి ఏదో ఉంది. ఏమిటదీ? అతను అలా అలోచనల్లో ఉంటే, ఆమె అతని కళ్ళ ముందు చిటికలు వేసి, “అలోచించింది చాలులే గానీ, కాస్త తిను.” అంది. అతను ఈ లోకం లోకి వచ్చి, కాస్త సిగ్గుపడి తినసాగాడు.
మళ్ళీ ఆశ్చర్యపోయాడు. బంగ్లాలో భోజనంలా ఏ మషాలా వాసనలూ లేవు. కానీ బావుంది. చాలా బావుంది. “ఖచ్చితంగా ఈ అమ్మాయికి ఏదో మేజిక్ వచ్చు.” అనుకుంటూ భోజనం ముగించాడు. అతను బయటకి వెళ్ళబోతుంటే, “ఎలానూ సాయంత్రం వెళతారుగా. అప్పటివరకైనా ఇక్కడ ఉండొచ్చుగా.” అంది ఆమె. ఆమె అన్న మాటల్లో అభ్యర్ధన కంటే, ఒక మంచి సలహా ధ్వనించింది అతనికి. “బయట ఎలానూ ఎండగా ఉంది. మరో రెండు మూడు గంటలు గడిపితే పోలా.” అనుకున్నాడతను. మళ్ళీ అంతలోనే “అంతవరకూ గడిపేదెలా?” అనుకున్నాడు. అతని ఆలోచన గమనించినట్టు “నాతో పేకాట ఆడు.” అంది. అతను నవ్వుతూ “నాతో ఆడితే, నువ్వు ఓడిపోతావ్.” అన్నాడు. “ఓడితే సరే, మరి గెలిస్తే ఏమిస్తావ్?” అంది. ఆమె అడిగిన తీరుకి ముచ్చటేసింది అతనికి. ఎందుకో ఆమెలో ఒక కొత్త అందం కనిపించింది. ఇంతకు ముందు ఎక్కడా చూడని అందం అది. అది స్వఛ్ఛత వలన కలిగిన అందం అని అతనికి తెలీదు. అంతే కాదు, క్రమేపీ ఆమె తనపై పైచేయి సాధిస్తుందీ అన్న విషయం కూడా అతనికి తెలీదు.

ఇద్దరూ డాబా పైన పందిరి కింద చేరారు. అతను పేక దస్తాలు తెప్పించాడు. వాటిని కలిపి పంచబోతుంటే, “ముందు ఎలా ఆడాలో నేర్పు.” అంది ఉష. “ఏంటీ నీకు ఆడడం రాదా !?” అన్నాడతను ఆశ్చర్యంగా. “రాకపోతేనేం, ఇప్పుడు నేర్చుకుంటాగా.” అంది ఆమె. “మ్…ఇప్పుడు నేర్పితే ఇక వచ్చినట్టే.” అన్నాడు పేకలను పక్కన పడేస్తూ. “ముదితలు నేర్వగ రాని విద్యలు గలవే ముద్దార నేర్పగన్…అన్నారుగా. పెద్ద రసికుడవని పేరుందీ, ఆ మాత్రం తెలీదా?” అంది కొంటెగా నవ్వుతూ. ఆ నవ్వునే చూస్తున్నాడతను. ఎందుకో అందంగా కనిపిస్తుంది, కాస్త ఆకర్షణీయంగా కూడా ఉంది. ఒక అరగంటలోనే తన అభిప్రాయం మారిపోయింది. ఎందుకో అతనికే అర్ధం కావడం లేదు. అతని ఆలోచనా స్రవంతికి అడ్డం పడుతూ, “హలో సార్…చెప్పండి…నేర్పుతావా, నేర్పవా?” అన్నది. అతను ఆలోచనల నుండి తేరుకొని, “నేర్పుతా, కాని గురు దక్షిణ కావాలి.” అన్నాడు నవ్వుతూ. ఆమె కూడా నవ్వుతూ “అడగండి గురువు గారూ, ఏమికావాలో.” అంది ఉష. “నిన్న సగంలో ఆపేసిన కథ చెప్పు.” అన్నాడు. ఆమె “హుఁ..” అని నిట్టూర్చి, “వేళగాని వేళలో ఏ పనీ చేయకూడదు. శృంగారాన్ని విన్నా, చేసినా నును చీకటి వేళలోనే అందం.” అన్నది. “మ్..అయితే కథ కోసం చీకటి పడేవరకూ ఆగాలన్న మాట. సరే, పడతి మాట శిలాశాసనమే కదా రసికుడికి.” అని నవ్వి, “సరే నీ కథ కోసం వేచివుంటా.” అన్నాడు నవ్వుతూ. “మరి పేకాటో?” అంది ఉష. “అది నీ కథ విన్న తరువాతే.” అని కిందకి వెళ్ళిపోయాడు. అలా వెళుతూ ఉంటే, ఆమె సన్నని నవ్వు తన వీపుపై కితకితలు పెడుతున్న అనుభూతి కలిగింది అతనికి.

తన గదిలోకి వెళ్ళి మంచంపై వెల్లకిలా పడుకొని, ఆలోచిస్తున్నాడతను. తన జీవితంలో ఏదైనా అనుకుంటే వెంటనే పొందడం, అలా పొందక పోతే వదిలేయడమే తప్ప, వేచివుండడం ఎప్పుడూ లేదు. కాని ఉష విషయంలో అలా జరగడం లేదు. చిన్ననాటి నెచ్చెలి కాబాట్టా? లేక వేరేదేమైనా ఉందా? ఎంత ఆలోచించినా జవాబు దొరకడం లేదు అతనికి. అసలు ఇలాంటి సున్నితమైన చేష్టలు అతనికి తెలిస్తేనే కదా జవాబు తెలిసేది. అలా ఆలోచనల అలసట తోనే అతనికి నిద్ర వచ్చేసింది. సాయంత్రం లేచి, స్నానం చేసి, నును చీకట్ల వేళ ఆమె దగ్గరకి వచ్చాడు. అతనిని చూడగానే చిన్నగా నవ్వింది. నును చీకట్ల ప్రభావమో, ఆమె చీరకట్టులో ఉన్న చిత్రమో…మనోహరంగా అనిపించింది ఆమె. వదులుగా ముడేసిన జుట్టూ, అంతే వదులుగా వేసుకొన్న పైటా, బుగ్గలపై అల్లరి చేస్తున్న ముంగురులూ…చేయితిరిగిన చిత్రకారుడి చమత్కారంలా ఉంది ఆమె. అతని చూపులకి కాస్త సిగ్గుపడుతూ “ఏమిటీ, అలా కొత్తగా చూస్తున్నావ్?” అన్నది. అతను కూడా సిగ్గుపడి “ఏం లేదు. మరి మొదలు పెడతావా?” అన్నాడు. ఆమె మొదలు పెట్టింది.

5 Comments

Add a Comment
  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *