నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 2 51

మీరా అందం చూసి నా నైతిక విలువలు విడిచి గుడ్డివాని చేసి ప్రతిరోజు ఆమెను వెన్నంటి వెంటాడి ఆమె ఒంటరితనాన్ని మంచితనాన్ని దుర్బలత్వంని ఆసరా చేసుకుని ఆ పరిస్థితిని సద్వినియోగం చేసుకుంటూ నేను ఆమెను లొంగదీసుకున్నా

అలా చేసినందుకు మళ్లీ ప్రభు బిగ్గరగా ఏడుస్తూ
నా తండ్రి నా పుట్టుకనే అవమానించి తిడుతూ కొడుతూ మీ అమ్మ నావల్ల నిన్ను కనలేదు నువ్వు ఎవరికి పుట్టావో

నాకే గనుక పుట్టి ఉంటే నువ్వు ఇలాంటి నీచమైన పనులు చేయవు అన్నాడు
ఓ దేవుడా ఆ మాటలు విని ఇంకా నేనెందుకు బ్రతికే ఉన్నాను అనిపిస్తుంది అని ప్రభు ఏడుస్తూ బిగ్గరగా అరిచాడు

నేను మౌనం గా అతని వైపు చూస్తూ ఉన్నా
నాకే ఇప్పుడు ఒకరి ఓదార్పు అవసరం
నేను ఇప్పుడు అతన్ని ఎలా ఓదార్చ గలను
ప్రభు తన బాధను కొనసాగిస్తూ

శరత్ నేను రేపు మా మామయ్య కూతురిని వివాహం చేసుకోబోతున్నాను
నా ముసలి తల్లిదండ్రులు చివరి రోజులు వారితో గడపాలని నిర్ణయించుకుని ఇక్కడే ఉన్నా

కానీ నేను నీకు చేసిన ద్రోహానికి నేను తిరిగి ఇక్కడ మళ్ళీ కాలు పెట్టాను ఒకవేళ నా తల్లిదండ్రి చనిపోయిన కూడా చూడ్డానికి రాను ఇదే నాకు నేను వేసుకుంటుంన్నా శిక్ష

నేను తిరిగి మళ్లీ విదేశాలకు వెళ్తున్న నేను నీకు వాగ్దానం చేస్తున్నా నా శవాన్ని కూడా ఇక్కడికి రానివ్వను

అతను ఒక క్షణం నా వైపు చూసి దయచేసి మీరు ఎప్పుడునన్ను క్షమించకండి అని అనకండి అది కలలోనైనా నాలాంటి పనికిరాని నిజమైన జంతువుకి మీలాంటి మంచి వ్యక్తి యొక్క క్షమాపణలు కూడా అర్హుడు కాదు

2 Comments

Add a Comment
  1. ఈ స్టోరీ చదువుతుంటే నకు కళకు కటినట్లు కనిపిస్తుంది ఎక్స్లెంట్ స్టోరీ బ్రో నీ mail id chepu bro

Leave a Reply

Your email address will not be published.