పతి, పత్నీ! 1 176

అంతే, ఆటోమేటిక్ గా దానికి రుచి వచ్చేసింది.” అంది ఉష. “అంటే ఆ రుచి అంతా, ఒకరికోసం ఒకరు పనిచేయడం వలన వచ్చిందన్నమాట.” అన్నాడు రవి. ఉష నవ్వి “ఒకరికోసం ఒకరు…ఆ మాటే చాలా రుచిగా ఉంది కదూ.” అంది. రవి ఆమె వైపే కన్నార్పకుండా చూస్తున్నాడు. ఆమె కింద కూర్చుని, మోకాళ్ళ మధ్య గడ్డం పెట్టుకొని అతన్నే చూస్తుంది. ఆమె చూపులు ఏదో కవితని చెబుతున్నట్టు ఉన్నాయి. అతని మనసు ఆ కవితని చదవడానికి ప్రయత్నిస్తుంది. కాని ఆమె పైనే వాలి ఉన్న అతని చూపులు, అతని మనసుని చెదరగొడుతున్నాయి. ఆమెతో ఏదైనా మాట్లాడమని గుండె తొందర చేస్తుంది. ఏం చెప్పాలో తెలీక అతని మనసు సతమతమైపోతుంది. ఈ విచిత్రమైన ఫీలింగ్ ని ఏమంటారో తెలియక, మొత్తంగా అతనే ఇబ్బంది పడిపోతూ పైకి లేచి “ఇక వెళదామా?” అన్నాడు. ఆమె తన చేతిని అతని వైపుకి చాచింది. అతను తన చేతిని అందించ గానే, అది పట్టుకొని పైకి లేచింది.

ఇద్దరూ నడవసాగారు. ఉన్నట్టుండి అతను అతను అడిగాడు “నా మీద నీ అభిప్రాయం ఏమిటీ?” అని. తీరా అడిగిన తరువాత తన ప్రశ్న తనకే హాస్యాస్పదంగా అనిపించింది ఎందుకో. అంతలోనే ఆమె జవాబు చెప్పింది “నువ్వు చాలా మంచోడివి.” అని. అతనికి నవ్వొచ్చింది. “ఎందుకు నవ్వుతున్నావూ?” అంది ఉష.
“ఒక అమ్మాయి, ఒక అబ్బాయి ఇలాంటి ప్రదేశంలో వంటరిగా ఉన్నప్పుడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయిని ‘మంచోడూ’ అంది అంటే దానికి రెండే కారణాలు.” అన్నాడు రవి.
“అవునా! ఏమిటవీ?” అంది ఉష.
“ఒకటి, ఆ అబ్బాయితో…నువ్వు చేతకాని వాడివని ఇన్ డైరెక్ట్ గా చెప్పడం.”
ఫక్కున నవ్వి “ఊఁ…మరి రెండోదీ?” అంది ఉష.
అతనూ నవ్వుతూ “ఆ అమ్మాయికి అతనేమైనా చేస్తాడని భయం అయి ఉండాలి.” అన్నాడు.
ఆమె విస్మయంగా చూస్తూ “భయం అయితే, అలా ఎందుకు చెబుతుంది?” అంది.
“ ఎందుకంటే, నువ్వు మంచివాడివి అని ఎవరైనా అమ్మాయి అంటే, ఎంత చెడ్డవాడైనా చెడ్డపని చేయలేడు. అది మగాడి వీక్ నెస్.” అన్నాడు రవి కొంటెగా.
“అబ్బా! నాకు అంత ఎనాలిసిస్ లేదు బాబూ. ఏదో కేజువల్ గా అన్నాను. ఇంతకీ నీ అభిప్రాయం చెప్పు.” అంది ఉష.
“నీ పైనా?” అన్నాడు రవి.
“కాదు, నీ గురించి నువ్వేం అనుకుంటున్నావని?” అంది ఉష. అతను ఆగాడు. ఆలోచించసాగాడు. “అవును, ఇంతకీ నేను మంచోడినా, చెడ్డోడినా…” అని. అతనికే అర్ధంకాక “ఏమో, నాకే తెలియడం లేదు.” అన్నాడు. “సరే, రేపు మనం ఇంటికి వెళ్ళేలోగా నీకే అర్ధమవుతుందిలే, సరేనా?” అంది ఉష. అతను ఆలోచనల్లో పడిపోయాడు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. అడవి కావడంతో చాలా వేగంగా చీకటి అయిపోతుంది. ఒక విశాలమైన ప్రదేశం చూసి ఆగారు. అతను కిట్ ఓపెన్ చేసి, ఒక బేగ్ లాంటిది బయటకు తీసి, రీఎరేంజ్ చేసేసరికి అది ఒక టెంట్ గా మారింది. నాలుగడుగుల వెడల్పూ, ఆరడుగుల పొడవూ, మూడు అడుగుల ఎత్తుతో ఒక చిన్న గుడిసలా ఉంది అది. ముందు భాగంలో ఒక పెద్ద జిప్. దాన్ని ఎరేంజ్ చేసేసరికి పూర్తిగా చీకటి పడిపోయింది. ఉషని లైటర్ అడిగాడు రవి. “ఎందుకూ?” అంది ఉష. “నెగడు వెలిగించాలి.” అన్నాడు రవి. “ఓకే, ఫైవ్ మినిట్స్.” అంటూ ఏదో చేస్తుంది. అతనికి ఆ చీకటిలో ఏమీ కనబడడం లేదు. “ఉషా!” అన్నాడు. “వన్ మినిట్.” అని, కొద్దిసేపటి తరువాత అతని చేతిలో లైటర్ పెట్టింది. నెగడు వెలిగించాడతను. నెమ్మదిగా వెలుగు పుంజుకుంది అది. “లైటర్ ఇమ్మంటే ఇంతసేపూ ఏం చేసావ్?” అంటూ ఆమె వైపు చూసేసరికి అతని మతి మరోసారి పోయింది. త్రీ ఫోర్త్ టైట్ షార్ట్, స్లీవ్ లెస్ టాప్ వేసుకుందామె. అంటే ఇంతసేపు తన ముందు బట్టలు విప్పి, మార్చుకుందన్నమాట. మళ్ళీ జివ్వుమంటున్న నరాలను కసురుకొని “నువ్వు అసలూ..” అన్నాడు పళ్ళబిగువున. పకపకా నవ్వింది ఆమె. ఆమె నవ్వు చూసి “నన్ను మంచి వాడినని అనకు.” అన్నాడు సీరియస్ గా.
“ఎందుకూ?” అంది ఆమె. “ఏమో! మంచోడిలా ఉండనిచ్చేట్టు లేవు నువ్వు. ఎందుకైనా మంచిది, నువ్వు టెంట్ లోపల పడుకో, నేను బయట పడుకుంటా.” అన్నాడు. అతని మాటలకి ఆమె సిగ్గుగా నవ్వుతూ “బయట పడుకుంటే చలి వేయదా?” అంది. “నా పాట్లేవో నేను పడతా. ప్లీజ్ నీకు దణ్ణం పెడతా, లోపల పడుకో.” అన్నాడు. అలా అనడం అతనికే విచిత్రంగా ఉంది. అమ్మాయి కనిపిస్తే ఏదో ఒకటి ఎలా చేయాలా అని ఆలోచించే తను, ఇప్పుడు ఏం చేయకుండా ఎలా ఉండాలా అని ఆలోచిస్తున్నాడు. ఇంతలో ఉష అంది “బయట చలిలో గడపాలంటే…ఉంటే చెలి ఉండాలి, లేదా..” అని నవ్వి “మందైనా ఉండాలి. లేకపోతే కష్టం కదా.” అంది. అతను ఏమనాలో అర్ధంగాక మనసులోనే జుట్టు పీక్కున్నాడు. “ఏ? మందు తెచ్చుకోలేదా?” అంది. అతను లేదన్నట్టు తలఊపాడు. ఆమె కొంటెగా నవ్వి “ఓకే, నేను హెల్ప్ చేయనా, నీ చలి పోగొట్టడానికి?” అంది. అతను ఆశ్చర్యంతో కూడిన ఆశతో చూసాడామెని. “అబ్బో, అంత ఆశ పడకు బాబూ, నేను అన్నది వేరే.” అంటూ తన బేగ్ లోంచి ఒక మందు బాటిల్ తీసింది. ఇక షాక్ అయ్యే ఓపిక కూడా లేక అలా నోరు వెళ్ళబెట్టి చూస్తూ ఉండిపోయాడు అతను. బాటిల్ ని అతని చేతికి అందించింది. అతను ఆలోచిస్తున్నాడు. “ఆలోచించ వద్దు మాష్టారూ, తాగండి.” అంది కళ్ళు ఎగరేస్తూ. “నో, కొన్ని గంటల క్రితమే, ఇక జీవితంలో తాగ కూడదని డిసైడ్ చేసుకున్నా.” అన్నాడు. “అబ్బో, ఎందుకలా!?” అంది ఆమె. “నా కారణాలు నాకుంటాయ్.” అన్నాడు. “సరే నీ ఇష్టం. మరి చలిని ఎలా ఆపుకుంటావు?” అంది ఉష. అతను ఆమె వైపే చూస్తూ, “ఏదైనా వేడిగా కబుర్లు చెప్పు, చాలు.” అన్నాడు. “మ్…అయితే మొన్న ఆపిన కథను చెప్పనా?” అంది. “ఆఁ…చెప్పు చెప్పు.” అన్నాడు.

5 Comments

Add a Comment
  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *