నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 3 23

అదంతా ఎందుకు జరిగింది అంటే మీరా భర్త
ఆమె తలలో సాధారణంగా మీరా ధరించే మల్లెపూలకు బదులుగా గులాబీ పూలు ధరించడం మీరా భర్త మీరాను ప్రశ్నించడం
మీరా తన భర్త తనపై అనుమానం కలిగినట్లు గ్రహించింది

అది ఆమె గుండెల్లో వణుకు తెచ్చింది
మీరా ఆ విషయం ప్రభుతో చెప్పింది
శరత్ అనుమానాలు తగ్గే వరకు వారి మధ్య సంబంధాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని వారు నిర్ణయించుకున్నారు

అలా ఓపికగా ఉండి ఓ రెండు వారాల పాటు ఒకరినొకరు కలుసుకోకుండా నిదానించారు

అలా మీరా భర్త వేరే ఎలాంటి అనుమానపు సూచనలు ఇవ్వకపోవడంతో తన భర్తకు తన మీద అనుమానంగా లేడని ఆమెలోని భయం నెమ్మదిగా చెదిరి పోవడం ప్రారంభించింది

అలా ఆలయంలో ప్రభు ను చూసిన శరత్ ఎందుకు ఈ మధ్య కనిపించడం లేదు అని మామూలుగా అడిగాడు అప్పుడు మీరా మనసులోని భయం పూర్తిగా పోయింది

వాస్తవానికి ప్రభు ఆ రోజు ఉదయమే మీరా ఇంటికి ఫోన్ చేసి ప్రభు మీరా ఎడబాటును తట్టుకోలేక మీరా కొసం ఎంతగా పరితపించి పోతున్నాడో వివరించి శరత్ కు కనిపించకుండా దూరం నుంచి చూడ్డానికి ప్రభు ఆలయానికి వస్తానని ముందుగానే మీరా కు సమాచారం ఇచ్చాడు

అది విన్న మీరా హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది తన భర్త ప్రభును చూసి దగ్గరికి పిలిచినప్పుడు ఆమె దృష్టి ప్రభు మీద లేనట్లు నటించింది అయినప్పటికి మీరా మనసులో నిలిచిన మనోహరమైన వ్యక్తిని ఆనందంనిండిన హృదయంతో ఆరాధిస్తుంది మౌనంగా

ఆ సమయంలో కూడా తన మనసులో భర్త కోసం చాలా శ్రద్ధ వహిస్తునప్పటికి మీరా మనసు మరోక వ్యక్తి వైపు ఎలా తీసుకెళ్ళి కలిగిందో అని ఆమె ఆశ్చర్యపోయింది

ఒక స్త్రీ ఒకే సమయంలో ఇద్దరూ పురుషులను
ఒకసారి ప్రేమించగలదా ?
తను మరోక పురుషుడికి శరీరం మాత్రమే ఇవ్వలేదని గ్రహించింది
ఆమె హృదయం కూడా మెల్లిగా దగ్గరవుతోంది

Leave a Reply

Your email address will not be published.