ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 4 41

ఇంటికి వచ్చి నన్ను కార్ లో తీసుకెళ్లాడు…
ఎక్కడికి అంటే చెప్తాను ముందు పద అంటూ ఏమీ చెప్పకుండా హాస్పిటల్ కి తీసుకెళ్లాడు…
ఏమైంది రాజు హాస్పిటల్ కి ఎందుకు తీసుకొచ్చావ్ అని అడిగా…
చెప్తా రా అంటూ లోపలికి తీసుకెళ్లాక అప్పుడు చెప్పాడు…
“రవిని ఎవరో కొట్టారు అక్షరా… బాగా దెబ్బలు తగిలాయి..” అని…

నాకు గుండె ఆగినంత పనయింది… రాజు చెప్పగానే గాభరాగా కాళ్ళు చేతులు వణకడం మొదలయ్యింది… ఐసీయులో రవి ని చూడగానే భోరున ఏడ్చేశాను…
“నువేం భయపడకు అక్షరా… డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు… మరేం ఫరావాలేదు అన్నారు..” అన్నాడు రాజు నన్ను ఓదారుస్తూ..
దెబ్బలు విపరీతంగా తగలడంతో రవి కొలుకోడానికి రెండు నెలల పైగా పట్టింది..
కాళ్ళకి చేతులకి సర్జరీ చేశారు..
డిశ్చార్జ్ చేసే సమయానికి కూడా రవి లేచి నడిచే పరిస్థితి లేదు…

బిసినెస్ తో పాటు హాస్పిటల్లో ఉన్నన్ని రోజులు రవిని కూడా చూసుకోవడం రాజుకి కష్టంగా ఉండేది… మొదటి వారం రోజులు నన్ను కూడా రాజే చేసుకోవలసి వచ్చింది… రెండు మూడు రోజులు నేనేమీ తినలేదు… రాజే బతిమాలి తినిపిస్తే ఏవో నాలుగు మెతుకులు తిని లేచేదాన్ని… రాజు ఎప్పుడూ నన్నే కనిపెట్టుకొని ఉండేవాడు.. దగ్గర కూర్చుని ఏమీకాదు అక్షరా..రవి తొందరగానే కొలుకుంటాడు అంటూ ధైర్యం చెప్పేవాడు… అమ్మా, నాన్న లు వచ్చినా రాజు ఇచ్చిన ధైర్యంతోనే నేను త్వరగా కొలుకున్నాను.. కొన్నాళ్ళకి రవిని నేను చూసుకుంటాను అన్నా కూడా రాజు రోజు హాస్పిటల్ కి వచ్చి వీలైనంత ఎక్కువ సేపు ఉండి వెళ్లేవాడు..

డిశ్చార్జి చేసేముందు డాక్టర్ నన్ను, రాజుని పిలిచి మాట్లాడాడు..
“రవికి తగిలిన దెబ్బలు చాలా తీవ్రమైనవి …
లేచి నడవడానికి, తన పనులు తాను చేసుకోడానికి ఇంకో నెల రోజులైనా పట్టొచ్చు…
అయితే ఇంకా హాస్పిటల్ లో ఉంచవలసిన అవసరం లేదు.. ఇంటికి తీసుకెళ్లి మెడిసిన్ వాడితే సరిపోతుంది…” అన్నాడు…

సరే డాక్టర్ థాంక్యూ అంటూ మేం లెవబోతుంటే ..” ఆగండి మీతో ఇంకో ముఖ్య విషయం చెప్పాలి..” అంటూ ఆపాడు..
మేం మళ్లీ కూర్చున్నాం…
” రవికి తగిలిన దెబ్బలు తీవ్రమైనవని ఇందాకే మీకు చెప్పాను… కాళ్ళు, చేతులకైతే సర్జరీ చేయగలిగాం… కానీ నడుము దగ్గర తగిలిన దెబ్బల వల్ల నరాలు బాగా దెబ్బతిన్నాయి.. ఇంకొంచెం ఎక్కువగా తాకి ఉంటే నడుము కింది భాగానికి మిగతా శరీరంతో కనెక్షన్ కట్ అయ్యేది… అంతవరకు మనం అదృష్టవంతులం…” అని చెప్పి కాసేపు ఆగి .. “దురదృష్టం ఏంటంటే కొన్ని సున్నిత ప్రాంతాల్లో తగిలిన దెబ్బల కారణంగా రవి ఇక సంసారానికి పనికి రాకపోవచ్చు… ”

నాకు ఏం మాట్లాడాలో తెలియలేదు.. ఈ విషయం తెలిస్తే రవి ఎలా రియాక్ట్ అవుతాడా అని ఆలోచిస్తున్నాను నేను…
“ట్రీట్మెంట్ ఏమీ లేదా డాక్టర్” అని అడిగాడు రాజు…
“చాలా కష్టం … మందులు వాడితే ఫ్యూచర్ లో ఏమైనా మార్పు రావచ్చు… కానీ గ్యారెంటీ గా చెప్పలేం… తొంభై శాతం అవకాశం లేదనే చెప్పాలి… ఆ పది శాతం మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది…”…
“ఈ విషయం ఆయనకి చెప్పారా డాక్టర్…” అడిగా నేను…
“లేదమ్మా…”
“సర్ ఒక హెల్ప్ చేస్తారా… దయచేసి ఆయనకి ఈ విషయం చెప్పకండి… ”
“కానీ కొన్నాళ్లయితే రవికి తెలిసిపోతుంది కదమ్మా…”
“తెలిసే సరికి కొంచెం టైం పడ్తుంది గా డాక్టర్… అప్పటికి ఆయన కొలుకుంటాడు.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు గా… మెల్లిగా నేను టైం చూసుకుని చెప్తాను… కొన్నాళ్ళు నాకు దూరంగా ఉండాలని మాత్రం చెప్పండి చాలు… ప్లీస్”..
సరేనంటూ డాక్టర్ ఆ గది నుండి బయటకు వెళ్ళిపోయాడు… రాజు కూడా డాక్టర్ వెంబడే వెళ్ళాడు… నేను ఆ గదిలోనే కాసేపు మౌనంగా కూర్చున్నా… రవి ఎలా రియాక్ట్ అవుతాడా అనేదే నా మనసుని తొలుస్తున్న ప్రశ్న… సమాధానం నా ఊహకు అందడం లేదు…

రవిని హాస్పిటల్ లో జాయిన్ చేసాక రాజు చేసిన మొదటి పని పోలీస్ స్టేషన్ కి వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం… కేవలం కంప్లైంట్ ఇచ్చి వదిలేయకుండా పైలెవెల్లో పోలీసుల మీద వత్తిడి తేవడంతో రవిని కొట్టినవాళ్ళని మా డ్రైవర్ సహాయంతో తొందరలోనే పట్టుకున్నారు … వాళ్ళని తీసుకొచ్చి ఇంటరాగేట్ చేస్తే వాళ్ళు ప్రకాష్ పేరు చెప్పారు… వెంటనే పోలీసులు ప్రకాష్ ని అరెస్ట్ చేశారు… అయితే ప్రకాష్ బెయిల్ మీద విడుదలయ్యాడు… కేస్ కోర్టుకు వెళ్ళింది… ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రకాష్ కి శిక్ష పడేలా చేయాలని రాజు ఒక ప్రముఖ లాయర్ ని మాట్లాడి ఉంచాడు… ఈ లోపు రవిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేస్తే ఇంటికి తీసుకొచ్చాం….

హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేసాక రవి పూర్తిగా కొలుకోవడానికి మరో రెండు నెలలు పట్టింది…
ఎప్పుడూ బెడ్ మీద పడుకొని ఉండడం రవికి బోర్ గా ఉండేది… వీలయినంత వరకు నేను దగ్గరే ఉండి రవి తో ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండేదాన్ని…
రాజు కూడా రోజు వచ్చి బిసినెస్ విషయాలు రవితో చర్చించి వెళ్ళేవాడు… ప్రకాష్ మీద పెట్టిన కేస్ కి సంబంధించి కూడా చర్చించే వాళ్ళు…
నేను రవికి సమయానికి మందులు, ఆహారం ఇస్తూ ప్రతిక్షణం కనిపెట్టుకొని ఉండేదాన్ని…
నెమ్మదిగా రవిని లేపి కూర్చోబెట్టడం అదీ చేసేదాన్ని…
కొన్నాళ్లయ్యాక పట్టుకొని నడవడం ప్రాక్టీస్ చేయించాను… మొదట్లో ఇబ్బంది పడ్డా కూడా తర్వాత తర్వాత బాగానే నడవగలిగాడు… మొదట్లో నేను సపోర్ట్ గా పట్టుకునే దాన్ని.. కొన్నాళ్లయ్యాక వాకర్ సహాయంతో తనంత తానే నడిచాడు… మరి కొన్నాళ్ళకి స్టిక్ సరిపోయింది… ఇంటికి వచ్చిన రెండు నెలలకి పూర్తిగా తనంత తానే నడవడం వచ్చేసింది…
కాళ్ళకి ,చేతులకి తగిలిన గాయలన్నీ మాని పోయాయి… అయినా డాక్టర్ ఇంకో నెలా, రెండు నెళ్లు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకొమ్మని చెప్పడంతో రవి ఇంట్లోనే ఉండే వాడు…

ఇక్కడే నాకు సమస్య మొదలయ్యింది…
బెడ్ మీద ఉన్నన్నాళ్లు రవికి వేరే ఆలోచనలు రాలేదు.. కానీ ఇప్పుడు ఊరికే ఇంట్లో ఉండడంతో తన ఆలోచనలు నా మీదికి రాసాగాయి…
రవిని ఇంటికి తీసుకు వచ్చినప్పటి నుండి కూడా నేను జాగ్రత్తగానే ఉంటున్నాను…
రవి ఉన్న రూమ్ లొనే వేరే బెడ్ వేసుకుని పడుకునేదాన్ని…
డ్రెస్సింగ్ పూర్తిగా మార్చేసుకున్నా…
పూర్తిగా చీరలే కట్టుకుంటున్నా… బ్లౌస్ లన్నీ మార్చేసా… ఏ విధంగానూ రవికి ఇంకో రకమైన ఆలోచన నా డ్రెస్సింగ్ వల్ల గానీ, నా బిహేవియర్ ద్వారాగానీ కలగకూడదని నా ఆలోచన…

కానీ రవి అప్పుడప్పుడు నన్ను ఇబ్బంది పెట్టేవాడు…
మందులివ్వడం కోసం నేను దగ్గరికి వెళ్ళినప్పుడు సడన్ గా నన్ను తన మీదికి లాక్కునే వాడు…
కష్టం మీద విడిపించుకొని డాక్టర్ దూరంగా ఉండమన్న విషయం గుర్తు చేసే దాన్ని నేను…
రవి శరీరం సంగతి ఏమో గానీ మనసు మాత్రం నన్ను కోరుకుంటుందని అర్థం అయ్యింది నాకు…
రవి కూడా పూర్తిగా నేను కావాలని కాకుండా నన్ను ఆట పట్టించేలా ప్రవర్తించేవాడు… ఏదోలా రవికి అసలు విషయం చెప్పాల్సిన సమయం తొందరగా రాకూడదని కోరుకునే దాన్ని నేను…

1 Comment

Add a Comment
  1. Super excellent story.. keep taupe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *