నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 3 23

మీరా పిల్లలను పిలవండి ఇంకా బయలుదేరుదాం
వేలుతూ ఎదైనా తిని వెల్దాం అన్న మీరా భర్త శరత్ గొంతు విని మీరా తిరిగి ప్రస్తుతానికి వచ్చింది

వారందరితో తింటూ ఉన్నప్పుడు ఒక సాధారణ గృహిణి తన భర్త ఇంకా పిల్లలతో ఎలాంటి మామూలు విషయాలు మాట్లాడుతుందో అలా మాట్లాడడానికి ప్రయత్నించింది

మీరా మనం ఇంటికి తిరిగి వెళ్ళే ముందు ప్రభు ఇంటికి వెళ్ళి అతని తండ్రిని చూసి వెల్దాం ఆయనకు అంతగా ఆరోగ్యం బాగుండలేదంటా

ప్రభు పేరు వినగానే మీరా శరీరం తనకుతాను కొన్ని క్షణాల పాటు స్తంభించింది సరే అలాగే నండి అని బదులు చెప్పింది మీరా

వారి కారు ప్రభు ఇంటికి చేరుకున్నప్పుడు మీరా కళ్లు ప్రకాశవంతంగా వెలిగి వారు కొత్తగా నిర్మించుకున్న ఇంటి వెనుక పాత పాడుబడిన ఇంటివైపు వెళ్లాయి
మీరా చూపు ఎక్కడ ఉందో గమనించాడు శరత్
అది అతనికి తెలుసు అని ఎలా చెప్పగలడు
అది తన భార్య మీరా ఇంకా ప్రభు అక్రమ సంబంధాన్ని మొదటిసారి తనకి చూపిన చోటు

రండి బాబూ రండి అంటూ ప్రభు తల్లిగారు అభిమానంతో లొపలికి స్వాగతించింది

మీరా ను లోపలికి పిలిచినప్పుడు ఆమె గొంతులో ఎలాంటి అభిమానం లేదు

బాబాయ్ గారు ఎలా ఉన్నారు అని శరత్ అడిగాడు

ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాబు ఆ గది లో ఉన్నాడు అంటూ బదులిచ్చింది ప్రభువు తల్లి

వారు ఆ గదిలోకి ప్రవేశించగానే ప్రభు తండ్రి మంచం పక్కన ప్రభు చెల్లెలు బుజ్జి పక్కనే కుర్చీలో కూర్చుని ఉంది

ఓ బుజ్జి నువ్వు ఇక్కడే ఉన్నావా అని శరత్ అడిగాడు
బుజ్జి అవును అన్నయా హాయ్ పిల్లలు అంటూ ఆమె ఆప్యాయంగా అందరినీ పలకరించింది

ప్రభు అమ్మగారు మాట్లాడుతూ బుజ్జి తన తండ్రిని చూడటానికి వచ్చింది ఆమె భర్త రేపు వచ్చి ఆమెను తీసుకు వెళతాడు

Leave a Reply

Your email address will not be published.