ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 4 41

మూడు రోజుల తర్వాత రవి రాజుని వెంట బెట్టుకుని వచ్చాడు ఇంటికి… నాకు రాజు కళ్ళలోకి చూసేందుకు ధైర్యం సరిపోక తల దించుకొని కిచెన్ లోకి వెళ్లబోయాను… రాజు కూడా నా వైపు చూడట్లేదు… నేను వెళ్తుంటే రవి నన్ను ఆపి ఒక్క నిమిషం ఇలా కూర్చో అన్నాడు…
రవి రాజు చెరో సోఫాలో కూర్చుని ఉన్నారు..
నేను కూర్చోలేదు కానీ వెళ్లకుండా అక్కడే నిలబడ్డా…

“చూడండీ…” అంటూ మొదలెట్టాడు రవి…
” నేను చెప్పాల్సింది మొన్ననే మీకు వివరంగా చెప్పాను… మీరు నేను చెప్పినట్టు చేస్తామని నాకు మాటిచ్చారు… ఇప్పుడేమో మౌనపోరాటం చేస్తున్నారు… మీకు ఇంకో వారం రోజులు టైం ఇస్తున్నాను… ఈ రోజు బుధవారం… వచ్చే బుధవారం కల్లా మీరిద్దరూ నేను చెప్పినట్టు చేయడానికి అంగీకారం తెలుపాలి… లేదంటే….” అంటూ ఆగాడు రవి…

నేను రవి వైపు తిరిగి చూసాను… రాజు కూడా నాలాగే రవి వైపే చూస్తున్నాడు…
” ఏం చెయ్యాలో నాకు బాగా తెలుసు… ” అంటూ ముగించి అక్కడనుండి వెళ్ళిపోయాడు రవి…
నేను రాజు వైపు చూసాను… అదే క్షణంలో రాజు కూడా నా వైపు చూసాడు… క్షణకాలం మా ఇద్దరి కళ్లు కలుసుకున్నాయి… మరుక్షణం తప్పు చేసిన దానిలా నేను తలతో పాటు నా కళ్ళు దించుకున్నాను… రాజు అక్కడ్నుంచి లేచి తన గదిలోకి వెళ్ళిపోయాడు…

వారం రోజులూ గడిచిపోయాయి… ఈ వారం రోజుల్లో ఒక్కసారి కూడా రాజుకి ఎదురుపడలేదు నేను…
నాకెందుకో బాగా గిల్టీ గా అనిపించసాగింది… రాజు ముందుకు వెళ్ళడానికి కూడా మనస్కరించడం లేదు… రాజు కూడా ఎక్కువగా ఇంట్లో ఉండలేదు… ఆఫీస్ నుండి రాగానే తన గదిలోకి వెళ్లిపోయే వాడు…

ఆ రోజు బుధవారం రవి హాల్లో కూర్చున్నాడు… రాజుని, నన్ను పిలిచాడు… నేను వెంటనే వెళ్ళలేదు… ఇంకో రెండు సార్లు పిలిచాక వెళ్లి తలా దించుకొని నిలబడ్డా… అప్పటికే రాజు వచ్చి ఇంకో వైపు నిలబడి బయటకు చూస్తున్నాడు…
నేను వెళ్ళాక రవి అడిగాడు… ” చెప్పండి నేను చెప్పింది చేస్తారా లేదా…” అని… నేను ఏమీ మాట్లాడకుండా అలాగే తల దించుకుని నిల్చున్నాను… రాజు కూడా ఏమీ మాట్లాడలేదు…

“మిమ్మల్నే అడిగేది… ఏదో ఒకటి చెప్పండి…” అన్నాడు రవి…
“నా వల్ల కాదు… ” … నేను రాజు ఇద్దరం ఒక్కసారే అన్నాం…
“అయితే నాకిచ్చిన మాట…” అడిగాడు రవి.. మేమిద్దరమూ సమాధానం చెప్పలేదు …
“నా మీద ఒట్టేసి మరీ చెప్పారు కదా…” అన్నాడు రవి…

“రవీ… ఇది సాధ్యం కాదు… నేనీ పని చేయలేను… నేనెప్పుడూ అక్షర ని వేరే దృష్టితో చూడలేదు… తననెప్పుడూ ఒక మంచి ఫ్రెండ్ లానే చూస్తూ వచ్చా… ఇప్పుడు నువ్ సడన్ గా ఆమెను పెళ్లి చేసుకో అనడం ఏమైనా బాగుందా… అసలెలా అనగలుగుతున్నావ్ ఈ మాట… తనకి నువ్వంటే ఎంత ప్రేమ… అలాంటిది నువ్వు ఇప్పుడు తనని ఎంత బాధపెడుతున్నావో నీకు అర్థం అవుతుందా…”
రాజు ఈ మాటలు అంటుంటే నాకు దుఃఖం ఆగలేదు.. నా కళ్లలోంచి కన్నీళ్లు వరదలా వచ్చేసాయి… రాజు నన్ను అపార్థం చేసుకోలేదని కొంచెం రిలీఫ్ అనిపించింది…

” నువు చేసేది కరెక్ట్ కాదు రవీ… నువ్ అనవసరమైన విషయాలు ఎక్కువగా ఆలోచించి బుర్ర పాడు చేసుకుంటున్నావు… నువ్వు బాధపడి మమ్మల్నీ బాధ పెడుతున్నావు… ” రాజు ఇంకా ఏదో చెప్పబోతుంటే రవి అడ్డుపడి…
” లేదు రాజు నువ్వంటున్నది, అనుకుంటున్నది తప్పు… నేను బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చాను… ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే సరైన పని.. మీరు నా సంతోషం కోరుకునే వాళ్లే అయితే నేను చెప్పినట్టు చేయండి… ఇంక దీని మీద వాదనలు అనవసరం… చేస్తారా చేయరా ఏదో ఒకటి తేల్చి చెప్పండి…”అన్నాడు…

“నేను చేయలేను రవీ…. ” అన్నాడు రాజు తేల్చి చెప్పేస్తూ…
“అక్షరా…” అంటూ నా వైపు చూసాడు రవి…
“నా వల్ల కాదు అని మీకు ఆరోజే చెప్పాను… ఈ రోజు కూడా అదే చెప్తున్నాను… మీరీ మంకు పట్టు వదలండి ప్లీస్…” అన్నాను నేను బతిమాలుతూ…
రవి ఒక్కసారిగా మా వైపు కోపంగా చూసి గబగబా పక్కనున్న రూమ్ లోకి వెళ్లి ధడేలు మని తలుపు వేసాడు… తలుపుని లోపల్నుండి లాక్ చెయ్యడం తెలుస్తూనే ఉంది మాకు… ఆ గదిని మా అత్తయ్య వాడేది ముందు… గాలి వెలుతురు బాగా వచ్చేందుకని అన్ని వైపులా కిటికీలు ఉంటాయి దానికి… అన్ని కిటికీలు అద్దాలతో బిగించబడి ఉండడం వల్ల లోపల అంతా హాల్లోకి కనబడుతుంది…
లోపలికి వెళ్లిన రవి అక్కడున్న అత్తయ్య ఫోటో ముందు నిలబడి ఏడుస్తున్నాడు… అది చూడలేక తల తిప్పుకుని నేను కూడా ఏడుస్తూ అక్కడే కూలబడి పోయా… రాజు ఒక మూలకు వెళ్లి అక్కడి కిటికీ నుండి బయటకు చూస్తున్నాడు….
ఒక ఐదు నిమిషాల తర్వాత నేను ఏడుస్తూనే మళ్లీ రవి ఉన్న గది వైపు చూసాను… అంతే నా గుండె ఆగిపోయినంత పని అయ్యింది…. “ఏమండీ వద్దూ” అంటూ అరుస్తూ వేగంగా ఆ గది వైపు పరిగెత్తా… నా అరుపు విని రాజు కూడా పరిగెత్తుకొచ్చాడు… మేం అక్కడికి వెళ్లే లోగానే… లోపల రవి నా చీరను ఫ్యాన్ కి కట్టి చైర్ మీద నిలబడి ఉన్నాడు… రవీ వద్దూ అంటూ రాజు కూడా అరుస్తున్నాడు… మా మాటలు లోపలికి వినబడుతున్నాయో లేదో తెలీదు… రవి చీరని తన మెడ చుట్టూ కట్టుకుంటున్నాడు… “రాజూ… ఏదైనా చెయ్ ప్లీజ్… ” అన్నాను నేను ఏడుస్తూ… రాజు డోర్ ని నెట్టే ప్రయత్నం చేసాడు, గట్టిగా తన్నాడు కానీ అది రాలేదు…
వెంటనే డైనింగ్ టేబుల్ దగ్గరకు పరుగెత్తుకెళ్లి అక్కడున్న కుర్చీ ఒకటి తెచ్చాడు రాజు… దాంతో కిటికీ అడ్డాల మీద గట్టిగా కొట్టాడు… రెండు దెబ్బలకి భళ్ళున పగిలి పోయాయి అవి… కుర్చీ అటు విసిరేసి కిటికీలోంచి లోపలికి వెళ్ళాడు రాజు… రవి తన కాళ్ళకింద ఉన్న కుర్చీని తన్ని వేలాడడం రాజు అక్కడికి చేరుకోవడం ఒక్కసారే జరిగాయి… వెంటనే రాజు రవి కాళ్ళని ఎత్తి పట్టుకున్నాడు… అక్షరా లోపలికి రా అంటూ పిలవడంతో నేను కూడా కిటికీ గుండా లోపలికి వెళ్ళాను… రాజు చెప్పగానే అక్కడున్న కుర్చీ ఎక్కి రవి మెడకు ఉన్న చీర ముడిని విప్పేసాను… రాజు రవిని కిందికి దింపి “ఏమిట్రా ఈ పని” అంటూ రవి చెంప మీద బలంగా కొట్టాడు… రవి వెళ్లి పక్కనున్న బెడ్ మీద పడ్డాడు… నేను ఏడుస్తూ వెళ్లి రవిని గట్టిగా కొగిలించుకొని … “ఏమండీ ఎందుకిలా చేశారు… మీరు లేకపోతే నేనేమై పోవాలి… ” అంటూ ఇంకా గట్టిగా ఏడ్చాను….
“ఇప్పుడు నేను ఉండి మాత్రం ఏం ప్రయోజనం ఉంది….” అన్నాడు రవి నన్ను విడిపించుకుంటు…

“ఎందుకురా అలా మాట్లాడుతూ అందరినీ బాధ పెడుతావ్.. ” అన్నాడు రాజు..
“ఎవరు ఎవర్ని బాధ పెడుతున్నార్రా… నేను మిమ్మల్ని బాధపెడుతున్ననా… అవునులే నా బాధ మీకేం తెలుసు… తెలిస్తే ఇలా చేస్తారా…
ఇంక నా వల్ల కాదురా… మీకు ఎంత చెప్పినా నా బాధ అర్థం కాదు… నా చేతకాని తనాన్ని తలుచుకుంటూ రోజూ చస్తూ బతకడం కంటే ఒకేసారి చావడం మేలు… అందుకే నన్ను చావనివ్వండి… “

1 Comment

Add a Comment
  1. Super excellent story.. keep taupe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *