పతి, పత్నీ! 1 182

ఆమె చేతిలో చేయి వేసాడతను. మల్లె చెండుపై చేయి వేసిన అనుభూతి. ఇంతకు ముందెన్నడూ ఆ తాజాదనం అనుభూతి చెందలేదు అతను. అతన్ని ఓరకంట చూస్తూ “ పక్కనే ఉన్న అడవిలో సరదాగా రెండు రోజులు వైల్డ్ జర్నీ చేద్దాం.” అన్నది. “ఓకే, ఏర్పాట్లు చేయమంటాను.” అన్నాడతను. ఆమె నవ్వి “ముందే ఏర్పాట్లు చేసుకుంటే దానిని పిక్నిక్ అంటారు, వైల్డ్ జర్నీ కాదు. నువ్వూ, నేనూ…ఇద్దరమే…” అని, కళ్ళెగరేస్తూ “తీసుకెళతావా?” అంది. అతను చిలిపిగా నవ్వుతూ “రసికులు మాట తప్పరు. ముఖ్యంగా అమ్మాయిలకు ఇచ్చిన మాట.” అన్నాడతను.

ఆమెని ఇంటిదగ్గర వదిలేసి, బైక్ ని పార్క్ చేసి, జీప్ వేసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. పక్కనే ఉన్న టౌన్ కి పోయి, తాళ్ళూ, కేంపింగ్ టెంట్ లూ, బిస్కట్స్, డ్రింక్స్ వగైరా, వగైరా కొని లోపల పడేసాడు. రెండు స్టెఫ్నీలు పెట్టాడు. ఇంకా చిన్నా, చితకా…సాయంత్రం వరకూ షాపింగ్ చేసి, ఫుల్ గా డీసెల్ కొట్టించి, మళ్ళీ ఇంటికి చేరుకున్నాడు. ఫ్రెష్ గా స్నానం చేసి, డాబా పైకి చేరుకొనే సరికి సమయం ఏడు అయింది. డాబా పైన చల్లగాలి పీలుస్తున్న ఉష అతన్ని చూసి నవ్వుతూ, “ ఏంటీ, ఈరోజు గానాభజానా లేదా?” అంది. “రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరాలిగా మనం. అంటే ఎర్లీగా పడుకోవాలి. అందుకే ఈరోజు గానాభజానాకి సెలవిచ్చేసాం.” అన్నాడతను. అతని మాటలకు ఆమె కళ్ళు మెరిసాయి. ఆ మెరుపుకి చంద్రుడు మబ్బుల చాటునుండి బయటకి వచ్చి చూసాడు. ఆ వెన్నెలలో ఆమె కళ్ళే కాదు, ఆమే మెరిసిపోతుంది. ఆమె అందం అతని చూపులకి కాకుండా, మనసుకి అందుతుంది. తనని అలాగే చూస్తూ ఉండిపోయిన అతన్ని చూసి సిగ్గుపడింది ఆమె. ఆ సిగ్గులో మరింత మనోహరంగా కనిపిస్తుంది ఆమె. ఆమెని చూస్తుంటే, ఆడపిల్ల సిగ్గులోనే అసలైన శృంగారం ఉందని అతనికి అర్ధమవుతూ ఉంది. అతను ఎంతసేపటికీ అలానే చూస్తుంటే, “అబ్బా, అలా చూడకు.” అంది. “ఏం? దిష్టి తగులుతుందా?” అన్నాడతను. “కాదు. నా దృష్టి అంతా నీ మీదకే పోతుంది.” అన్నది. “అంటే?” అన్నాడతను చిలిపిగా. ఆమె సిగ్గుపడి తన గదిలోకి పారిపోయింది. అతనికి ఆమెని చూస్తే ముచ్చటేసింది. ఎవరైనా ఒక అమ్మాయిని చూస్తే ఇంతకు ముందు దాహం వేసేది, లేదా మోహం కలిగేది. ఈ ముచ్చటేయడం అనేది అతనికే కొత్తగా అనిపించింది. ఏదో ఉంది ఈ అమ్మాయిలో. “ఏముందీ?” అని అతను ఆలోచిస్తూ ఉండగా, అతని సెల్ మోగింది. అవతలి వైపు రమణ. “మిత్రమా! ఈ రోజైనా త్వరగా వస్తావా?” అని అడుగుతున్నాడతను. “మ్…ఈ రోజుకి ఇక సెలవు.” అన్నాడు రవి. “అదేంటి మిత్రమా! మంచి విదేశీ సరుకు వచ్చింది. మందు కాదు మగువ. థాయిలేండ్ నుండి. చూస్తేనే చాలు. చేసినంత పని అయిపోతుంది. దానితో పాటూ మంచి మందు. కొత్త బ్రాండ్. వాసన చూస్తేనే కిక్ వచ్చేస్తుంది. నువ్వు రావలసిందే.” అన్నాడతను. ఆల్ రెడీ రవి మంచి కిక్ లోనే ఉన్నాడు. ఆ కిక్ ఇంతకు ముందూ ఎప్పుడూ అనుభవించనిది. దానిని పోగొట్టుకోవడం అతనికి ఇష్టం లేదు. “మీరు ఎంజాయ్ చెయ్యండి.” అనేసి కాల్ కట్ చేసి, తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు.

మర్నాడు ఉదయం ఐదు గంటలకే తయారయి పోయి, ఉష గది తలుపులు తట్టి పిలిచాడు. “నువ్వు జీప్ దగ్గర ఉండు. వచ్చేస్తున్నా.” అని అరిచింది గది లోంచి. అతను కిందకి వెళ్ళి జీప్ దగ్గర నిలబడ్డాడు. పది నిమిషాలలో వచ్చిందామె. ఆమెని చూసిన వెంటనే షాక్ అయ్యాడు. కారణం ఆమె జీన్స్ వేసుకొచ్చింది. అది కాదు అతని షాక్ కి కారణం. ఇన్ని రోజులూ నేత చీరల చాటున ఎలా దాచిందో తెలీదు గానీ, ఇప్పుడు జీన్స్ లో ఆమె అసలైన అందాలు స్పష్టంగా తెలుస్తున్నాయి. ఆమె ముఖారవిందం చూసి, భుజాలు గర్వంతో విశాలమయ్యాయి. వాటికి ధీటుగా పొంకంగా అమరిపోయింది కుచద్వయం. అందాన్నంతా దేవుడు అక్కడే పెట్టాసాడన్న కినుకతో నడుము చిన్నబోయింది. అంత సన్నని నడుము ఆ సొగుసుల భారాన్ని మోయలేదని, పాపం దానికి సహాయం అందించడానికి జఘనం విశాల మయ్యింది.

5 Comments

Add a Comment
  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *