పతి, పత్నీ! 1 181

ఉపోద్ఘాతం:

సీతారాం కి ఒక కొడుకు ఉన్నాడు. అతని పేరు రవి. ఇరవై ఐదు సంవత్సరాలు. డిగ్రీ పూర్తి చేసి బలాదూర్ గా తిరుగుతున్నాడు. కోట్ల ఆస్తికి ఒకడే వారసుడయినా, అలా భాద్యత లేకుండా తిరిగితే, తన తదనంతరం అస్తిని తగలేస్తాడని బెంగ పట్టుకుంది సీతారాంకి. బాధ్యత రావాలంటే పెళ్ళి చేయాలని కొంతమంది పెద్దలు ఇచ్చిన సలహా అతనికి నచ్చింది. అయితే రవి పెళ్ళికి ససేమిరా అంటున్నాడు. అతనికి ఇష్టం లేకుండా పెళ్ళి చేస్తే, వచ్చే అమ్మాయి బ్రతుకు నాశనం అయిపోతుందని అతనికి తెలుసు. కాని కొడుకుకి తప్పనిసరిగా పెళ్ళి చేయాలి. ఎలాగా అని తలపట్టుకొని కూర్చున్న సమయంలో, అతని ప్రాణ మిత్రుడు ప్రసాద్ అతనింటికి వచ్చాడు. అతనికి తన సమస్య చెప్పాడు సీతారాం. “సరే, నేను పోయి అసలు సమస్య ఏమిటో కనుక్కుంటా, ఉండు.” అని ప్రసాద్ వెళ్ళి రవిని కలిసాడు. అతన్ని కబుర్లలో పెట్టి, అసలు విషయం కనుక్కున్నాడు. అతను పెళ్ళి వద్దూ అనడానికి ముఖ్యంగా రెండు కారణాలు చెప్పాడు. 1) ఊరినిండా పాలు దొరుకుతుంటే గేదెను కొనడం అనవసరం. 2) పెళ్ళి చేసుకుంటే ప్రస్తుతం ఉన్న స్వాతంత్ర్యం పోతుంది.

ఈ కారణాలు విన్న అతనికి ఆశ్చర్యం వేయలేదు. ఎందుకంటే జూదం, వ్యభిచారం, మధ్యం…ఈ మూడు అలవాట్లున్న ఏ వ్యక్తి అయినా ఇలానే ఆలోచిస్తాడు. అతని రోగానికి సరైన మందు తన దగ్గరే ఉందని అతనికి తెలుసు. ఆ మందు పేరు “ఉష”. అతని కూతురు. అసలు ఆమెకి రవిని ఇచ్చి పెళ్లిచేయమని, సీతారాంని అడగడానికే వచ్చాడు ప్రసాద్. అతను కాదనడని కూడా తెలుసు. రవితో మాట్లాడిన తరువాత, విషయం మొత్తం సీతారాంకి చెప్పి, అతను అందోళన పడుతుంటే, అతనికి ధైర్యం చెప్పి “నా కూతురిని ఇక్కడకి పంపిస్తాను. ఏదోవిధంగా రవి తనతో ఒక గంటయినా మాట్లాడేటట్టు చెయ్యి. మిగిలిన విషయం తను చూసుకుంటుంది.” అన్నాడు. సీతారాం అంగీకరించలేదు. ఇన్ని దుర్ వ్యసనాలు ఉన్న తన కొడుకుకి అతని కూతుర్ని ఇస్తే, ఆమె సుఖపడదనీ, పైగా అంత రిస్క్ చేయాల్సిన అవసరం ఏముందని అడిగాడు. అయితే, యవ్వనంలో ఉన్నప్పుడు ప్రసాద్ కూడా రవి లాగే చెడువ్యసనాలకి బానిస అయితే, సీతారామే అతనిని దారిలో పెట్టిన విషయాన్ని గుర్తు చేసి, “ఆ కృతజ్ఞత నాకు ఉందిరా. పైగా చెడ్డ వ్యసనాలనుండి బయట పడిన వ్యక్తి, మామూలు వ్యక్తి కంటే ఎక్కువ ప్రేమతో తన భార్యని చూసుకుంటాడు. ఇది నా సొంత అనుభవమే. నువ్వేం కంగారు పడకు. నా కూతురు అతన్ని డీల్ చేయగలదు.” అన్నాడు. సీతారాం కృతజ్ఞతగా ప్రసాద్ ని చూసి, అతను చెప్పిన దానికి అంగీకరించాడు. ఆ మర్నాడు సాయంత్రానికి ఉష సీతారాం ఇంటికి చేరింది.

5 Comments

Add a Comment
  1. Megatha katha ledu
    Complete in store please

  2. Nice bro ninu edhi edhi story felem thidham Anu kuntuna nuku okana

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *