నా భార్య నన్ను ఎందుకు మోసం చేసింది 2 51

వాళ్లని మనం చంపడం వల్ల ఒకటి మీరు జైలుకు వెళతారు లేదా నేను జైలు కి వెళ్తాను నేను జైలుకు వెళితే నా పిల్లలు అనాథలు అవుతారు వీధిలో అడుక్కు తినాల్సి వస్తుంది

ఒకవేళ మీరు జైలుకు వెళితే మీ కుటుంబం మగ దిక్కు లేని అవుతుంది
మన కుటుంబాల గురించి ఊరు మొత్తం చాలా చండాలంగా మాట్లాడుకుంటారు

ఆయన తన రెండు చేతులతో నమస్కరిస్తూ నా గుండెల పై వాలి కన్నీళ్లతో ఏడుస్తూ నువ్వు ఇవన్నీ చూసి ఎలా భరించగలతున్నావ్ భరించి ఎలా నిలబడగలుగుతున్నావ్

నా కొడుకు బండి చూసి ఈ వైపు వెతుక్కుంటూ వచ్చాను చిన్న వయసులో తాగి జీవితం నాశనం చేసుకోవడానికి ఇక్కడ ఉన్నాడేమౌ అనుకున్నాను

కానీ ఒక కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి వచ్చడనుకోలేదు ఇది చూసి నేను ఎందుకు తట్టుకోవాలి ఓ దేవుడా నన్ను ఈ భూమి మీద నుంచి తీసుకెళ్లి స్వామి అని ఏడుస్తూ నా రెండు చేతులు పట్టుకొని తన ముఖానికి కొట్టుకుంటే విలవిల్లాడుతున్నారు

ఆయన అకస్మాత్తుగా నా కాళ్ళ మీద పడి అయ్యో దేవుడా ఇలా జరిగిందే ఏం చేయాలి
బాబు నేను నీకు మాటా ఇస్తున్నా ఇంకా నుండి వాడు నీ భార్య ముఖం కూడా చూడడు అలా జరిగితే నా తల మీ ఇంటి గుమ్మం ముందు ఉంటుంది అది మీరు చూస్తారు

ఏడ్చి ఏడ్చి నా ముఖం ఆవేదనతో కుదించుకుపోయింది

నేను ఆయన్ని నిస్సారమైన స్వరంతో వేడుకుంటూ
నాకు తండ్రి లేడు నిన్ను నా తండ్రి గా భావించి ఒక మాట అడుగుతున్నా

నా భార్య చేసిన
ఈ వికారపు పని మనకు తెలుసు అని ఆమెకు ఈ జన్మకు తెలియకూడదు

ఒకవేళ ఆమెకు తెలిస్తే
మరుక్షణం ఉరి వేసుకుంటుంది

2 Comments

Add a Comment
  1. ఈ స్టోరీ చదువుతుంటే నకు కళకు కటినట్లు కనిపిస్తుంది ఎక్స్లెంట్ స్టోరీ బ్రో నీ mail id chepu bro

Leave a Reply

Your email address will not be published.