ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 1 69

చేతిలోని పుస్తకం నుండి ఫోటో ఉన్న కవర్ అంచులు బయటకు కనబడుతున్నాయి…
నాకు దాన్ని తీయాలని గానీ, ఫోటో చూడాలని గానీ అనిపించలేదు…
పుస్తకంతో సహా దాన్ని పక్కన పడేసి పడుకుండి పోయాను…
అటు కాసేపు, ఇటు కాసేపు ఆలోచనలతో తెలియకుండానే నిద్రపోయాను…
మర్నాడు పొద్దున పూట అమ్మా, నాన్నా, అక్కా, నేను అందరం టిఫిన్ చేస్తున్నాం…
నేను ఏమీ మాట్లాడకుండా తింటున్నాను…
అమ్మ అక్కకు సైగ చేయడం తెలుస్తూనే ఉంది నాకు..
కాసేపటికి అక్క అడిగింది…
“అక్షరా ఫోటో చూసావా, అబ్బాయి నచ్చాడా” అని..
నేను అవును అన్నట్టు తలూపాను..
“మరి వాళ్ళని రమ్మందామా” అని అడిగింది అక్క..
“దేనికి” అన్నాను నేను..

“చెప్పా కదే పెళ్లి చూపులకి”

“ముందే నన్ను చూసి వాళ్లకు నేను నచ్చానని చెప్పావ్ కదా… మళ్లీ పెళ్లి చూపులెందుకు”

“నువు చూడవా”

“మీరు చూసారు కదా… మీ అందరికీ నచ్చినవాడు నాకు నచ్చకుండా ఉంటాడా”

“అది కాదే. ఏదో ఫార్మాలిటీ కైనా పెళ్లిచూపులు ఉండాలి కదా”

“నాకవన్నీ ఇష్టం లేదక్కా… ఆల్రెడీ వాళ్ళకి నేను , మీకు అతడు నచ్చడం జరిగింది… ఇంక పెళ్లిచూపులు ఎందుకు”

“ఏంటే నీకా అబ్బాయి నచ్చలేదా”

“నచ్చకపోవడం కాదక్కా… నువ్వే చెప్పావు కదా.. నేను ఓకే అంటే చాలు పెళ్లి అయిపోయినట్టే అని..
ఇప్పుడు నేను సరే అంటున్నా కదా… ఇంకా ఈ తతంగం అంతా అవసరమా…
అసలు నాకు మొదట్నుంచీ పెళ్ళిచూపుల తతంగం అంటే చాలా కోపం .. వాళ్ళెవరో వస్తారని పొద్దున్నించి రెడీ అయి కూచోవడం.. కాఫీలు టిఫిన్లు ఇవ్వడం..
అడిగిన ప్రశ్నలకు అన్నిటికీ వినయంగా జవాబులివ్వడం…
ఇదంతా ఒక పెద్ద ప్రహసనం… చిరాకు వ్యవహారం..
నా అదృష్టానికి ఇప్పుడు వీళ్ళు ఇదంతా ఏమీ లేకుండానే ఓకే చెప్పారు..
ఐ యాం వెరీ హ్యాపీ నౌ..
పెళ్ళిచూపులే కాదు ఎంగేజ్మెంట్ కూడా ఏమీ వద్దు…డైరెక్టుగా పెళ్లి పెట్టేయండి..
నా పెళ్ళికి సంబంధించి ఇదొక్కటే నా కోరిక..
ప్లీస్ అక్కా కాదనకండి”
అని చెప్పేసి నా గదిలోకి వెళ్ళిపోయాను…

నేను చాలా రోజుల్నుండి ముభావంగా ఉండడం వల్లనో ఏమో.. అమ్మగానీ, నాన్నగానీ ఏమీ మాట్లాడలేదు…

కాసేపటికి అక్క నా గదికి వచ్చి నచ్చజెప్పాలని చూసింది…
నేను అక్కతో అదే మాట చెప్పాను..
నేనేమీ ఈ పెళ్లి మీద అయిష్టంతోనో , ఎవరిమీదైనా కోపంతోనో అలా అనడం లేదని…
పెళ్లిచూపులు, ఎంగేజ్మెంట్ వంటివి ఇష్టం లేకే వద్దంటున్నాని .. వివరంగా చెప్పాను..
అందరినీ ఒప్పించమని అక్కని బతిమాలాను…
నిజంగానే నాకు ఇప్పుడు అవన్నీ అనవసరం అనిపించింది..
ఎలాగు ఎవరినో ఒకరిని ఎపుడో అపుడు పెళ్లి చేసుకోక తప్పదు…
అది ఎవరైతే ఏంటి అనిపించింది…
అందుకే పెళ్లికి ఒప్పుకున్నాను…
కానీ ఈ మిగతా ప్రహసనం అనవసరం అనిపించింది…
అందుకే అక్కను బతిమాలాను…
నాన్న అక్క మాట కాదనడని నాకు తెలుసు..

అక్క ఏమి చెప్పి వెళ్లిందో గానీ రెండు రోజుల వరకు ఎవరూ నాతో ఆ విషయం మాట్లాడలేదు…
నేను ఎక్కువగా నా రూంలోనే అర్థం లేని, అంతంకాని ఆలోచనలతో గడిపాను…
పుస్తకంలో కవర్ రోజు కనబడేది కానీ ఒక్క సారికూడా దాన్ని తీసి అతని ఫోటో చూడలనిపించ లేదు నాకు..

రెండు రోజుల తర్వాత మధ్యాహ్నం పూట బావ వచ్చాడు…
అప్పుడు నేను నా రూమ్ లొనే ఉన్నాను..
హాల్ లో బావ, నాన్న మాటలు నాకు వినవబడుతున్నాయి…

1 Comment

Add a Comment
  1. Continue story interesting

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *