నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 3 23

రెండు సంవత్సరాల కొన్ని నేలల గడిచిన తరువాత

ప్రభు తన మామగారి కూతురిని పెళ్ళి చేసుకుని ఎవరికీ చెప్పకుండా ఊరు వదిలి వెళ్ళిపోయాడు

ఎప్పటిలాగే ఒకేరోజు గుడికి వెళ్ళాం అమ్మా పూలు కొనండి మల్లె పూలు సువాసనగల గులాబి పూలు అని అరుస్తూ పూలమే బుట్టలో పూలు పెట్టుకుని అమ్ముతూ ఉంది

మీరా పూలు అమ్మే ఆమె వైపు చూసి పిలిచింది
పూలమ్మే ఆమెను చూసింది బహుశా సువాసనగల గులాబి పూలు అని అరవడం వల్ల మీరా దృష్టిని ఆమె ఆకర్షించి ఉంటుంది అనుకుంటా

బుట్టలోని గులాబీ పూలను చూస్తూ కాసేపు మైమరచిపోయింది మీరా ఆ పూలు మీరా
పాత జ్ఞాపకాలను తిరిగి తెచ్చాయి
చాలా కాలం గడచినా ఆ జ్ఞాపకాలు ఇంకా మసకబారి లేదు

ఆ రోజు కూడా ఇలానే మీరా భర్త కారు పార్క్ చేసి మామూలుగా శుక్రవారం గుడికి దర్శనానికి వచ్చి ఇక్కడే మీరా భర్త మొదటిసారి ప్రభుని పరిచయం చేశాడు

ఆ సమయంలో మీరా ప్రభు తన జీవితంలో గందరగోళం సృష్టిస్తాడనీ అసలు అనుకోలేదు
ప్రభు వల్ల కలిగిన ఆ ప్రభావాన్ని మీరా ఇప్పటికీ అనుభవిస్తుంది

ఎందుకమ్మా పూల బుట్ట వైపు అలా చూస్తున్నావ్
అని కూతురు అడిగినప్పుడు తను సృహ లోకి వచ్చింది మీరా

మీరా కారు పార్క్ చేస్తున్న భర్త వైపు ఒకసారి చూసి లేదు నాకు మల్లెపూలు ఇవ్వండి చాలు అంది పూలామేతో

మీరా తన జుట్టులో మల్లెపూలు అలంకరించుకునే సమయానికి శరత్ ఆమె దగ్గరికి వచ్చాడు శరత్ పూలు అమ్మే ఆమెకు డబ్బులు ఇచ్చాడు

కుటుంబ సమేతంగా లోపలికి వెళ్లి దేవున్ని దర్శించుకుంటూ శరత్ ఇలా వేడుకుంటున్నాడు
ఓ భగవంతుడా నా కుటుంబానికి మళ్లీ పాత ఆనందాన్ని ప్రసాదించు నా భార్యకు మానసిక ప్రశాంతి ఇవ్వు అని హృదయపూర్వకంగా వేడుకుంటున్నాడు

పూజారి వచ్చి ప్రసాదం ఇచ్చి ఎలా ఉన్నారు
శరత్ గారు అని అడిగాడు

నేను బాగానే ఉన్నాను భగవంతుని దయవల్ల
అని బదులిచ్చాను

మీరు ప్రతి శుక్రవారం మీ కుటుంబ సమేతంగా తప్పకుండా ఇక్కడికి వస్తారు దేవుడు మీ ప్రార్థనలపై శ్రద్ధ వహిస్తాడు మీకు అంతా మంచే జరుగుతుంది

నేను కోరుకున్నట్లు అంతా నిజంగా మంచే జరిగిందా అని శరత్ తనలో తానే ప్రశ్నించు కున్నాడు

Leave a Reply

Your email address will not be published.