నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 4 30

ఓహో ఇక్కడ మీరాకు ఇది విసుగు తెప్పిస్తుంది అని ప్రభు తనలో తాను అనుకున్నాడు
ఇది ఒక ఉపయోగకరమైన ఒక సమాచారమే ప్రభుకి

అవును శరత్ ఎప్పుడు శ్రమించేవారు
నేను బాధ్యతా రహితంగా తిరుగుతూ ఉండేవాడిని
నేను జాలీగా గడిపే రకం
అందుకే నాన్నగారు నన్ను గల్ఫ్ దేశాల్లో తరిమేశారు అన్నాడు నవ్వుతూ

మీరు మావారి కంటే చిన్న వారిలా కనిపిస్తారు
అప్పుడు మీ ఇద్దరు మంచి స్నేహితులుగా ఎలా మారారు

అప్పుడు ప్రభు నవ్వుతూ

అది క్రికెట్ ఆట మమ్మల్ని ఏకం చేసింది మేము
క్రికెట్ మ్యాచ్ ఆడటానికి పొరుగు ఊరికి పట్టణాలకు గ్రామాలకు వెళ్లేవాళ్లం మేము కలిసి ప్రయాణించి కలిసి ఆడుకునేవాళ్ళం అలా మంచి స్నేహితులుగా మారాము

మా వారు పని ఇంకా వ్యాపారం మాత్రమే ఎప్పుడు చేయడం నేను చూసాను
మా వారు నిజంగా క్రికెట్ ఆడేవార ?

మీరు ఎలా అన్నారు ఆ మాట ఒక సమయంలో
క్రికెట్ ఆట శరత్ జీవితం లాంటిది శరత్ బాగా బ్యాటింగ్ చేసేవాడు

మీరా,,,,,,,,,,,,,మరి మీరు?

నాకు మూడు సంవత్సరాలు వయసు తేడా ఉన్నప్పటికీ నేను ఎత్తుగా బలంగా దృఢంగా ఉండేవాడిని కాబట్టి నేను జట్టు కోసం వేగంగా బౌలింగ్ చేసేవాడిని

Leave a Reply

Your email address will not be published.