పతి, పత్నీ! 1 179

అతను బయటకు వచ్చేస్తుంటే కంగారుగా అడిగాడు రమణ “ఏంటి మిత్రమా! అమ్మాయి బాగోలేదా? ఏమైనా ఇబ్బంది పెట్టిందా?” అని. “అదేం లేదురా, అమ్మాయి చాలా బాగుంది. నాకే మూడ్ లేదు. మీరు ఎంజాయ్ చేయండి.” అని తన బైక్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రవిని చూసి ఆశ్చర్యపోయాడు సీతారాం. కిటికీలోనుండి చూస్తున్న ఉష సన్నగా నవ్వుకుంది.

మర్నాడు అతను లేచేసరికి ఉదయం పది అయ్యింది. తయారయ్యి బయటకి వెళుతుండగా డాబా పైనుండి చప్పట్లు కొట్టి పిలిచింది ఉష. అతను ఆగగానే, కిందకి పరుగెత్తుకు వచ్చింది ఉష. ఆయాసపడుతూ అడిగింది “నన్నూ తీసుకుపోవచ్చుగా..” అని. “నిన్నే చెప్పానుగా అది నువ్వు రాదగ్గ ప్లేస్ కాదనీ.” అన్నాడతను. “రాత్రి అంటే గానాబజానా. మరి ఇప్పుడో?” అంది కొంటెగా. “ఓన్లీ భజన.” అన్నాడతను నవ్వుతూ. “అర్ధమయిందిలే. ఎప్పుడూ మగాళ్ళతోనేనా? ఒకసారి నాతో కూడా ఆడొచ్చుగా.” అంది. “అబ్బో! నీకు పేకాట కూడా వచ్చా!” అన్నాడతను ఆశ్చర్యంగా. “ఆడితే కదా వచ్చోరాదో తెలిసేది.” అన్నది ఆమె. అతను నవ్వేసి “సరే, ఆడదాంలే. కానీ నువ్వొచ్చిన పని వేరు కదా.” అన్నాడతను. అర్ధం కానట్టు చూసిందామె. “అదే, ఏదో రైస్ మిల్లూ, చూడాలీ అన్నావ్ కదా.” అన్నాడు. ఆమె నాలుక కరచుకొని “స్..మరచేపోయాను చూసావా! ప్లీజ్ అక్కడకి తీసుకెళ్ళవా.” అంది గోముగా. అతను ఆలోచిస్తూ ఉంటే, “పాత ఫ్రెండ్స్ ఎప్పుడూ ఉండే వాళ్ళేగా. ఒకరోజు వెళ్ళకపోతే ఫరవాలేదులే, ప్లీజ్..ప్లీజ్..ప్లీజ్..” అని బతిమాలసాగింది. ఆమె బతిమాలుతున్న తీరు నచ్చి, సరే అన్నాడతను. ఇద్దరూ మిల్ కి బయలుదేరారు.

మిల్ దగ్గర వాళ్ళ బండి ఆగగానే ఒక వ్యక్తి పరుగెతుకు వచ్చి రవికి నమస్కారం పెట్టాడు. “ఎవరు నువ్వూ?” అన్నాడు రవి. “రైస్ మిల్ మేనేజర్ ని సార్.” అన్నాడు. ఉష రవిని విచిత్రంగా చూసి “అదేంటీ! నీ దగ్గర పనిచేసే మేనేజరే నీకు తెలీదా?” అంది. అతను కాస్త ఇబ్బందిగా చూసి “ఇవన్నీ నాకు పట్టవులే. సరే ఎలాగూ మేనేజర్ వచ్చాడు కదా. అతను అన్నీ వివరంగా చెబుతాడు. మరి నేను వెళ్ళనా.” అన్నాడతను. గబుక్కున అతని చేయి పట్టుకొని “ఎలా వెళతారు సార్? ఇక్కడకి తెచ్చిన వారే మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళాలి.” అంది ఉష. అతను నిట్టూర్చి “సరే, పద.” అని లోపలకి తీసుకు వెళ్ళాడు. మేనేజర్, కూడా వచ్చి అన్నీ వివరించి చెబుతుంటే, “మాకు అనుమానాలేమైనా ఉంటే తరువాత అడుగుతాము. మీరు వెళ్ళి మీ పని చూసుకోండి.” అంది. అతను రవి వైపు చూస్తే, వెళ్ళమన్నట్టు సైగ చేసాడతను. మేనేజర్ వెళ్ళిపోయాడు.

ఇద్దరూ మిల్ అంతా తిరుగుతూ చూడసాగారు. అలా తిరుగుతూ వెనకి వైపుకు వచ్చారు. అక్కడ ఒక గొట్టం నుండి ఊక పడుతుంది. గాలికి ఒక రేణువు రవి కంట్లో పడగానే “హబ్బా..” అంటూ కంటిని నలపబోయాడు. “ఏయ్…నలపకూడదు. ఆగు.” అని అతని దగ్గరకి వచ్చి తన వేళ్ళతో అతని కన్ను తెరచి, సన్నగా ఊదసాగింది. ఆమె అంత దగ్గరికి రాగానే, ఆమె నుండి ఏదో పరిమళం అతని నాసికను తాకింది. అతని జీవితంలో చాలా మంది ఆడవాళ్ళతో పడుకున్నాడు. పది రూపాయల సెంట్ దగ్గరనుండీ, పదివేల రూపాయల సెంట్ వరకూ, అన్ని రకాల పరిమళాలూ తెలుసు అతనికి. కానీ ఆమె నుండి వచ్చే పరిమళం కొత్తగా ఉంది అతనికి. కన్నెతనపు పరువం నుండి వచ్చే స్వఛ్ఛమైన పరిమళమది. అందుకే అతనికి కొత్తగా, ఇంకా చెప్పాలంటే కాస్త మత్తుగా ఉంది. నలకను ఊదేసిన ఉష “మాస్టారూ, అయిపోయింది.” అనగానే, అతను చప్పున సర్ధుకున్నాడు. ఏదో తెలియని వింత అనుభూతి పొందుతున్నాడతను. చప్పున కళ్ళు దించుకున్నాడతను. దానినే ‘సిగ్గు’ అంటారని తెలీదు అతనికి. ఆ అనుభూతిని పదిల పరచుకుంటూ బయటకి వచ్చాడతను ఉషతో పాటూ. అక్కడ లారీల్లో బియ్యం బస్తాలు ఎక్కిస్తున్నారు. మేనేజర్ లారీకి ఎన్ని బస్తాలు ఎక్కిస్తున్నారో ఒక పుస్తకంలో రాస్తున్నాడు. “ఒక లారీకి ఎన్ని బస్తాలు ఎక్కిస్తారు?” కేజువల్ గా అడిగింది ఉష.

5 Comments

Add a Comment
  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *