ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 4 41

“కటువుగా ఉన్నా ఉన్నా అది నిజం అక్షరా… నాకు అలాగే అనిపిస్తుంది… ప్రతి రాత్రి నాకు నరకం కనిపిస్తుంది… పక్కనే నువ్ పడుకొని ఉంటే నిన్ను నేను సుఖపెట్టట్లేదే అని నా మనసు దహించుకు పోతుంది… ఈ ఆలోచనతో ఏ రోజు కూడా నాకు నిద్ర పట్టట్లేదు … నీకు మనసులో ఇదేమీ లేకపోవచ్చు… నా పరిస్థితి చూసి… ..అర్థం చేసుకొని….. నువ్ నా నుండి ఏమీ కోరుకోకపోవచ్చు.. నీకు నా మీద ఉన్న ప్రేమ కారణంగా నువ్ అన్నీ అనుచుకోవాలని అనుకుంటున్నావు…
కానీ మనసు వేరు శరీరం వేరు అక్షరా… పడుకున్నాక నీ బాడీ కదలికలను బట్టి నీ శరీరం నిన్ను ఎంత ఇబ్బంది పెడుతుందో నేను అర్థం చేసుకోగలను ..”

ఈ మాట విన్నాక నాకు మొన్నటి కల గుర్తొచ్చింది… తప్పకుండా ఆ రాత్రి నేను ఏదో చేసి ఉంటాను… రవి అది గమనించి ఉండొచ్చు.. అందుకే ఇలా మాట్లాడుతున్నాడు…
“అది శరీర ధర్మం అక్షరా… దానికి నేను నిన్ను తప్పు పట్టట్లేదు… నువ్ పడక సుఖం కావాలని వెంపర్లాడుతున్నావు అని కూడా అని అనను… కానీ ప్రతి మనిషికి ఆ కోరిక ఉంటుంది.. అంతెందుకు నాక్కూడా నిన్ను అనుభవించాలని ఇప్పుడు కూడా అనిపిస్తుంది… కానీ నా శరీరం సహకరించదు… నీకేమో శరీరం కావాలని అడిగినా నువ్ దాన్ని మనసుతో కంట్రోల్ చేయవలసిన పరిస్థితి…”

“జీవితం అంటే అదొక్కటే కాదండీ…”
“నేను కూడా ఆ ఒక్క దాని గురించే నువ్వు, రాజు పెళ్లి చేసుకోవాలని అనట్లేదు అక్షరా… ఇంకా కారణాలున్నాయి…
మొదటిది ‘నా వల్ల నువ్వు ఇబ్బంది పడుతున్నావు’ అనే బాధ నాకు తప్పుతుంది…
ఇంకా ఇప్పుడు నాకు మగతనం పోయింది అనే విషయం మన ముగ్గురికి మాత్రమే తెలుసు…
ఇంకో రెండేళ్లయితే అందరూ అడుగుతుంటారు మీకింకా పిల్లలు కావట్లేదు ఎందుకు అని… తర్వాత అందరూ నిన్ను గొడ్రాలు అనీ, నన్ను నపుంసకుడు అనీ అంటుంటారు… జనాల మాటలు భరించడం కష్టం… నన్ను అన్నా సరే.. నిన్ను అంటుంటే భరించడం నా వల్ల కాదు…
ఇంకోటి నీకు పిల్లలు అంటే చాలా ఇష్టం అని తెలుసు… నేను మూర్ఖత్వంతో నిన్ను మాతృత్వానికి దూరం చేసాను… ఇప్పుడు నువ్ రాజు ద్వారా పిల్లల్ని కంటే నీకు మాతృత్వాన్ని తిరిగి ఇవ్వవచ్చు.. నేను కూడా తండ్రిగా చెలామణి అవ్వొచ్చు… ఇలా ఇందులో నా స్వార్థం కూడా ఉంది…

రాజు కోణంలో చూసినా ఇదే కరెక్ట్ అనిపిస్తుంది అక్షరా…
వాడు ఆ లావణ్య మోసం చేసినప్పటి నుండీ ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండి పోయాడు…. ఆ తర్వాత ఏ అమ్మాయినీ దగ్గరకు రానీయలేదు… వాడు అంతో ఇంతో క్లోస్ గా ఉండే అమ్మాయివి నువ్వు ఒక్కదానివే… వాడికి పెళ్లి చేసి ఒక ఇంటివాన్ని చేయాలని నువ్వు కూడా చాలా సార్లు అన్నావు…”

“అందుకని ఇప్పుడు నన్నే చేసుకొమ్మంటారా…”
“ అందుకని కాదు అక్షరా… నాకోసం, ఇంకా వాడి కోసం… వాన్ని చిన్నప్పట్నుండి చూసిన వాడిగా చెబుతున్నాను…వాడు ఇంకో అమ్మాయిని తన లైఫ్ లోకి రానిచ్చే అవకాశం లేదు… అయితే నాకోసం , నీ కోసం అయితే వాడు నేను చెప్పిన ఈ పని చేస్తాడు… చెప్పడం నాకోసం అని చెప్పినా వాడికీ ఇది మంచి చేస్తుంది… ఒంటరి వాడిని అన్న ఫీలింగ్ వాడికి ఉండదు…ఒక్క పనితో ఇటు నీకు అన్యాయం చేసానే అనే గిల్టీ ఫీలింగ్ నుండి నన్ను…. ఒంటరిని అనే ఫీలింగ్ నుండి వాన్ని … నువ్ దూరం చేయగలవు… ప్లీజ్ అక్షరా నాకు ఈ ఒక్క సహాయం చేయు… ”

“మీరు ఎన్నైనా చెప్పండి ఈ పని నేను చెయ్యలేనండీ…”
ఈ మాటలు నేను అంటున్న సమయంలో బయట నుండి అక్షరా… అక్షరా అంటూ రాజు పిలిచాడు… నేను లేచి బయటకు వెళ్తుంటే “అక్షరా…. నేను చెప్పింది చేస్తానని…. నా మీద ఒట్టేసావు… మర్చిపోకు… నా మీద ఒట్టు అంటే అర్థం నీకు తెలుసనుకుంటా…” అన్నాడు రవి… నేను ఈ లోపు డోర్ వరకు వెళ్ళిపోయాను… రవి మాటలు విని వెనక్కు తిరిగి చూసాను… రవి నన్నే చూస్తున్నాడు.. ఇంతలో నువ్ ఇక్కడున్నావా అంటూ రాజు ఆ గది వద్దకు వచ్చాడు…

“రాజూ ఒకసారి లోపలికి వస్తావా నీతో మాట్లాడాలి” అంటూ రవి పిలిస్తే రాజు లోపలికి వెళ్లి చెప్పరా అంటూ రవి పక్కన కూర్చున్నాడు…
“నువ్ నాకో సహాయం చేస్తావా..” అడిగాడు రవి..
“చెప్పరా… ఏం చెయ్యమంటావ్ …” అన్నాడు రాజు నవ్వుతూ…
“ఏం చెప్పినా చేస్తావా…”
“హా తప్పకుండా.. నీకేమైనా డౌటా..”
“ఏం చెప్పినా చేస్తానని ఒట్టెయ్యు ….” అన్నాడు రవి …
“అదేంట్రా కొత్తగా ఒట్టేయమంటున్నావ్ … నమ్మకం లేదా నా మీద… సరే ఒట్టు .. నువ్వేం చేయమన్నా చేస్తాను సరేనా…” అంటూ రవి చేతిలో చెయ్యి వేసాడు రాజు….

నాకు ఇంక అక్కడ ఉండాలని అనిపించలేదు… నిశ్శబ్దంగా అక్కడినుండి బయటకు నడిచాను … నేను వెళ్తుంటే “ఇలా కాదు నా మీద ఒట్టేసి చెప్పు” అని రవి అంటుండడం నాకు వినబడింది… ఇంకా వినడం నా వల్ల కాలేదు… అందుకని వడివడిగా కిచెన్ లోకి వెళ్ళిపోయాను…
నాకు ఏం చేయాలో అర్థం కాలేదు … “ నా మీద ఓట్ట్టేశావ్… దానర్థం తెలుసనుకుంటా” అనే మాటలు ఇంకా నాకు వినబడుతున్నాయి… అవి మాత్రమే కాదు అప్పటి వరకు రవి చెప్పిన మాటలు అన్నీ చెవుల్లో మోతలా మళ్ళీ మళ్ళీ వినబడుతూనే ఉన్నాయి… ఏం చేయాలో తెలియట్లేదు … రవి చేప్పినట్టు చేయడం నా వల్ల కాదు అని మాత్రం తెలుస్తుంది… అలాగే నిలబడి ఆలోచిస్తున్నాను… ఒక అరగంట తర్వాత రాజు ఆ గది నుండి విసురుగా బయటకు వచ్చాడు… నా వైపు ఒక రకంగా చూసాడు… అతని ముఖంలో ఉన్నది కోపమా, బాధా అనేది నాకు తెలియలేదు … రాజు కళ్ళలోకి చూడలేక నేను తల దించుకున్నాను… రాజు అంతే విసురుగా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయాడు ….

ఆ రోజు నేను అన్నం ముట్టలేదు… రాజు బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా చాలా సేపు కిచెన్ లోనే అలాగే నిలబడి పోయాను… కాళ్ళు లాగుతుంటే హాల్ లోకి వచ్చి సోఫాలో కూర్చున్నాను… ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు నాకు…. రవి చెప్పిన మాటలు చెవుల్లో రిపీటెడ్ గా మారుమోగుతున్నాయి… కానీ ఆ మాటలు నాకు జీర్ణం అవ్వట్లేదు… రెండు మూడు రోజులు నేను రవితో మాట్లాడలేదు… రాజు అయితే ఇంటికే రాలేదు… రవి ఉన్నపుడు మా బెడ్ రూమ్ వైపు నేను అసలు వెళ్లనే లేదు.. ఒక వేళ రవి హాల్ లోకి వస్తే నేను కిచెన్ లోకి వెళ్లి పోయేదాన్ని…
వండినవన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది పెట్టేదాన్ని… రవి తానే వడ్డించుకుని తిని వెళ్ళేవాడు…
నన్ను మాట్లాడించే ప్రయత్నం చేసినా నేను పలకలేదు… నాకు ఎందుకో మాట్లాడాలని అనిపించలేదు….
నాకు ఎంతసేపూ ఒకటే ఆలోచన… ‘ఎందుకు రవి ఇలా విపరీతంగా ఆలోచించాడు’ అని… నేనూ రాజు పెళ్లి చేసుకోవడం ఏంటి… దానికోసం రవి చెప్పిన కారణాలేవీ ఏవీ నాకు సరైనవి గా అనిపించడం లేదు…
రాజుతో పెళ్లి అనే ఆలోచనే నాకు ఎలాగో ఉంది… రవికి ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చింది…
రవికి మగతనం పోవడం వల్ల నేను రాజుని పెళ్లి చేసుకోవడం ఎంతవరకు సబబో నాకు తెలియట్లేదు…
నేనెప్పుడూ రవికి మగతనం పోయిందని బాధ పడినట్టుగా కూడా రవి దగ్గర ప్రవర్తించలేదు… మరి రవి ఎందుకు ఇలా చేస్తున్నాడు…
ఎంత ఆలోచించినా నేను ఏమీ తేల్చలేక పోయాను…

ఈ విషయంలో రాజు మనసులో ఏముంది అనేది నాకు ఇంకో అంతుబట్టని విషయం… రవి దగ్గరనుండి బయటకు వచ్చినప్పుడు మాత్రం రాజు ముఖం కోపంగా కనబడింది… ఆ కోపం ఎవరి మీద… రవి మీదనా… లేక నా మీదనా… కొంపదీసి నేనే ఈ ప్రతిపాదన తెచ్చాను అని రాజు అనుకోవట్లేదు కదా… రవికి మగతనం పోయినందువల్ల నేను తనని కోరుకుంటున్నాను అనుకుంటున్నాడా… అందుకే అంత కోపంగా చూసాడా నా వైపు… అలా అనుకుంటేనే సిగ్గుతో చచ్చిపోవాలని అనిపిస్తుంది నాకు… ఈ ఆలోచన నాది కాదు అని చెబుదామన్నా రాజు ఇంటికి రావట్లేదు… ఏమాయ్యాడో తెలియదు… ఫోన్ చెయ్యడానికి కూడా నాకు చేతనవ్వట్లేదు… ఫోన్ చేసి ఎలా మాట్లాడాలి… ఏమని మాట్లాడాలి… ఇలా జవాబులు దొరకని ప్రశ్నలతోనే మూడు రోజులు గడిచిపోయాయి…

1 Comment

Add a Comment
  1. Super excellent story.. keep taupe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *