పతి, పత్నీ! 1 181

ఎందుకో ఆమెని చూస్తుంటే, పక్క పంచుకోవడం కంటే ముందుగా, మనసు పంచుకోవాలనిపిస్తుంది అతనికి. అదే మాట ఆమెతో చెప్పాడు. ఆమె ఒక్కక్షణం షాక్ అయ్యి, వెంటనే నవ్వేసి, “ఇంతకీ నాలో ఒక వేశ్యని కాకుండా, ఒక స్నేహితురాలిని చూసేట్టు చేసిన ఆ అమ్మాయి పేరేంటి?” అంది. ఈ సారి ఆశ్చర్యపోవడం అతని వంతు అయ్యింది. “అమ్మాయే అని నీకెలా తెలుసు?” అన్నాడు. ఆమె నవ్వి, కాస్త బాధగా “ఒకప్పుడు నేను కూడా అమ్మాయినే కాబట్టి.” అంది. అతను కొద్దిక్షణాలు మౌనంగా ఉండిపోయాడు. అతని మౌనాన్ని వింటూ ఆమె కూడా మౌనంగా ఉండిపోయింది. కొద్దిసేపటి తరువాత “సారీ..” అన్నాడు. అతని మాటలో కాస్త సానుభూతి. అతనెందుకు ‘సారీ’ అన్నాడో ఆమెకి అర్ధమయింది.

“సో, మనం ఇంక ఆ పని చేయలేము. అంతేకదా.” అన్నది వాతావరణాన్ని తేలిక చేస్తూ. “అవును.” అని అతను నవ్వాడు. “ఓకే, మరి ఏం చేద్దామో చెప్పండి.” అంది. అతను ఆలోచించకుండానే “సరదాగా మాట్లాడుకుందామా?” అన్నాడు. అన్న తరువాత అతనికే ఆశ్చర్యం వేసింది. మామూలుగానే మాట్లాడే అలవాటు లేదు అతనికి. మరి ఇప్పుడేంటీ? అతని స్థితి ఆమెకి మాత్రం బాగానే అర్ధమైంది. అందుకే చిన్నగా నవ్వుతూ, అతన్ని మాటల్లోకి దించింది. వాళ్ళ మాటల్లోనే దాదాపు తెల్లారిపోయింది. ఆమె అతనికి తన సెల్ నంబర్ ఇస్తూ, “ఉంచండి. తొందరలోనే మీరు నాకు కాల్ చేసి ఒక న్యూస్ చెబుతారు.” అంది. “ఏమిటా న్యూస్?” అన్నాడు ఆశ్చర్యంగా. “చెప్పేటప్పుడు మీకే అర్ధమవుతుందిలెండి. గుడ్ లక్.” అంది. అతను సరే అన్నట్టు తల పంకించి, “ఇంతకీ నీ వయసు ఇరవయ్యా, ముప్పయ్యా?” అన్నాడు నవ్వుతూ. అమె కూడా నవ్వేస్తూ “అసలు ముప్పై, లెక్కల్లో మాత్రం ఇరవై. సీక్రెట్, ఎవరికీ చెప్పకండి.” అంది. అతను నవ్వుతూ మేడ దిగుతూ ఉండగా ఏదో స్ఫురించి టక్కున ఆగిపోయాడు. నుదిటి మీద కొట్టుకుంటూ “ఇరవై, ముప్పై..” అని రెండు సార్లు అనుకున్నాడు. వెంటనే అతని మొహం కోపంతో ఎర్రబడింది.

రైస్ బేగ్ 50 kg లు అనుకుంటే, నిన్న మేనేజర్ చెప్పినట్టు 400 బస్తాలు ఎక్కిస్తే, మొత్తం ఇరవై టన్నులతో లారీ సేఫ్ గా వెళ్ళుండేది. ముప్పై టన్నులంటే మరో రెండు వందల బస్తాలు దొంగతనంగా ఎక్కించారన్న మాట. అవి ఎలానూ లెక్కల్లో చూపించరు. ఈ లెక్కన ఇంతకాలం ఎంత మేసేసి ఉంటారు? ఈ లెక్క రేపే తేల్చాలి, అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు రవి. కాసేపు నిద్రపోయి లేచేసరికి ఉదయం పది అయ్యింది. స్నానం చేసి, తయారయ్యి, “నాన్నెక్కడా?” అని అడిగాడు ఒక పనివాడిని. మిల్ కి వెళ్ళారని చెప్పాడతను. అప్పుడే అక్కడకి వచ్చిన ఉషని చూసి “మిల్ కి వెళదామా?” అని అడిగాడు. అతనంతట అతను అడగగానే ఆశ్చర్యపోయినా, వెంటనే అతని కూడా బయలుదేరింది.

మిల్ కి వచ్చిన కొడుకుని చూసి నోరు వెళ్ళబెట్టాడు సీతారాం. రవి నేరుగా మేనేజర్ దగ్గరకి వెళ్ళి, “నిన్న లారీలో ఎన్ని బస్తాలు పంపారూ?” అన్నాడు. అతను తడబడుతూ “నా..నాలుగొందలు సార్.” అనగానే, అతన్ని లాగికొట్టి, “ఇప్పుడు చెప్పు.” అన్నాడు కూల్ గా. సీతారాం ఆశ్చర్యపోయి “ఏమయిందిరా?” అన్నాడు. రవి మేనేజర్ నే చూస్తూ “మొత్తం మన మేనేజరే చెబుతాడు నాన్నా.” అని తండ్రితో చెప్పి, మేనేజర్ తో “నువ్వు జాయిన్ అయిన దగ్గరనుండి, ఇప్పటి వరకూ మొత్తం క్లియర్ చెయ్. నా సంగతి తెలుసుగా.” అని తీక్షణంగా చెప్పి బయలుదేరిపోయాడు. ఉష కంగారుగా అతన్ని ఫాలో అవుతూ “ఏమయింది రవీ?” అని అడిగింది. అతను తనకు అర్ధమైన బస్తాల గోల్ మాల్ గురించి చెప్పాడు. అది విన్న ఉష చిలిపిగా నవ్వుతుంది. “ఎందుకు నవ్వుతున్నావ్?” అన్నాడు రవి. “మ్…బాబు గారు సడన్ గా బాధ్యతను చూపించేసరికి నవ్వొచ్చింది.” అంది. అతను నవ్వేసి “నా కళ్ళ ముందే ఫ్రాడ్ జరిగింది. దాంతో నా అహం దెబ్బతింది. అందుకే ఇలా..” అని ఏదో సర్ధి చెప్పబోతున్నాడు గానీ, విషయం అది కాదు అని అతని మనసుకే తెలిసి పోతుంది. మరేమిటా అన్నది అతనికే జవాబు తెలియని ప్రశ్న. “ఏదయితేనేం, మీ నాన్న హేపీ.” అంది ఉష. “నిన్న నువ్వు ఇక్కడకి తీసుకురాకుండా ఉంటే, ఇది జరిగేది కాదు. సో ఇందులో నీకు కూడా భాగం ఉంది.” అన్నాడు. ఉష ఆ మాటలకి నవ్వుతూ, “అవునా! అయితే మరి నాకేం బహుమానం ఇస్తావూ?” అంది. “ఆడపిల్లలు అడగకూడదు. తీసుకోవాలి.” అన్నాడు అతడు కూడా నవ్వుతూ. అమె అతన్నే సూటిగా చూస్తూ “తీసుకోవడం వరకూ ఎందుకూ? అడుగుతా..కానీ, అడిగిన తరువాత మాట తప్పకూడదు.” అంది. “ఓకే, తప్పను.” అన్నాడు అతను అలానే నవ్వుతూ. “ప్రామిస్!?” అని చేయి చాచింది ఆమె.

5 Comments

Add a Comment
  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *