ఇలా ప్రపంచంలోని అందాలన్నీ నీలోనే ఉన్నాయి – 2 72

ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదు…

నిన్ను కలిసి క్షమాపణ అడిగితే బాగుంటుందనిపించింది…
ఆ రోజు మధ్యాహ్నం నిన్ను కలవాలని మీ ఇంటికి వచ్చాను… కానీ ఇంటినిండా బంధువులు ఉండడంతో నాకు ధైర్యం చాలలేదు…
తర్వాత కూడా ఒకటి రెండు సార్లు మీ ఇంటిదాకా వచ్చి తిరిగి వెళ్ళిపోయాను…
నా వల్ల కాలేదు..
రెండు మూడు రోజుల వరకు ఎవరినీ కలువ లేదు…
సరిగా భోజనం చేయలేదు…
అమ్మ , రాజు అడిగితే ఏమీ లేదని చెప్పా…
రాత్రి పగలు నా రూంలోనే ఉన్నా…
ఎంత ఆలోచించినా ఏం చేయాలో తెలియట్లేదు…
నాకే ఇలా ఉంటే నువ్వు ఎలా ఉన్నవో అని భయం వేసింది..
నీ పరిస్థితి తలచుకున్నప్పుడల్లా గుండెల్ని పిండేసే బాధ కలిగేది… ఏం చేస్తే నీకు ఉపశమనం కలుగుతుందో తెలియలేదు… ఇప్పుడు నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తము ఏంటి… అని ఎంతగానో ఆలోచించా … కానీ ఏమీ తోచలేదు…
ఒక రోజు మీ ఇంటికి దగ్గరకు వచ్చి మళ్లీ వెళ్లిపోతుంటే… దారిలో ఒక ముసలావిడ ఒక చెట్టుకింద కూర్చొని ఎవరో ఒక అబ్బాయికి చేతిమీద పచ్చబొట్టు పొడుస్తుంది… సన్నటి సూదితో ఆమె పొడిచినప్పుడల్లా ఆ అబ్బాయి అమ్మా అని అరుస్తున్నాడు… అయిపోతుంది బాబు కొంచెం ఓర్చుకో అంటూ పొడుస్తుంది ఆవిడ..
నేను ఆ అబ్బాయి పని అయ్యేంత వరకు అక్కడే ఆగాను….
అయ్యాక చూసాను అతని చేతి మీద ఒక పేరు ఉంది… అది వాళ్ళ అమ్మ పేరట డబ్బులిస్తూ ముసలావిడకి చెప్తున్నాడా అబ్బాయి…
అతడు వెళ్ళాక నేను ఆమె దగ్గరకు వెళ్ళాను…
ఏం బాబు పచ్చబొట్టు పొడిపించుకుంటావా అని అడిగింది….
నేను సమాధానం చెప్పకుండా…
రోజుకి ఎంత సంపాదిస్తావ్ అని అడిగా…
ఎంత బాబు పేరుకు వంద తీసుకుంటా… రోజులో ఒకరో ఇద్దరో వస్తారు.. అంతే అంది…
సరే నాతో వస్తావా రోజుకి రెండు వేలు ఇస్తాను అన్నా…
ఎందుకు బాబు అంది ఆమె ఆశ్చర్యంగా చూస్తూ …
నువ్ చేసేపనే చెయ్యాలి అన్నా…
సరే బాబు అంది…
అయితే పద కారెక్కు అన్నా నేను..
ఆమెను తీసుకొని ముంబయి లో ఉన్న మా గెస్ట్ హౌస్ కి వెళ్ళాను…”
అంటూ చెప్పడం ఆపి పైకి లేచాడు రవి….
రవి చెప్తున్నది నాకేం అర్థం కాలేదు…
అయోమయంగా అనిపించి తలెత్తి అతని వైపు చూసాను…
లేచి నిలబడ్డ రవి తన లాల్చీ తీస్తున్నాడు…
నా కనుబొమ్మలు ముడి పడ్డాయి…
తర్వాత తన బనియన్ కూడా తీసేసాడు…
ఈ సారి నా కళ్ళు ఆశ్చర్యంగా చూశాయి…
అతని తెల్లటి ఒంటిపై నిండా చిన్న చిన్న అక్షరాలు మూడేసి ఉన్నాయి… చాలా చిన్నగా ఉన్నాయి…
చేతుల మీద తప్ప మెడ కింద నుండి నడుము వరకు ఒంటి నిండా ఉన్నాయి… ఒక్కో పదానికి మధ్య చాలా చిన్న గ్యాప్ ఉంది… రవి తన లాల్చీ బనియన్ కొయ్యకు వేయడానికి వెళ్తుంటే చూసా… వీపు మీద కూడా నిండా ఉన్నాయి… తిరిగి రవి దగ్గరగా వచ్చాక వాటిని సరిగ్గా గమనించి చూసాను… కలిపి చదివితే అన్నీ
… ‘అక్షర’ …అంటే నా పేరు..

” నేను చేసిన తప్పుకు ఇది శిక్షగా భావించా అక్షరా”
అన్నాడు మంచం మీద నా కాళ్ళ దగ్గర కూర్చుంటూ…

“వారం రోజుల పాటు సూదులతో పొడిపించుకున్నాను నీ పేరుని… ఒక్కో సూది పోటు ఆమె గుచ్చుతుంటే కలిగిన బాధతో నీ తరపున నా మీద నేను ప్రతీకారం తీర్చుకున్నాను….”

రవి చెప్తుంటే నేను ఆశ్చర్యంగా చూసాను…
కొన్ని వందల పేర్లు ఉన్నట్టున్నాయి అతని శరీరం మీద…
అన్ని సార్లు అంత చిన్నగా పేర్లు రాస్తే ఎన్ని సూదుల పోట్లు గుచ్చి ఉండాలి…
తలుచుకుంటేనే నా ఒళ్ళు జలదరించింది….

” దీని వల్ల నీకు జరిగిన ఉపకారం ఏమీ ఉండకపోవచ్చు కానీ నాకు మాత్రం ఎవరిమీదో తీవ్రమైన కసి తీర్చుకున్న ఫీలింగ్ కలిగింది…
కొంతలో కొంత సాంత్వన లభించింది…
రక్తాలు కారిన నా శరీరం గాయాలు తగ్గడానికి మరో రెండు వారాలు పట్టింది….
కానీ నా మనసుకు నేను చేసుకున్న గాయం ఇంకా ఫ్రెష్ గా ఉండి నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంది…
అది నీ గురించే ఆలోచిస్తుంది…
నువ్వెంత బాధపడుతున్నావో అని ఎప్పుడూ బాధ పడుతూనే ఉంది…
ఏం చేస్తే నీకు మేలు జరుగుతుంది అని మదన పడింది………….”

ఇన్నాళ్లు నేనొక్కదాన్నే బాధ పడ్డాను అనుకున్నా నేను… కానీ ఇప్పుడు రవి చెప్తున్నది వింటుంటే రవి కూడా నాతో సమానంగా బాధ పడ్డట్టు అనిపిస్తుంది నాకు…
కానీ ఇదంతా నిజంగా నిజమేనా అని ఒక సందేహం కూడా కలిగింది…
పచ్చబొట్లు అయితే కనబడుతున్నాయి…
కానీ అతను చెప్పేవన్నీ నిజమేనా…

“……….. ముంబై లో ఉన్న మూడు వారాలు నీ గురించే ఆలోచించా అక్షర… కానీ నాకు ఏం చేయాలో తెలియలేదు….
మళ్లీ ఇక్కడికి వచ్చాక ఒక రోజు మీ బావ ఇంటికి వచ్చి మమ్మల్ని డిన్నర్ కి పిలిచాడు…
అమ్మ బలవంతం మీద నేనూ వెళ్ళాను…

2 Comments

Add a Comment
  1. Continue story waiting for next part and who is that another person in storie

  2. Intha beautiful ga unna storie lo vere evado ravadam baledu. First lo vachhina “athan” evaru. Is raju

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *